రాజా విక్రమార్క మూవీ రివ్యూ
రివ్యూ: రాజా విక్రమార్క
హాలీవుడ్ లో పాపులర్ జానర్ స్పై థ్రిల్లర్స్ . అక్కడ రెగ్యులర్ గా స్పై థ్రిల్లర్ మూవీస్ వస్తూనే ఉంటాయి. మనకు ఓటీటి లో వచ్చిన ఫ్యామిలీమ్యాన్ సీరిస్ తో కాస్తంత సామాన్యులుగా జనాల్లో కలిసి ఉంటూనే వాళ్ళు స్పై ఆపరేషన్స్ ఎలా నిర్వహిస్తారు అనేవి పరిచయం అయ్యాయి. ఈ జానర్ లో వచ్చిన ఈ సినిమా మనకు కొంచెం కొత్తదే. ఈ సినిమా ప్రమోషన్స్ లోనే ‘మిషన్ ఇంపాజిబుల్’ స్పూర్తితో రాజ రాజా విక్రమార్క తీశానని చెప్పాడు దర్శకుడు. ఆ హాలీవుడ్ ఛాయిలు ఈ సినిమాలో ఏమన్నా ఉన్నాయా..ఈ స్పై థ్రిల్లర్ మనకు కొత్తగా ఏమన్నా అనిపిస్తుందా..అసలు కథేంటి, కార్తికేయ పాత్ర ఏమిటి, జనాలకు నచ్చే సినిమాయేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
అత్యుత్సాహి అయిన విక్రమ్ అలియాస్ రాజా విక్రమార్క నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఆఫీసర్. ఉద్యోగ నిర్వహణలో ఓ మాజీ నక్సలైట్ గురు నారాయణ (పశుపతి)వల్ల. హో మినిస్టర్ చక్రవర్తి (సాయి కుమార్)కి ప్రమాదం పొంచి ఉందని తెలుస్తుంది. వివరాలు పూర్తిగా తెలుసుకునేలోగా విక్రమ్ హడావిడి,తొందరపాటుతనం వల్ల.. హోం మినిస్టర్ కేసులో దొరికిన కీలకమైన ఆధారం నాశనం అవుతుంది. దాంతో విక్రమ్ కు హోం మంత్రిని కాపాడే మిషన్ లోకి తప్పనిసరిగా వెళ్లాల్సిన పరిస్దితి వస్తుంది. అయితే ఇక్కడే మెలిక హోం మినిస్టర్ ని కాపాడాలి కానీ, అది ఆయన కి తెలియకుండా జరగాలి. ఆ టాస్క్ ని నెరవేర్చేందుకు విక్రమ్ ఎల్.ఐ.సీ ఏజెంట్ గా మారితాడు. మంత్రి ఇంటిపై రెక్కీ చేసే క్రమంలో ఆయన కూతురు కాంతి (తాన్య రవిచంద్రన్)ని ప్రేమలో పడతాడు. ఈ లోగా విక్రమ్ కు మరో ఊహించని ట్విస్ట్ ఎదురౌతుంది. ఫైనల్ గా విక్రమ్ ప్రేమ కథ ఫలించిందా. చివరకు హోమ్ మంత్రి పై జరిగే ఎటాక్ ని తప్పించగలిగాడా?ఆ ట్విస్ట్ ఏమిటి, ఈ కథలో గోవింద్ నారాయణ (సుధాకర్ కోమాకుల) పాత్ర ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్ …
ఈ సినిమాలో కమర్షియల్ సినిమాకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కానీ ఏదీ పండలేదు. ఈ స్పై థ్రిల్లర్ లో యాక్షన్, కామెడీ, థ్రిల్ ..అన్ని కావాలనుకున్నారు దర్శకుడు. అయితే వాటిని బ్యాలెన్స్ చేసి తెరపైకి తీసుకురావడంలో తడబడిపోయాడు. వాస్తవానికి ఇదో సీరియస్ డ్రామా. ఇందులో కామెడీ మిక్స్ ఫెరఫెక్ట్ గా మిక్స్ చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. అయితే అదే మిస్ ఫైర్ అయ్యింది.దాంతో మొత్తం ప్రయత్నమే సిల్లీ అనిపించింది. కామెడీని కావాలని ఆయా సీన్స్ లో ఇరికించినట్లు,యాక్షన్ కావాలి కాబట్టి అతికించినట్లుగా సాగుతుంది. కథలో అవి కలిసిపోలేదు. సీరియస్ కథను ఫన్నిగా చెప్పాలనే తాపత్రయంలో స్క్రీన్ ప్లేని ,స్క్రీన్ టైమ్ లో రావాల్సిన ఎలిమెంట్స్ ని వదిలేసారు. సినిమా మొదట పది నిముషాల్లో జరిగిన హుక్ తప్పించి ,అసలు ఇంటర్వెల్ వరకూ కధలో కదలిక ఉండదు. హీరో ఓ పెద్ద భాధ్యత భుజాన వేసుకుని హోమ్ మినిస్టర్ ని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నాడు