రాజా ది గ్రేట్ టీజర్ రివ్యూ

Published On: August 16, 2017   |   Posted By:

రాజా ది గ్రేట్ టీజర్ రివ్యూ

మాస్ మహారాజ్ సినిమాల నుంచి ఆడియన్స్ ఏం ఎక్స్ పెక్ట్ చేస్తారో అందరికీ తెలిసిందే. తన సినిమాల నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటారో రవితేజకు కూడా బాగా తెలుసు. రాజా ది గ్రేట్ సినిమా కూడా ఆ కోవలోకే వస్తుంది. మసాలాకు ఏమాత్రం లోటులేదు. కాకపోతే రవితేజ రెగ్యులర్ సినిమాల కంటే సంథింగ్ స్పెషల్ గా ఉండబోతోంది రాజా ది గ్రేట్. దీనికి కారణం సినిమాలో రవితేజ అంధుడిగా కనిపించడమే.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా ది గ్రేట్ సినిమా టీజర్ ను ఈరోజు విడుదల చేశారు. స్వతంత్ర దినోత్సవ కానుకగా మాస్ రాజా అభిమానుల కోసం తెరపైకి వచ్చిన ఈ టీజర్ లో ఔట్ అండ్ ఔట్ రవితేజ మార్క్ కనిపిస్తోంది. కాకపోతే అంధుడిగా ఉంటూనే వినోదాన్ని పంచాడు రవితేజ.

ఐ యామ్ బ్లైండ్… బట్ ట్రయిన్డ్ అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ టోటల్ టీజర్ కే హైలెట్ గా నిలిచింది. ఈ ఒక్క టీజర్ తో సినిమాపై అంచనాలు డబుల్ అయ్యాయి. రవితేజ మార్క్ ఎనర్జీ, అనిల్ రావిపూడి స్టయిల్, పంచ్ డైలాగ్ లు అన్నీ ఉన్నాయి ఈ టీజర్ లో. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్. సాయి కార్తీక్ సంగీత దర్శకుడు.