Reading Time: 3 mins

మేమ్ ఫేమస్ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, మ్యూజిక్ వీడియోలు చేసి పాపులారిటీ సంపాదించిన సుమంత్ ప్రభాస్ హీరోగా చేసిన చిత్రం ఇది. మీడియా రంగంలో పాపులర్ అయిన ఛాయ్ బిస్కట్ వారు నిర్మించిన సినిమా ఇది. ఈ క్రమంలో రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ అందరినీ విపరీతంగా ఆకట్టుక్కున్నాయి. అంతేకాదు సూపర్ స్టార్ మహేష్ బాబు (MaheshBabu) ఈ సినిమా గురించి ప్రశంసించడం కూడా ఈ సినిమా మీద కొంచెం ఆసక్తి లేపింది. ఈ క్రమంలో ఈ సినిమా ఎలా ఉందిసినిమా హిట్టైనా, కొత్త కుర్రాళ్లకు కలిసి వచ్చిందేమిటివంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్ :

బండ నర్సింపల్లి గ్రామానికి చెందిన కుర్రాళ్లు మహేశ్ ( సుమంత్ ప్రభాస్) బాలాజీ (మౌర్య) దుర్గ (మణి). ముగ్గురూ కూడా లో మిడిల్ క్లాస్. కుటుంబ భాధ్యత లేకుండా బలాదూర్ గా తిరిగే బ్యాచ్ . యాజ్ యూజువల్ గా తల్లిదండ్రులతో పాటు ఊళ్లో అంతా వాళ్లను తిట్టిపోస్తూ ఉంటారు. ఎలక్షన్ టైమ్ లో తమకు ఉపయోగపడుతున్నారని వీళ్లని సర్పంచ్ వేణు మాత్రం సపోర్ట్ చేస్తూ,సాయం చేస్తూ ఉంటాడు వీళ్లకు లవ్ స్టోరీలు. వీళ్లు బేవర్స్ అనే కారణంగా పిల్లను ఇవ్వడానికి సొంత మేనమామ కూడా ముందుకు రాడు. ఈ ముగ్గురు తమ లవ్ స్టోరిలు సక్సెస్ కావాలంటే  తాము ఫేమస్ కావాలి . అందులో భాగంగానే ముగ్గురూ కలిసి టెంట్ హౌస్ పెడతారు. కానీ వీళ్ల టైమ్ బాగోక షార్ట్ సర్క్యూట్ వలన ఆ షాపు తగలబడిపోతుంది. అప్పుడు ఆ ముగ్గురు కుర్రాళ్లు ఏం చేయాలో అని ఆలోచిస్తున్న టైమ్ లో సిటీ నుంచి ఒక ఛానల్ వారు ప్రాంక్ వీడియో షూట్ చేయడానికి వస్తారు. దాంతో తాము కూడా యూ ట్యూబ్ వీడియోస్ చేసి ఫేమస్ కావాలనే ఆలోచన హీరో బృందానికి వస్తుంది. అక్కడనుంచి ఎలా ఫేమస్ అవుతారు? అనేదే కథ.

ఎనాలసిస్ :

ఈ మధ్య కాలంలో తెలంగాణా నుంచి వస్తున్న చిన్న సినిమాలకి మరింత ఆదరణ బాగా పెరుగుతోంది. సింపుల్ బడ్జెట్ లో మంచి కంటెంట్ ను ప్లాన్ చేసుకుని, థియేటర్స్ కి తీసుకుని వస్తున్నారు. సక్సెస్ అవుతున్నారు. బలగం సినిమా అలాంటిదే. చిన్న సినిమాల ద్వారా కొత్త దర్శకులు  హీరోలు  ఇతర నటీనటులు పరిచయమవుతున్నారు. ఇక కొత్త కుర్రాళ్లు దర్శకత్వ బాధ్యతలను కూడా తమ పైనే వేసుకుని, రంగంలోకి దిగుతున్నారు. అలా వచ్చిన సినిమానే మేమ్ ఫేమస్. సుమంత్ ప్రభాస్ ఈ సినిమాతో హీరోగాను  దర్శకుడిగాను పరిచయమయ్యాడు. తనే కథ  స్క్రీన్  మాటలు అందించాడు. అయితే స్క్రిప్టు సరిగ్గా రాసుకోలేకపోయారు. ఓ క్రికెట్ ఎపిసోడ్‌తో సినిమా సాదాసీదాగా మొదలెట్టి అక్క‌డి నుంచి కీ క్యారక్టర్స్ ని ప‌రిచ‌యం చేస్తూ అస‌లు క‌థ మొద‌ల‌ెట్టారదు. అయితే, వారిలో ఏ ఒక్క‌రి క‌థ‌లోనూ అంత‌గా డెప్త్ క‌నిపించ‌దు. హీరో బ్యాచ్ త‌ర‌చూ ఏదోక గొడ‌వ పెట్టుకోవ‌డం ఊరి పెద్ద‌లు ర‌చ్చ‌బండ ద‌గ్గ‌ర పంచాయితీ పెట్ట‌డం ఇదే జరుగుతుంది. అయితే అక్కడక్కడా కామెడీ టచ్ ఇస్తూ వెళ్లాడు. మేకప్ లేకుండా ఓ సాధారణ పల్లెటూరు కుర్రాడి మాదిరిగా తెరపై కనిపిస్తూ, కథని కనెక్ట్ చేయడానికి తనవంతు ప్రయత్నం చేశాడు. కానీ కంటెంట్ కరెక్ట్ గా లేకపోవటంతో దెబ్బ కొట్టింది యూ ట్యూబ్ వీడియోస్ చేసి ఫేమస్ కావాలనే ఆలోచన హీరో బృందానికి వస్తుంది. ఇక్కడి నుంచి కథలోని పట్టు సడలిపోతుంది. సన్నివేశాలను సాగదీస్తున్నట్టుగా  అనవసరమైన సీన్స్ తో బోర్ కొట్టేస్తుంది. ఫస్టాఫ్ మాదిరిగానే సెకండాఫ్ విషయంలో దృష్టి పెట్టలేదు. సినిమా తీయ్యాలనే ఉత్సాహమే తప్పిస్తే కంటెంట్ లో బలం ఎక్కడా కనిపించదు. కథలో కొత్తదనం లేకపోవడం  సెకండాఫ్ లో కథనంలో వేగం తగ్గడం  సన్నివేశాలు బలహీనంగా ఉండటం ఇవన్నీ ఈ టీమ్ అనుభవ లేమని ఎత్తి చూపెడతాయి. ఏదో కొత్త కుర్రాళ్లు చేసారు అని ప్రోత్సాహం ఇద్దామన్న ఉత్సాహం మనలో ఎంతో సేపు ఉండనివ్వరు.

