మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ వేస‌విలో విడుద‌ల

Published On: January 13, 2021   |   Posted By:
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ వేస‌విలో విడుద‌ల
 
 
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే, బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కాంబినేష‌న్ లో జిఏ2 పిక్చ‌ర్స్ ” మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సంక్రాంతి పోస్ట‌ర్ విడుదల 2021 వేస‌విలో విడుద‌ల కాబోతున్న అకిల్ అక్కినేని – జీఏ2 పిక్చ‌ర్స్ – బొమ్మరిల్లు భాస్క‌ర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్
 
అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న చిత్రం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్.  టాలెంటెడ్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో రెడీ అవుతున్న ఈ సినిమాను టాలీవుడ్ లో వ‌రుస‌గా భ‌లేభ‌లేమ‌గాడివోయ్‌, పిల్లానువ్వులేని జీవితం, గీతగోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్స్ తో  మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా క్రేజ్ ని సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” సినిమా అనౌన్స్‌  దగ్గర నుంచి అక్కినేని అభిమానుల్లో ఫుల్ క్రేజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్‌ టీం విడుదల చేసిన అఖిల్ అక్కినేని ఫస్ట్ లుక్ కు,  అలానే  గొపిసుంద‌ర్ సంగీత‌సార‌ధ్యంలో హ్యాపెనింగ్ స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన మనసా మ‌న‌సా పాటకు, ఆ త‌రువాత విడుదల చేసిన టీజ‌ర్ కు అటు సోషల్ మీడియా లో ఇటు అభిమానుల్లో అనూహ్యమైన స్పందన లభించడం యూనిట్ లో కొత్త ఉత్సాహ‌న్ని తెచ్చింది. ఇదే ఉత్సాహంతో అక్కినేని అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తూ యూనిట్ తాజగా ఈ సినిమాకు సంబంధించిన సంక్రాంతి పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్ట‌ర్ లో అఖిల్ – పూజా మ‌ధ్య కెమిస్ట్రీ క‌నువిందుగా ఉంది. అలానే అఖిల్ అక్కినేని మ్యాన్లీ లుక్ అల్ట్రా స్టైలిష్ గా ఉంది.
ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్ తో ల‌వ్ లీగా వుండే కేర‌క్ట‌ర్స్ గా డిజైన్ చేస్తారు. అందుకే ఆయ‌న చిత్రాల‌కి ఓ స్పెషాలిటి వుంటుంది. అఖిల్ అక్కినేని, పూజా ల మ‌ద్య ఎలాంటి కెమిస్ట్రి ఈ చిత్రంలో  వుండ‌బోతుందో ఈ పోస్ట‌ర్ డిజైనింగ్ లో చాలా చ‌క్క‌గా, అందంగా చూపించారు ద‌ర్శ‌కుడు భాస్క‌ర్‌. ఈ సినిమాను వేసవిలో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత బ‌న్నీ వాసు స‌న్నాహాలు చేస్తున్నారు
 
న‌టీ న‌టులు
 
అఖిల్ అక్కినేని
పూజా హెగ్ఢే
ఆమ‌ని
ముర‌ళి శ‌ర్మ‌
జ‌య ప్ర‌కాశ్
ప్ర‌గ‌తి
సుడిగాలి సుధీర్
గెటెప్ శ్రీను
అభ‌య్
అమిత్
 
సాంకేతిక నిపుణులు
 
బ్యానర్ : జీఏ2 పిక్చ‌ర్స్  
స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌‌వింద్  
మ్యూజిక్ : గోపీ సుంద‌ర్
సినిమాటోగ్రాఫీ : ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ
ఎడిట‌ర్ : మార్తండ్ కే వెంక‌టేశ్
ఆర్ట్ డైరెక్ట‌ర్ : అవినాష్ కొల్లా
నిర్మాత‌లు : బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌  
డైరెక్ట‌ర్ : బొమ్మ‌రిల్లు భాస్క‌ర్