రాజుగారి గది-3 చిత్రం ట్రైలర్ రిలీజ్
రాజుగారి గది-3 భయపెడుతూనే.. హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్ చేస్తుంది-దర్శకుడు ఓంకార్
రాజుగారి గది, రాజుగారి గది-2 చిత్రాలు సూపర్ , అయిన విషయం అందరికీ తెలిసిందే..! మళ్ళీ ఆ సిరీస్ లో భాగంగా రాజుగారి గది-3 చిత్రాన్ని రూపొందిస్తున్నారు టాలెంటెడ్ దర్శకుడు ఓంకార్. అశ్విన్ బాబు కథానాయకుడిగా అవికా గోర్ హీరోయిన్ గా ఓంకార్ స్వీయ దర్శకత్వంలో ఓక్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తోన్న చిత్రం “రాజుగారి గది-3”. ఈ చిత్రాన్ని దసరా కానుకగా విడుదల చేయడానికి దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రం ట్రైలర్ ను విక్టరీ వెంకటేష్ రిలీజ్ చేయగా.. చిత్ర యూనిట్ ప్రసాద్ ల్యాబ్స్ లో మీడియా వారికీ ట్రైలర్ ను ప్రదర్శించారు. ఈ కార్యక్రంలో హీరో అశ్విన్ బాబు, హీరోయిన్ అవికా గోర్, నటులు ఆలీ, బ్రహ్మజీ, అజయ్ గోష్, దర్శకుడు ఓంకార్, కెమెరామెన్ చోటా కే.నాయుడు, ఎడిటర్ గౌతమ్ రాజు, సంగీత దర్శకుడు షబీర్, మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా, కొరియో గ్రాఫర్స్ శేఖర్, శివ శంకర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కళ్యాణ్ చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.
హీరో అశ్విన్ బాబు మాట్లాడుతూ.. నన్ను సరికొత్త కోణంలో ఆవిష్కరించింది మా అన్నయ ఓంకార్. ఒక రూపాయికి మూడొంతులు ఎంజాయ్ చేస్తారు. దసరా హిట్ గా మా చిత్రం ఉండాలని కోరుకుంటున్నాం. సీనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ తో కలిసి పనిచేసినందుకు చాలా హ్యాపీగా వుంది.. అన్నారు.
హీరోయిన్ అవికా గోర్ మాట్లాడుతూ.. త్రీ ఇయర్స్ తర్వాత తెలుగులో నటిస్తున్న సినిమా ఇది. ఓంకార్ స్టోరీ నేరేట్ చేసినప్పుడు చాలా థ్రిల్ అయ్యాను. ఇమ్మీడియట్ గా ఈ సినిమా చేస్తానని చెప్పాను. ఇంత మంచి మూవీ చేసినందుకు ప్రౌడ్ గా ఫీలవుతున్నాను. ఫ్యాషన్, హార్డ్ వర్క్‌తో, డిసీప్లేన్ డిసిప్లేన్ తో టీమ్ అంతా వర్క్ చేసారు. ది బెస్ట్ అవుట్ ఫుట్ వచ్చింది.. అన్నారు.
మాటల రచయిత సాయిమాదవ్ బుర్రా మాట్లాడుతూ.. రాజుగారి గది చిత్రానికి వర్క్ చేశాను అది పెద్ద హిట్ అయింది. మళ్ళీ ఈ చిత్రానికి మాటలు రాశాను. ఈ సినిమా రాజుగారి గది కి మించి పెద్ద హిట్ అవుతుంది. మంచి కథ ఇది. అందమైన దెయ్యం ఆహ్లాదంగా నవ్విస్తుంది. చాలా దెయ్యాలు బయపెట్టిస్తాయి. కానీ ఈ అందమైన దెయ్యం భయపెడుతూనే నవ్విస్తుంది. రెండుగంటలపాటు హాయిగా నవ్వుకుని ప్రశాంతంగా బయటికివచ్చే చిత్రం ఇది. ఓంకార్ మంచి క్లారిటీ వున్న దర్శకుడు. తనకి ఏంకావాలో పర్ఫెక్ట్ గా రాబట్టుకుంటాడు. ఓక్ బ్యానర్లో ఈ సినిమాకి వర్క్ చేయడం హ్యాపీగా ఫీలవుతున్నాను.. అన్నారు.
అజయ్ గోష్ మాట్లాడుతూ.. నాలోవున్న నటుడ్ని డిఫరెంట్ యాంగిల్ లో ప్రజెంట్ చేసిన గొప్ప దర్శకుడు ఓంకార్. నా కేరియర్ ని మలుపు తిప్పే చిత్రం ఇది. చోటా కె.నాయుడు లాంటి సీనియర్ కెమెరామెన్ తో వర్క్ చేయడం అదృష్టంముగా భావిస్తున్నాను. పెట్టిన డబ్బులకి మూడొంతులు వినోదాన్ని ఇచ్చే చిత్రం ఈ రాజుగారి గది-3. అన్నారు.
సంగీత దర్శకుడు షబ్బీర్ మాట్లాడుతూ.. తెలుగులో ఇది నా మొదటి సినిమా. ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఓంకార్ గారికి నా థాంక్స్, కథ విని చాలా ఎంజాయ్ చేశాను. మ్యూజిక్ అందరికి నచ్చుతుంది అన్నారు.
