రాక్షసుడు సినిమా విజయంపై బెల్లంకొండ సురేశ్
`రాక్షసుడు` సినిమా ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు : బెల్లంకొండ సురేశ్
“`అల్లుడు శీను`.. అప్పట్లో చాలా మంది హీరోలకు సమానంగా రూ.34 కోట్లు షేర్ వచ్చింది. గ్రాండియర్, కమర్షియల్ వేల్యూస్ ఉన్న ఈ సినిమాతో వి.వి.వినాయక్ డైరెక్షన్ ద్వారా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పరిచయం అయ్యారు. అలాగే బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన `జయజానకి నాయక` భారీ క్యాస్టింగ్, బడ్జెట్‌తో రూపొందింది. అవన్నీ డైరెక్టర్‌కి, ఇతర క్యాస్టింగ్‌కి పేరుని తెచ్చిపెట్టాయి. అయితే `రాక్షసుడు` సినిమా మా అబ్బాయి బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది“ అని అన్నారు నిర్మాత బెల్లంకొండ సురేశ్.
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా `రైడ్`, `వీర` చిత్రాల దర్శకుడు రమేష్ వర్మ పెన్మత్స దర్శకత్వంలో ఏ స్టూడియోస్, ఎ హవీష్ ప్రొడక్షన్ బ్యానర్‌పై కొనేరు సత్యనారాయణ నిర్మాతగా రూపొందిన చిత్రం `రాక్షసుడు`. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగాఆగస్ట్ 2న విడుదల చేశారు. సినిమా సూపర్ హిట్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది.
ఈ సందర్భంగా హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ మాట్లాడుతూ “నేను నిర్మాతగా కెరీర్ స్టార్ట్ చేసి 21 ఏళ్లవుతుంది. 25 స్ట్రయిట్ సినిమాలు, 8 డబ్బింగ్ సినిమాలను ప్రేక్షకులకు అందించాను. ఇవేవీ నాకు ఆనందాన్ని ఇవ్వలేదు. మా అబ్బాయి చేసిన ఆరు సినిమాలు ఓ ఎత్తైతే.. ఈ సినిమా మరో ఎత్తు. ముఖ్యంగా ఓవర్‌సీస్‌లోనూ విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. శనివారం 85 శాతం అక్యుపెన్సీ ఉండగా.. ఆదివారం నాటికి 100 శాతం అక్యుపెన్సీ ఉండింది. కొనేరు సత్యనారాయణగారికి ఈ సందర్భంగా నా ధన్యవాదాలు. ఈరోజుల్లో రీమేక్ చేయడం చాలా కష్టం. రమేశ్ వర్మ సినిమాను తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా ఎలాంటి మార్పులు చేయకుండా అద్భుతంగా తెరకెక్కించారు. టెంపోను ఎక్కడా మిస్ కాలేదు. కెమెరామెన్ వెంకట్‌కి హ్యాట్సాఫ్. శ్రీనివాస్‌ను చాలా హ్యాండ్‌సమ్‌గా చూపించారు. మా అబ్బాయి గత చిత్రాలను మరచిపోయేలా ఈ సినిమా ఉంది. యూట్యూబ్‌లో హిందీలో సౌత్‌లోనే నెంబర్ వన్ హీరోలాంటి సినిమాలు ఉన్నాయంటే బెల్లంకొండ శ్రీనివాస్‌దే. స్పీడున్నోడు 200 మిలియన్స్ దాటింది. జయజానకినాయక 140మిలియన్స్ దాటి రన్ అవుతోంది. కవచం సినిమా 120 మిలియన్స్ దాటింది. అల్లుడు శీను లేట్‌గా టెలికాస్ట్ అయినా 100 మిలియన్ దగ్గర వ్యూస్ చేరుకుంది. సౌత్‌లో 400 మిలియన్, రెండు టు హండ్రెడ్ మిలియన్ దాటిన సినిమాలు చేసిన హీరో శ్రీనివాసే. హిందీలో, శాటిలైట్ పరంగా మా సినిమాలు అత్యద్భుతమైన ఆదరణను పొందుతుంది.
రాక్షసుడు సినిమా విషయానికి వస్తే కొనేరు సత్యనారాయణగారు, అభిషేక్ పిక్చర్స్ అభిషేక్ నామాగారు సినిమాను భారీగా రిలీజ్ చేశారు. రమేశ్ వర్మ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ముఖ్యంగా ఓవర్‌సీస్‌లో 100 స్క్రీన్స్ వేశారు. అప్పుడు సాంబయ్య సినిమాకు ఎలాగైతే నన్ను ప్రేక్షకులు ఆదరించారో.. ఇప్పుడు మా అబ్బాయిని అలా ఆదరిస్తున్నారు. సోమవారం రోజున కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా నుండి మా అబ్బాయి ప్రతి సినిమాకు జర్నలిస్ట్ అసోసియేషన్‌కు రూ.10 లక్షలను ఇవ్వాలని నిర్ణయించుకున్నాను.
బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ మా అబ్బాయితో సినిమా చేస్తామని, మమ్మల్ని కలవడానికి హైదరాబాద్ వస్తామని చెబుతూ మెయిల్ పంపారు. అంత గొప్ప సంస్థ నుండి అవకాశం రావడం గొప్పగా భావిస్తున్నాం. అలాగే దిల్‌రాజు బ్యానర్‌లో ఓ సినిమాను శ్రీనివాస్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది నేను కూడా మా అబ్బాయితో ఓ సినిమా చేయబోతున్నాను. అలాగే తెలుగులో విజయవంతమైన ఓ చిత్రాన్ని బాలీవుడ్‌లో నేనే నిర్మాతగా మారి రీమేక్ చేయాలనుకుంటున్నాను. `రాక్షసుడు` వంటి పెద్ద హిట్ ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఐదేళ్లుగా ఇలాంటి మంచి సక్సెస్ కోసం వెయిట్ చేశాను. సినిమా చేసిన నిర్మాతలకు, బయ్యర్స్‌కి మా `రాక్షసుడు` సినిమా లాభాలను తెచ్చిపెట్టింది“ అన్నారు.