రచయిత ట్రయిలర్ రివ్యూ

Published On: December 11, 2017   |   Posted By:

రచయిత ట్రయిలర్ రివ్యూ


సీనియర్ నటుడు జగపతిబాబు స్వయంగా రంగంలోకి దిగారు. రచయిత అనే సినిమాకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడానికి ముందుకొచ్చారు. ఈ సినిమా స్టోరీ నచ్చి ప్రచారం కోసం బెజవాడలో చిన్నసైజు పాదయాత్ర కూడా చేశారు. దీంతో రచయిత సినిమాపై అందరి దృష్టి పడింది. అలా భారీ అంచనాలు పెంచిన ఈ సినిమా థియేట్రికల్ ట్రయిలర్ తాజాగా విడుదలైంది.

అక్కినేని నాగేశ్వర రావు పాటతో డిఫరెంట్ గా మొదలైంది ట్రయిలర్. ఆ వెంటనే సస్పెన్స్ టర్న్ తీసుకుంది. గడిచిన ఏడాది కాలంలో మూడు అద్భుతమైన నవలలు అందిస్తాడు రచయిత కమ్ హీరో. అత్యథికంగా అమ్ముడుపోయే నవలలన్నీ ఈయనవే. ఇలాంటి రచయిత తన నెక్ట్స నవల కోసం ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ ఎంచుకుంటాడు. అది రాయడం కోసం నిశ్శబ్దమైన ప్రదేశానికి చేరుకుంటాడు. ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది రచయిత సినిమా.

నేనెప్పుడూ అనుకొని రాయను, నా కథలో పాత్రలు చెప్పినవే రాస్తాను. భయం‍‍, నిశ్శబ్దం రెండూ స్నేహితులు లాంటివి,భయాన్ని తెలుసుకోవాలంటే నిశ్శబ్దంలో ఉండాలి. ఇలాంటి డైలాగ్స్ ట్రయిలర్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. విద్యాసాగర్ రాజు తన స్వీయదర్శకత్వంలో నటించిన సినిమా ఇది. సంచితా పదుకోన్ అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా.. షాన్ రెహ్మాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కల్యాణ్ ధూలిపాళ్ల నిర్మాణ విలువలు ట్రయిలర్ కు ఓ లుక్ తీసుకొచ్చాయి. త్వరలోనే థియేటర్లలోకి రానున్న రచయిత సినిమా ఓ కొత్త అనుభూతిని ఇవ్వడం గ్యారెంటీ అనే విషయం ట్రయిలర్ ను బట్టే తెలుస్తోంది.