టెక్నికల్ గా చూస్తే :

కల్యాణ్ నాయక్ పాటలు జస్ట్ ఓకే. అయ్యయ్యో  గల్లీ సిన్నది వంటి పాటలు ఆకట్టుకుంటాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే నడిచింది. సీన్స్ కి తగిన ఎమోషన్స్ కనెక్ట్ చేస్తూ వెళుతుంది. శ్యామ్ ఫొటోగ్రఫీ ఓ మాదిరిగా ఉంది. ఇక సృజన ఎడిటింగ్ విషయానికి వస్తే, సెకండాఫ్ లో లింగం లవ్ స్టోరీ వంటి కొన్ని సీన్స్ ను లేపేస్తే బాగుండని అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ జస్ట్ ఓకే. డైలాగులు కొన్ని చోట్ల బాగా పేలాయి.

నటీనటుల్లో :

హీరోగా మ‌యి పాత్ర‌లో త‌న‌దైన న‌ట‌న‌తో సుమంత్ ఫ‌ర్వాలేద‌నిపించాడు. న‌ట‌న‌లో మెచ్యూరిటీ లేదు. చాలా ఎమోషన్స్ పలకటం లేదు. అత‌ని ప్రెండ్స్ పాత్ర‌ల్లో మ‌ణి, మౌర్య ప‌రిధి మేర‌కు చేసుకుంటూ వెళ్లారు.

చూడచ్చా?

ఫస్టాఫ్ తెలంగాణా పల్లెలో ఉంటే,సెకండాఫ్ ఎన్నో సినిమాల్లో ఉంటుంది. కాబట్టి మరీ ఎక్కువ కొత్తదనం ఆశించకుండా వెళ్తే బాగుందనిపిస్తుంది.

ప్లస్ లు :

కొత్త కుర్రాళ్ల ఉత్సాహం
తెలంగాణా పల్లెలో కనపడే పాత్రలను తెరపై యాజటీజ్ చూపించటం

మైనస్ లు :

యూట్యూబ్ కోసమో, ఓటిటి కోసమో తీసిన సినిమాలా అనిపించటం.
సౌండ్ అస్సలు బాగోలేదు.
మాటలు సరిగ్గా వినిపించలేదు.

న‌టీన‌టులు :

సుమంత్ ప్ర‌భాస్‌, మ‌ణి ఏగుర్ల‌, మౌర్య‌, సార్య, సిరి రాశి, శివ నంద‌న్‌, అంజి మామ‌, ముర‌ళీధ‌ర్ గౌడ్‌, కిర‌ణ్ మ‌చ్చా త‌దిత‌రులు,

సాంకేతికవర్గం :

సంగీతం: క‌ల్యాణ్ నాయ‌క్‌,
ఛాయాగ్ర‌హ‌ణం: శ్యామ్ దూపాటి,
ర‌చ‌న, ద‌ర్శ‌క‌త్వం: సుమంత్ ప్ర‌భాస్‌,
నిర్మాత‌లు: అనురాగ్ రెడ్డి, శ‌ర‌త్ చంద్ర‌, చంద్రు మ‌నోహ‌ర్‌,
రన్ టైమ్ :149 మినిట్స్
విడుద‌ల తేదీ: 26-05-2023