యాక్షన్ చిత్రం ప్రీ రిలీజ్ కార్యక్రమం
‘యాక్షన్’ మూవీ ఒక విజువల్ ట్రీట్‌గా ఉంటుంది – మాస్ హీరో విశాల్
మాస్ హీరో విశాల్, తమన్నా హీరోహీరోయిన్లుగా సుందర్ సి. దర్శకత్వంలో రూపొందుతున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘యాక్షన్’. ‘హుషారు’,’ఇస్మార్ట్ శంకర్’, ‘గద్దలకొండ గణేష్’, ‘రాజుగారిగది3 ‘ వంటి సూపర్‌హిట్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన శ్రీనివాస్ ఆడెపు నిర్మాతగా శ్రీకార్తికేయ సినిమాస్ పతాకంపై ‘యాక్షన్’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇటీవల డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ విడుదల చేసిన ట్రైలర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం నవంబర్15న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. కాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ దసపల్లా కన్వెన్షన్స్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా…
హీరోయిన్ తమన్నా మాట్లాడుతూ – ”ఇప్పటివరకూ నేను చేసిన అన్ని సినిమాలని మీరు ఆదరించారు. దానికి ఎంత థాంక్స్ చెప్పినా సరిపోదు. మీరు ఈసినిమాను ఎంజాయ్ చేస్తారని నాకు నమ్మకం ఉంది ఎందుకంటే నాకు తెలిసినంతవరకు బెస్ట్ కమర్షియల్ మూవీస్, బెస్ట్ యాక్షన్ మూవీస్ తెలుగులోనే వచ్చాయి. మన ఆడియన్స్ మాస్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే మీ అందరికీ తెలుసు విశాల్ నెక్స్ట్ లెవెల్ మాస్ అని. ఇది నాకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. ప్రతి షాట్‌కి నాకు సపోర్ట్ చేసిన విశాల్ గారికి థాంక్స్. నవంబర్ 15న థియేటర్స్‌లో కలుద్దాం” అన్నారు.
హీరో ఆదిత్ మాట్లాడుతూ – ”విశాల్ గారికి చాలా మంది లేడీస్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. సుందర్.సి గారికి నేను హ్యుజ్ ఫ్యాన్. చాలా మందికి ఆయన కమల్ హాసన్ గారితో చేసిన ‘సత్యం శివం సుందరం’ గురించి తెలుసు. ఈ సినిమా ఒక పవర్ ప్యాక్డ్ యాక్షన్ బ్లాక్ బస్టర్” అన్నారు.
హీరో ప్రిన్స్ మాట్లాడుతూ – ”సాంగ్స్ చాలా బాగున్నాయి. ‘యాక్షన్’ సినిమా ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ నేేను విశాల్అన్న ‘డిటెక్టివ్’ సినిమా చూశాను. ఆ సినిమాలో ఒక్క సాంగ్ కూడా లేదు. అయినా ఆ సినిమా పెద్ద హిట్ అయింది. ఆ సినిమాలాగే ‘యాక్షన్’ మూవీ కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అలాగే ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు నా నెక్స్ట్ మూవీకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్. డిసెంబర్లో నెక్స్ట్ షెడ్యూల్ చేయబోతున్నాం. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్” అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిజా(ఆది)మాట్లాడుతూ – ”యాక్షన్ మూవీకి సాంగ్స్ స్కోర్ చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో నాలుగు పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేశాను. అలాగే ఈ సినిమాలో ఒక ర్యాప్ సాంగ్ ఉంది. దాన్ని రోల్ రైడా పాడారు. నేను తెలుగులో రెండే మూవీస్ చేసిన మీ అందరి అభిమానానికి థాంక్స్. త్వరలో ఇండిపెండెంట్ మ్యూజిక్ చేస్తాను. ఈ సినిమాలో రానా దగ్గుపాటి గారు ఫస్ట్ టైమ్ ఒక ర్యాప్ సాంగ్ పాడారు. అది త్వరలోనే మీ ముందుకు వస్తుంది. విశాల్ అన్న నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. మరో సారి ఆయనతో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది” అన్నారు.
