Reading Time: 3 mins

మిస్సింగ్ మూవీ రివ్యూ

సస్పెన్స్ థ్రిల్లర్ ‘మిస్సింగ్’ – రివ్యూ

Emotional Engagement Emoji (EEE)  
 
?

థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్ష‌కుల వర్గం వేరేగా ఉంటుంది.వాళ్లు చాలా తెలివిగా ఉంటూంటారు.  తెర‌పై ఓ స‌ీన్  న‌డుస్తోంటే..చాలా కాన్సర్టేట్ గా ఆ సీన్ కు ముందు ,వెనక అన్నీ ఊహిస్తూ,ఆలోచిస్తూ ఎంజాయ్ చేస్తూ సినిమా చూస్తూ మొత్తం చెప్పేయ‌గ‌ల స‌మ‌ర్థులు. వారిని ఒప్పించగలడమే థ్రిల్లర్ సినిమాల దర్శకులకు పెద్ద ఛాలెంజ్.  వాళ్ల తెలివితేట‌ల‌కే పోటీగా పరీక్షగా కథను నడపాలంటే చాలా తెలివిగా వ్య‌వ‌హ‌రించాలి.  స‌స్పెన్స్‌, థ్రిల్ల‌ర్‌… స‌క్సెస్ అయ్యేది అక్కడే.  ఓ థ్రిల్ల‌ర్ సినిమా హిట్ అయ్యాయంటే ఆ క‌థ‌ని ద‌ర్శ‌కుడు ప్రేక్ష‌కుడి కంటే ఓ మెట్టుపైన నిల‌బ‌డి ఆలోచించిన‌ట్టు లెక్కేసుకోవాలి.  ఈ సినిమా దర్శకుడు కూడా తెలివైన ద‌ర్శ‌కుడే. కథని మెల్లిగా సాదాసీదాగా మొదలెట్టి థ్రిల్ల‌ర్ జోన‌ర్ లోకి ప్రవేశించి ఆకట్టుకునే ప్రయత్నం చేసాడు.  అంతా కొత్తవాళ్లతో చేసిన ఈ థ్రిల్లర్ ప్రేక్షకులును ఏ స్దాయిలో ఎంగేజ్ చేసింది. దర్శక,నిర్మాతలకు విక్ట‌రీని అందించిందా? కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ని  పంచ‌గ‌లిగిందా? రివ్యూలో చూద్దాం.
 
స్టోరీ లైన్

గౌతమ్ (హర్ష నర్రా), శ్రుతి (నిక్కిషా)ల జంట పెళ్లి చేసుకొని హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తూంటారు. ఓ రోజు షాపింగ్ మాల్ కు వెళ్తూండగా కారుకు ఏక్సిడెంట్ అవుతుంది. . గాయాలపాలైన గౌతమ్ ఆస్పత్రిలో చేరుతాడు. అతనికి స్పృహ వచ్చాక భార్య శృతి మిస్ అయ్యిందని తెలుస్తుంది. అదే సమయమంలో ఆ యాక్సిడెంట్ తో  గౌతమ్ కి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ వస్తుంది. ఈ షార్ట్ టర్మ్ మెమరీ లాస్ తో మిస్ అయిన తన భార్య శ్రుతిని హర్ష  కనిపెట్టగలిగాడా? కిడ్నాప్ కేసులు సాల్వ్ చేయడంలో పేరున్న ఏసీపీ త్యాగి (రామ్ దత్) ఈ కేసు విషయంలో ఏం చేసారు. శృతి కోసం గౌతమ్ అన్వేషిస్తూంటే.. వివేక్, రాజు, శ్రీధర్..ఇలా నలుగురు ఒక్కొక్కరుగా ఎందుకు  చంపడబడతారు.  ఈ కథలో మీనా (మిషా నారంగ్) పాత్ర ఏమిటి? శ్రుతి మిస్ అవ్వడానికి మీనాకి సంబంధం ఏమిటి?  శృతిని గౌతమ్ కాపాడుకున్నాడా వంటి విషయాలు తెలియాలంటే  “మిస్సింగ్” చూడాల్సిందే.

విశ్లేషణ

స్టోరీ ఇంత సింపుల్‌గా అనిపించినా.. ట్రీట్ మెంట్ అయితే ఇంత సింపుల్ గా రాసుకుని ఉండరు.మొదటి సీన్ లోనే..  క‌థ మొద‌ల‌వుతుంది. తెర‌పై ఒకొక్క స‌న్నివేశం వ‌చ్చి పోతున్న కొలిగీ కథ కదలటం మొదలవుతుంది. అయితే ఇంద‌తా ఎందుకు? ఏం జ‌రుగుతుందో చూసేవాడికి మొదటఅర్థం కాదు. గంద‌ర‌గోళంగా ఉన్నా… కానీ.. ఆయా సీన్స్ ఒకే మూడ్‌లో, ఒకే టెక్నిక్ తో సాగుతుండటం ముచ్చటేస్తుంది. సినిమా తాలుకూ క‌ల‌ర్‌, టోన్‌.. అన్నీ ఒకే స్కీమ్ లో న‌డుస్తుంటాయి. ఆ విధానం నచ్చుతుంది. అయితే ఎత్తుగడ జరిగిన చాలా సేపు వరకూ స‌గం సినిమా గ‌డిచినా… ఈ క‌థ ఏ జోన‌ర్‌లో సాగుతోందో.. అస‌లు మెలిక ఏమిటో తెలియ‌క‌పోవ‌డం… ఇబ్బందిగా అనిపిస్తుంది. పైగా..లెంగ్త్ కూడా ఎక్కువే. అయితే డైరక్టర్ ఏం రాసుకున్నాడో, అదే తీసుకుంటూ వెళ్లాడని అర్దమవుతుంది. కొన్ని సార్లు మరీ ఎక్కువైన  డిటైలింగ్ కాస్త ఇరిటేట్ చేస్తూంటుంది. చివ‌రి అర గంట‌.. ఈ క‌థ‌ని మ‌రో లెవ‌ల్‌కి తీసుకెళ్ళాలని ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇచ్చుకుంటూ వెళ్లాడు ద‌ర్శ‌కుడు. అప్ప‌టి వ‌ర‌కూ వేసిన చిక్కుముడుల‌న్నీ విప్పుకుంటూ వెళ్తుంటే.. అస‌లు ఏ స‌న్నివేశం, ఎందుకు జ‌రిగిందో అర్థం అవుతుంటుంది. కానీ ఇంత చిన్న కథకు ఇన్ని అవసరమా అనిపిస్తుంది.

