మొక్కలు నాటిన హాస్య నటుడు ఖయ్యుం

Published On: August 4, 2020   |   Posted By:
మొక్కలు నాటిన హాస్య నటుడు ఖయ్యుం
 
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన హాస్య నటుడు ఖయ్యుం
 
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హాస్య నటుడు అలీ విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు మనికొండ లోని తన నివాసంలో  మొక్కలు నాటిన హాస్య నటుడు ఖయ్యుం, అంతరం తను మాట్లాడుతూ కరోనా విస్తరిస్తున్న ఈ సమయంలో ఆక్సిజన్ ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం మనకు ఆక్సిజన్ కావాలంటే మనమందరం మొక్కలు విరివిగా నాటాలి కాబట్టి ప్రతి ఒక్కరు వీలైనన్ని మొక్కలు నాటాలని తన సూచించారు, అలాగే హీరో ప్రిన్స్ ,నటుడు అల్లం అనిల్ ,నటుడు భూపాల్ రాజు, బిగ్ బాస్ ఆదర్శ్ బాలకృష్ణ లను తను నామినేట్ చేశారు, అలాగే ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.