ఆలీ మాట్లాడుతూ.. చిన్నప్పుడు విఠలాచార్యుని సినిమాలు బాగా చూసేవాడిని. మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి అలాంటి దర్శకుడు ఓంకార్. అశ్విన్ రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతున్నాడు. ఈ చిత్రంలో చాలా బాగా నటించాడు. చోటా గారు ఒక బాధ్యతతో తక్కువరోజుల్లో ఈ సినిమా పూర్తిచేసాడు. అవికా ఒక రేంజ్లో యాక్ట్ చేసింది.. అన్నారు.
బ్రహ్మాజీ మాట్లాడుతూ.. నేను ఎక్కువగా హార్రర్ సినిమాలు చేయలేదు. ఒక ప్రక్క భయపడుతూ.. మరో ప్రక్క కడుపుబ్బా నవ్వుతూ చచ్చిపోతారు. అలా రెండు షేడ్స్ లో ఈ సినిమా ఉంటుంది. ఇంత డిసీప్లేన్ వున్నా టీమ్ ని ఈ మధ్యకాలంలో నేను చూడలేదు. అంత బాగా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వర్క్ చేసారు. ఓంకార్ తో సినిమా అంటే చాలా మంది భయపెట్టారు. కానీ సెట్స్ కెళ్లాక అది నిజమని తెలిసింది. తనకి ఎంతకావాలో అంతే తీసుకుంటాడు. డైలాగ్ మాడ్యులేషన్ కూడా ఎలా ఉండాలో చెప్తాడు. ఇంత కమిట్మెంట్ డిసిప్లిన్ వున్న దర్శకుడ్ని చూడలేదు. ఆర్టిస్టులకి మంచి రెస్పెక్ట్ ఇచ్చి మంచి ఔట్ ఫుట్ తీసుకున్నారు. ఈ సినిమాతో అశ్విన్ సోలో హీరోగా సెటిల్ అవుతాడు. అవికాకి చాలా మంచి పేరొస్తుంది.. అన్నారు.
చోట కె.నాయుడు మాట్లాడుతూ.. ఓంకార్ ఫస్ట్ సినిమా జీనియస్ చెయ్యాలని నన్ను కలిసాడు. అప్పట్నుచి ట్రావెల్ అవుతున్నాం. ఈ జోనర్లో ఎప్పుడు సినిమా చేయలేదు. చాలా టెంక్షన్ గా ఉండేది. కానీ ఓంకార్ మొత్తం తానే చేసుకున్నాడు. జనరల్ గా నాకు ఫ్యాన్స్ వుంటారు.. ఈ సినిమాకి ఓంకార్ వర్క్ చూశాక ఓంకార్ కి ఫ్యాన్ అయ్యాను. ఈ సినిమా ఎంత బయపెడుతుందో అంత నవ్విస్తుంది. అశ్విన్ డాన్సులు, ఫైట్స్ కామిడీ అన్ని బాగా చేసాడు.. అన్నారు.
దర్శకుడు ఓంకార్ మాట్లాడుతూ.. రాజుగారి గది, రాజుగారి గది-2 చిత్రాలు మంచి హిట్ అయ్యాయి. కానీ రాజుగారి గది-2 లో కామిడీ మిస్ అయిందని కామెంట్స్ వచ్చాయి. అవన్నీ ఫుల్ ఫిల్ చేస్తూ.. ఈ స్క్రిప్ట్ రెడీ చేశాను. ఈ సినిమా స్టార్టింగ్ అప్పుడే దసరా రిలీజ్ అనుకున్నాం. జూన్ లో మొదలుపెట్టిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ కల్లా.. రెండు నెలల్లో ఫినిష్ చేసాం అంటే దానికి కారణం చోటా కె.నాయుడు గారు. ది బెస్ట్ క్వాలిటీతో ప్రేక్షకులముందుకు రాబోతున్నాం. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్, షబ్బీర్ మ్యూజిక్ వండర్ఫుల్ గా ఇచ్చారు. గౌతమ్ రాజు గారి ఎడిటింగ్, శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ, సినిమాకి ప్లస్ పాయింట్స్ గా నిలుస్తాయి. ఆలీ, బ్రహ్మాజీ, అజయ్ గోష్ కామిడీని ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. డబ్బింగ్ పూర్తి అయినా వెంటనే ఆలీ గారు మా లొకేషన్స్ కి వచ్చి సినిమా అద్భుతంగా వుంది అని అప్రిషియేట్ చేయడం చాలా గొప్ప విషయం. ప్రతిఒక్కరు తమ సొంత సినిమాలా భావించి వర్క్ చేసారు. వారందరికీ నా థాంక్స్. కచ్చితంగా రాజుగారి 3 -హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్ టైం చేస్తుంది.. అన్నారు.
అశ్విన్ బాబు, అవికా గోర్ జంటగా నటించిన ఈ చిత్రంలో ఆలీ, బ్రహ్మాజీ, ఊర్వశి, అజయ్ గోష్, ప్రభాస్ శ్రీను, హరితేజ, ధనరాజ్, ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి డీఓపై: చోటా కె.నాయుడు, మ్యూజిక్: షబ్బీర్, ఎడిటర్: గౌతమ్ రాజు, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఆర్ట్: సాహి సురేష్, కొరియోగ్రాఫర్: శేఖర్, రఘు, స్టంట్ డైరెక్టర్: వెంకట్, పాటలు: శ్రీమణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కళ్యాణ్ చక్రవర్తి, నిర్మాత: ఓక్ ఎంటర్టైన్మెంట్స్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం- ఓంకార్.