అలాగే… ఇంత వ‌ర‌కూ మనం తెరపై చూడ‌ని న‌టీన‌టులతో కథ నడుస్తూండటం  వ‌ల్ల‌, వాళ్ల‌ని ఐడెంటిఫై చేసి, ఆ పాత్ర‌ల‌తో పాటు ప్రేక్ష‌కుడూ ప్ర‌యాణం చేయ‌డం మొద‌ట్లో కాస్త క‌ష్టంగానే ఉంటుంది.కొన్ని సీన్స్ ట్విస్ట్ లు కోసం ఓపెన్ చేయకుండా దాచటంతో ఆ  స‌న్నివేశాలు గ‌జిబిజిగా సాగుతుంటాయి. ఏ ఓటీటీలో చూసే అవ‌కాశం ఉంటే పాజ్ ఇచ్చి, కాస్త రివైండ్ చేసి, ఆ సీన్ ఏదో అందులో ఏం చెప్పాడో స్ప‌ష్టంగా ఇంకోసారి అర్దం చేసుకునే ఛాన్సుంది. అదే థియేట‌ర్లో చూడటంతో అక్కడక్కడా విసుగిస్తుంది. అయితే ఫస్టాఫ్ ని ఓపిగ్గా చూస్తే..ఆ తర్వాత అక్కడ వచ్చే ప్రతి సీన్ కు సెకండాఫ్ లో ని మరో సీన్ కు ముడిపెడుతూ, అందులో పాత్రలను ఇన్వాల్వ్ చేస్తూ డైరక్టర్ చేసిన స్క్రీన్ ప్లే బాగుందనిపిస్తుంది. అయితే ఇంకాస్త వర్క్ చేయాల్సింది.

టెక్నికల్ గా…

థ్రిల్ల‌ర్ నిడివి ఎంత త‌క్కువ ఉంటే అంత మంచిది అంటుంటారు. ఆ సూత్రాన్ని గుర్తు పెట్టుకుంటే బాగుండేది కథలో  ఆయా పాత్ర‌ల కోసం ఎంచుకున్న న‌టీన‌టులు ప‌ర్‌ఫెక్ట్‌గా త‌మ వంతు న్యాయం చేయటం కలిసొచ్చింది. వాళ్లు చాలావరకూ స‌హ‌జంగా న‌టించారు. ఎవ‌రూ లిమిట్ దాటి ప్ర‌వ‌ర్తించ‌లేదు. ఇక నేప‌థ్య సంగీతం, కెమెరా వ‌ర్క్‌, ఆర్ట్…. ఇవ‌న్నీ ఓ టోన్ లో సినిమాని ఎలివేట్ చేస్తూ సాగాయి. డైరక్టర్ భావాల‌ను అనుగుణంగా ప‌నిచేశారంతా. కొన్ని డైలాగులూ ఆక‌ట్టుకుంటాయి. డైలాగులు క‌థ నేప‌థ్యాన్ని ప్ర‌తిబింబిస్తూ ముందుకు వెళ్తాయి.   నేపథ్య సంగీతం, పాటలు అందించిన మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడది ఈ థ్రిల్లర్ సక్సెస్ లో మరో కీ రోల్ పోషించాడు.గౌతమ్ క్యారెక్టర్ హర్ష నర్రా ఎంతో ఎక్సపీరియన్స్ ఉన్న నటుడిలా చాలా ఈజీగా నటించాడు.  అలాగా శృతి క్యారెక్టర్ లో నిక్కీషా రంగ్వాలా బాగా నటించింది.   రిపోర్టర్ మీనా క్యారెక్టర్ లో మిషా నారంగ్ మెప్పిస్తుంది.  ఇతర నటీనటుల కూడా కథలో ఒదిగిపోయారు.

నచ్చినవి
కాన్సెప్టు
బ్యాక్ గ్రౌండ్ స్కోర్

నచ్చనవి

తెలిసిన ఆర్టిస్ట్ లు లేకపోవటం
స్క్రీన్ ప్లే

చూడచ్చా…

  థ్రిల్ల‌ర్ లవర్స్ ఓ స‌రికొత్త థ్రిల్ల‌ర్ చూడాలంటే.. మాత్రం థియోటర్ కు వెళ్లి చూడాల్సిందే.

  తెర వెనక, ముందు

 బ్యానర్: బజరంగబలి క్రియేషన్స్
 నటీనటులు: హర్ష నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్, రామ్ దత్, చత్రపతి శేఖర్, విష్ణు విహారి, అశోక్ వర్థన్, వినోద్ నువ్వుల తదితరులు
ఎడిటర్: సత్య జి,
 సంగీతం: అజయ్ అరసాడ,
సినిమాటోగ్రఫి: జనా. డి,
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీని జోస్యుల
 నిర్మాతలు: భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు
 ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిరణ్
రన్ టైమ్: 2 hr 13 Mins
 రిలీజ్ డేట్: 2021-11-19