హీరోయిన్ ఐశ్వర్య లేక్ష్మి మాట్లాడుతూ – ”ఈ సినిమాలో నాక్యారెక్టర్కి సంబందించిన ఎక్కువభాగం హైదరాబాద్‌లోనే షూట్ చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాలో ఎక్కువ ఫ్యామిలీ సీక్వెన్స్‌లు కూడా ఇక్కడే షూట్ చేశాం. మళ్ళీ ప్రమోషన్స్‌కి ఇక్కడికే రావడం హ్యాపీగాఉంది. ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. తప్పకుండా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది” అన్నారు.
హీరోయిన్ ఆకాంక్ష మాట్లాడుతూ – ”ఈ సినిమాలో నాది నెగటివ్ క్యారెక్టర్. విశాల్ గారితో కలిసి కొన్ని యాక్షన్ సీన్స్ కూడా చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన సుందర్సర్కి థాంక్స్. ఈ సినిమాలో లాంగ్ యాక్షన్ సీక్వెన్స్ ఆడియన్స్‌ని థ్రిల్ చేస్తాయి. టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్” అన్నారు.
ప్రొడ్యూసర్ శ్రీనివాస్ ఆడెపు మాట్లాడుతూ – ” నేను 18 సంవత్సరాలుగా ఇండస్ట్రీ లో ఉన్నాను. ఇంజినీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్ వేర్ జాబ్ చేశాను. అది అంత శాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. తర్వాత డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. ఆ క్రమంలోనే 6-7 సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాను. ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్కి వచ్చి ‘ఇస్మార్ట్ శంకర్’, ‘గద్దలకొండ గణేష్’, ‘రాజుగారి గది 3 ‘ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేశాను. ఇప్పుడు ‘యాక్షన్’మూవీతో ప్రొడ్యూసర్‌గా మారినందుకు చాలా హ్యాపీగాఉంది. అలాగే ప్రిన్స్ హీరోగా ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను. విశాల్ అన్న చాలా దూరం ట్రావెల్ చేసి నాకోసం ఇక్కడికి వచ్చారు. ఈసందర్భంగా విశాల్ అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే తమన్నా గారు రావడం కూడా హ్యాపీ. అలాగే ఆకాంక్ష, ఐశ్వర్య ఫస్ట్ టైమ్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అందరికీ ఆల్ ది బెస్ట్ ”అన్నారు.
హీరో విశాల్ మాట్లాడుతూ – ”యాక్షన్’ నా కెరీర్ లో 27వ సినిమా. 27సినిమాల్లో ఎన్ని దెబ్బలు తగలాలో ఈ సినిమాలో అన్ని దెబ్బలు తగిలాయి. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ ‘యాక్షన్’ తప్ప మరే టైటిల్ అనిపించలేదు. ఇది ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థిల్లర్. సుందర్.సి గారి డ్రీమ్ ప్రాజెక్ట్. మీరు సినిమా చూస్తున్నపుడు ఇది 150 కోట్ల బడ్జెట్ మూవీలా కనిపిస్తుంది. కానీ 60 కోట్ల బడ్జెట్. 88 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. అందుకు డైరెక్టర్ సుందర్.