అనుకుంటే, లవ్ ట్రాక్ స్టార్టవుతుంది. పోనీ ఆ లవ్ ట్రాక్ కొత్తగా డిజైన్ చేసారా అంటే అదీ లేదు. లాజిక్స్ లేకపోయినా సినిమాటెక్ అని ఎడ్జెస్ట్ అవుదామనుకున్నా.. వరసపెట్టి వచ్చే ట్విస్ట్ లు మన మూడ్ ని చిరాకు పెడతాయి. కిడ్నప్ ట్రాక్, హీరో-హీరోయిన్ ట్రాక్, కార్తికేయ-సుధాకర్ ట్రాక్ లు ఇలా వరసపెట్టి వచ్చి పడిపోతూంటాయి. హీరోయిన్ ఓ టైమ్ లో హీరోని… నువ్వు ఎన్ఐఏ ఏజెంట్ అంటే మాత్రం నాకు అస్సలు నమ్మబుద్ధి కావడం లేదు అంటుంది. మన మనస్సులోనూ అదే ఉంటుంది. అంత నాశిగా సీన్స్ డిజైన్ చేసుకున్నారు. సివిల్స్ పాసై ఎన్ఐఏలో పని చేసే ఉన్నతాధికారి అలా నవ్వులు పాలు అవుతూ మనని నవ్వించే ప్రయత్నం చేయటం సీరియస్ గా నచ్చటం కష్టం.
టెక్నికల్ గా ..
ఇలాంటి సినిమాని ..అడవి శేషు గూఢచారి తరహాలో తీయగలగాలి. కానీ డైరక్టర్ ఎందుకో మేకింగ్ విషయంలో ఆ టెక్నికల్ బ్రిలియన్సీ చూపలేకపోయారు. దర్శకుడు కిడ్నాప్ సీన్స్, దాని తర్వాత వచ్చే సీన్స్ ను సరిగా తీయలేకపోయారు. హీరో ఎన్ఐఏ ఆఫీసర్.. ఒక క్రిమినల్ ను పట్టుకోవడానికి చేసే ఆపరేషన్ నేపథ్యంలో సినిమా అనగానే అనగానే ఒక థ్రిల్లర్ మూవీ ఆశిస్తాం. హీరో ఎన్ఐఏ ఆఫీసర్.. ఒక క్రిమినల్ ను పట్టుకోవడానికి చేసే ఆపరేషన్ నేపథ్యంలో సినిమా అనగానే అనగానే ఒక థ్రిల్లర్ మూవీ ఆశిస్తాం..దాన్ని అందించలేకపోయారు. డైలాగుల్లో కార్తికేయ, తనికెళ్ళ భరణి కోసం రాసిన సీన్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫి చాలా బావుంది. చేజింగ్ మరియు యాక్షన్ సీన్స్ హైలెట్. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ ఉన్నంత షార్ప్ గా సెకండాఫ్ లో లేదు. పాటలు డీసెంట్ గా ఉన్నాయి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ . ఈ చిత్రం యొక్క ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు తగిన స్దాయిలో ఉన్నాయి.
నటీనటుల్లో ..ఎన్ఐఏ ఏజెంట్ గా హీరో కార్తికేయ మంచి బాడీ షేప్ తో నీట్ గా డీసెంట్ గా నటించారు. హీరోయిన్ తాన్య అందం గా కనిపించడం మాత్రమే కాకుండా, సినిమా లో ఆకట్టుకుంది కానీ అంతకు మించి ఏమీ లేదు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సుధాకర్ కోమాకుల కు సినిమా హిట్టైతే మంచి బ్రేక్ వచ్చేది హోంమంత్రి పాత్ర లో ఎప్పటిలాగానే సాయి కుమార్, మరో కీలక పాత్రలో తనికెళ్ళ భరణి తనదైన శైలి లో ఆకట్టుకున్నారు. మిగతా నటీనటులు తమ నటనతో ఆకట్టుకున్నారు.
ప్లస్ లు
కార్తికేయ
కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్
కొంత హ్యుమర్
మైనస్ లు
కథ, స్క్రీన్ ప్లే , దర్శకత్వం
చూడచ్చా
ఎక్సపెక్టేషన్స్ లేకుండా ఓ లుక్కేయచ్చు.
తెర వెనుక..ముందు
నటీనటులు: కార్తికేయ, తాన్య రవిచంద్రన్, సుధాకర్ కోమాకుల, సాయికుమార్, తనికెళ్ల భరణి, పశుపతి, హర్ష వర్ధన్ తదితరులు;
సంగీతం: ప్రశాంత్ ఆర్.విహారి;
ఛాయాగ్రహణం: పీసీ మౌళి;
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీ సరిపల్లి;
నిర్మాత: 88 రామారెడ్డి;
విడుదల తేదీ: 12-11-2021.
రన్ టైమ్: 2 hr 19 Mins