Reading Time: 2 mins

రాజశేఖర్‌ కొత్త సినిమా సెట్స్‌పైకి అక్టోబర్‌లో

యాంగ్రీ స్టార్‌ రాజశేఖర్‌ కథానాయకుడిగా క్రియేటివ్‌ ఎంటర్‌టైనర్స్‌ అండ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ పతాకంపై జి. ధనుంజయన్‌ ఓ చిత్రాన్ని నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి ప్రదీప్‌ కృష్ణమూర్తి దర్శకుడు. అక్టోబర్‌లో సినిమా షూటింగ్‌ మొదలు కానుంది. ఆల్రెడీ స్ర్కిప్ట్‌ వర్క్‌ పూర్తయింది. తమిళ దర్శకుడు, ప్రముఖ మాటల రచయిత జాన్‌ మహేంద్రన్‌ స్ర్కిప్ట్‌ వర్క్‌ చేసిన టీమ్‌కి నేతృత్వం వహించారు. రాజశేఖర్‌, జీవిత దంపతులను కలిసిన దర్శక, నిర్మాతలు, జాన్‌ మహేంద్రన్‌, సినిమా తెలుగు డైలాగ్‌ రైటర్‌, గేయ రచయిత విశ్వ… కథ, స్ర్కీన్‌ప్లేను అందించారు.

ఈ సందర్భంగా రాజశేఖర్‌ మాట్లాడుతూ ‘‘కథ చాలా బావుంటుంది. చక్కటి స్ర్కీన్‌ ప్లే కుదిరింది. కథనం ఉత్కంఠభరితంగా, అదే సమయంలో ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. కథ విన్న వెంటనే ఓకే చేసేశా. స్ర్కీన్‌ ప్లేకీ వెంటనే ‘యస్‌’ చెప్పాను. అంత ఎగ్జయిటింగ్‌గా స్ర్కీన్‌ ప్లే ఉంటుంది’’ అని అన్నారు.

చిత్ర నిర్మాత జి. ధనుంజయన్‌ మాట్లాడుతూ ‘‘అక్టోబర్‌లో సినిమా షూటింగ్‌ మొదలు పెట్టాలనుకుంటున్నాం. హైదరాబాద్‌, చెన్నైలో చిత్రీకరణ చేస్తాం. సింగిల్‌ షెడ్యూల్‌లో సినిమా షూటింగ్‌ పూర్తి చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం. కథానాయిక, ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని అన్నారు.

నిర్మాత జి. ధనుంజయన్‌కు తమిళంలో మంచి పేరుంది. ఆయన రెండుసార్లు జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. జ్యోతిక, లక్ష్మీ మంచు ప్రధాన తారాగణంగా రాధామోహన్‌ దర్శకత్వంలో ‘కాట్రిన్‌ మొళి’ నిర్మించారు. సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటించిన ‘యు టర్న్‌’, విజయ్‌ ఆంటోని ‘కొలైకారన్‌’ను తమిళంలో విడుదల చేశారు. విజయ్‌ ఆంటోనీతో వరుసగా రెండు చిత్రాలను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో తెలుగులో అడుగు పెడుతున్నారు. దర్శకుడు ప్రదీప్‌ కృష్ణమూర్తికీ తెలుగులో తొలి చిత్రమిది. విజయ్‌ ఆంటోనీ హీరోగా ‘భేతాళుడు’కు దర్శకత్వం వహించిందీయనే. అలాగే, తెలుగు హిట్‌ ‘క్షణం’ను తమిళంలో సత్యరాజ్‌ కుమారుడు శిబి సత్యరాజ్‌ హీరోగా ‘సత్య’ పేరుతో రీమేక్‌ చేశారు.

డా. రాజశేఖర్‌, సత్యరాజ్‌, నాజర్‌, బ్రహ్మానందం, సంపత్‌ నటించే ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ఎస్‌.పి. శివప్రసాద్‌, ఫైనాన్షియల్‌ కంట్రోలర్‌: సి.ఎ.జి. గోకుల్‌, పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్‌ – ఫణి కందుకూరి, రైటర్‌: విశ్వ వేమూరి, స్ర్కీన్‌ ప్లే: జాన్‌ మహేంద్రన్‌, సంగీతం: సైమన్‌ కె. కింగ్‌, నిర్మాత: జి. ధనుంజయన్‌, దర్శకత్వం: ప్రదీప్‌ కృష్ణమూర్తి