సి గారే కారణం. ఆయన ఎప్పుడూ నిర్మాతలు బాగుండాలని సినిమా తీస్తారు. చాలా మంది హీరోలు మూడు రాష్ట్రాల్లో గుర్తింపు రావాలని కోరుకుంటారు. కానీ కొంత మందికే అది వస్తుంది. అలా మీ అభిమానంతోనే ఇంతవరకు రాగలిగాను. నాకు గుడి అంటే థియేటర్, దేవుళ్ళు మీరే. ఈ సినిమా నాకెరీర్‌లో ఒక మైల్ స్టోన్ మూవీ అవ్వాలని సుందర్ గారు తీశారు. దానికి తగ్గట్టుగానే ‘యాక్షన్’ మూవీ ఒక విజువల్ ట్రీట్‌గా ఉంటుంది. నేను లక్ష్మికళ థియేటర్లో నేల టికెట్ కొనుక్కొని సినిమా చూస్తాను. అది మీకు తెలీదు. అలా చూస్తున్నప్పుడు ఏ సీన్‌కి ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారో, ఏ సీన్ ఇంకా బాగాఉండాలని కోరుకుంటున్నారో నాకు తెలిసేది. అలా కొంత హోమ్ వర్క్ చేసి ఈ సినిమా తీశాం. ట్రైలర్లో మీరు చూసిన ఆ బైక్ సీన్ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు అది నా మీదకు వచ్చింది. అయితే ఆ దేవుడి దయ, నాన్న గారి జీన్స్ ఫిటినెస్ నన్ను కాపాడాయి. ‘నువ్వు హైదరాబాద్‌కి వెళ్ళేటప్పుడు ఇది నీ సినిమా అనే గుర్తింపును నువ్వు ఎంజాయ్ చేయాలి ఇది నా కల. ఇది తండ్రిగా, నటుడిగా నేను నీకు ఇచ్చిన గిఫ్ట్’ అని నాన్నగారు చెప్తుండేవారు. అలాగే తమన్నా గారితో నా సెకండ్ మూవీ. అలాగే ఐశ్వర్య, ఆకాంక్ష ఇద్దరూచాలా బాగా చేశారు. అలాగే ఈ సినిమాలో నా బెస్ట్ ఫ్రెండ్ రానా ఒక ర్యాప్ చేశారు. త్వరలోనే మీరు వింటారు. ఈ సినిమా నవంబర్ 15న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతుంది. శ్రీనుకి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఎందుకంటే నా తమ్ముళ్లు చాలా మంది ఉన్నారు తెలుగు సినిమాల్లో.. వారితో ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలి. శ్రీను మంచి విజన్ ఉన్న ప్రొడ్యూసర్. సినిమా తీయాలంటే కేవలం డబ్బు ఉంటే సరిపోదు దానికి తగ్గ ఫ్యాషన్ ఉండాలి. అలా ఉంటేనే మనం ఖర్చుపెట్టే డబ్బు కరెక్ట్‌గా అందుతుంది. మంచి సినిమా దొరుకుతుంది. లాంటి ఫ్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్ శ్రీను. తెలుగులో అభిమన్యుడు కంటే ఎక్కువ షేర్ సాధిస్తుంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను సినిమా చూశాను. అంత బాగా వచ్చింది. అలాగే శ్రీను నా ఫ్యామిలీలో ఒక పార్ట్ అయ్యాడు. అలాగే తెలుగు మీడియా గురించి మేము చెన్నెలో చాలా గర్వంగా మాట్లాడుకుంటాము. ఏ సినిమా అయినా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి మీడియా తమవంతు సాయం చేస్తుంది. అలాంటి తెలుగు మీడియాకు నా కృతజ్ఞతలు. ఇక్కడ మేము చెప్పిన ప్రతి విషయం రేపు నవంబర్ 15న స్క్రీన్ మీద డబుల్‌గా కనిపిస్తుంది” అన్నారు.
మాస్ హీరో విశాల్, తమన్నా, ఐశ్వర్య లేక్ష్మి, ఆకాంక్ష తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హిప్హాప్తమిళ, సినిమాటోగ్రఫీ:డుడ్లీ, ఎడిటింగ్: ఎన్.బి.శ్రీకాంత్, నిర్మాత: శ్రీనివాస్ ఆడెపు, దర్శకత్వం: సుందర్ సి.