Reading Time: 3 mins

రాజ రాజ చోర‌ మూవీ రివ్యూ

రివ్యూ: శ్రీవిష్ణు ‘రాజ రాజ చోర‌
Rating: 2.5/5

ఈ వారం నాలుగైదు సినిమాలు థియేటర్లలోకి దిగాయి. అన్నింట్లోకి ఎక్కువగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నది, హైప్ తెచ్చుకున్నది మాత్రం ‘రాజ రాజ చోర’నే. ‘బ్రోచేవారెవ‌రురా’తో హిట్ కొట్టిన శ్రీవిష్ణు ఆ సినిమా రైటర్ కు డైరక్షన్ ఇచ్చి చేసిన సినిమా ఇది. ఈ సినిమాపై శ్రీవిష్ణుకు బాగా ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయని… ప్రి రిలీజ్ ఈవెంట్లో అతను ఇచ్చిన ఎలివేషన్ ని బట్టి అర్దమైంది. అంతేకాదు ‘రాజ రాజ చోర’ టీజర్, ట్రైలర్ చూస్తే వర్కవుట్ అవుతుందనిపించింది. ఇండస్ట్రీకే కాదు సామాన్య జనాలకు కూడా. ఇంతకీ ఈ సినిమా కథేంటి,  బాక్సాఫీస్ దగ్గర ఈ  సినిమాకి ఎలాంటి ఫలితం దక్కుతుంది, ఫన్ వర్కవుట్ అయ్యిందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
 

స్టోరీ లైన్

జెరాక్స్ షాపులో పనిచేసే భాస్కర్ (శ్రీవిష్ణు) మామూలోడు కాదు. అనుకున్నంత మంచోడు కాదు.  భార్య (సునయన),ఆమెతో ఓ కొడుకు వుండగా, వేరే అమ్మాయి (మేఘ)తో సాప్ట్ వేర్ ఇంజినీర్ అని చెప్పి, పెళ్లి కాదని బిల్డప్ ఇచ్చి ప్రేమ వ్యవహారం నడిపేస్తాడు.  భార్య లా చదువుతోంది. ఆమె చదువు, ఇంటి ఖర్చుల కోసం దొంగతనాలు చేస్తూంటాడు. డబ్బులు వస్తాయంటే క్వశ్చన్ పేపర్లు లీక్ చేసేస్తాడు. మహా కక్కుర్తి క్యాండిట్. ఇలాంటివాడు ఓ సారి అడ్డంగా పోలీస్ ఇన్ స్పెక్టర్ (రవిబాబు)కు చిక్కుతాడు. అక్కడి నుంచి భాస్కర్ బ్రతుకు బస్టాండ్ అయ్యిపోతుంది. అతని వ్యవహారాలు అన్నీ భార్యకు, ప్రియురాలికి కూడా లీక్ అయ్యిపోతాయి. అంతేనా ఆ  పోలీస్ చేతిలో పావుగా మారి మరిన్ని దొంగతనాలు చేయాల్సి వస్తుంది.మరి ఇలాంటి వాంటెడ్ సిట్యువేషన్ లో ఉన్న భాస్కర్ చివరకు మారాడా… పోలీస్ నుంచి తప్పించుకున్నాడా…భార్య,ప్రియురాలు అతని విషయంలో ఏ డెసిషన్ తీసుకున్నారు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

స్క్రీన్ ప్లే ఎనాలసిస్ ..

ఇలాంటి కథలకు సరైన స్క్రీన్ ప్లే పడకపోతే ప్రాణం పోతుంది. ఆ విషయం రైటర్ కూడా తనే అయిన హసిత్ కు బాగా తెలుసు. అందుకే లాజిక్ లతో లాక్ చేసుకుంటూ కథను ప్రక్కదారి ప్రక్కకుండా పరుగెత్తించే ప్రయత్నం చేసాడు. ఎక్కడ ఏ సీన్ తీసేసినా లింక్ తెగిపోయేంత బిగి ఉంది. అలాగే హీరో క్యారక్టరైజేషన్ ని బాగా స్పష్టతతో రాసుకున్నారు. దాంతో చూసేవారు ఆ పాత్రను ఐడింటిఫై చేసుకుని, జర్నీ చేసే అవకాసం ఇచ్చారు. ఫన్ యాడ్ చేయటంతో లైక్ బుల్ హీరో వచ్చాడు. అలాగే అధెంటిక్ గా, బిలీవబుల్ గా పాత్రను డిజైన్ చేసాడు. హ్యూమన్స్ ఆర్ కాంప్లెక్స్ బీయింగ్స్ అనే విషయాన్ని క్యారక్టరైజేషన్స్ లో చూపించాడు. అతనికి ఉన్న సమస్యలు, బలహీనతలు తో చాలా ఇంట్రస్టింగ్ గా రెడీ అయ్యింది. ఫన్, పర్శనల్ సమస్యలు రెండింటినీ బాలెన్స్ చేసాడు. ఇక హీరో పాత్రకు external జర్నీతో పాటు ఇంటర్నెల్ జర్నీ కూడా పెట్టుకున్నాడు. అతను తనను మార్చుకోవటానికి, మారటానికి అవకాసం దొరికింది. తన బలహీనత చిల్లరి దొంగతనాలు, భార్య ఉన్నా వేరే అమ్మాయితో ఎఫైర్ కోసం ప్రాకులాడటం అతన్ని సామాన్యుడుని చేస్తే కథలో జరిగిన జర్నీలో ప్రేమ, నమ్మకం, విశ్వాసం, భాత్యత తీసుకోవటం వంటివి ఇంటర్నెల్ గా ఛేంజ్ అవుతూ వచ్చాయి. అవి ప్రేక్షకుడుని ఆకట్టుకున్నాయి. కాంప్లిక్ట్స్, రిజల్యూషన్ ఫెరపెక్ట్ గా సింక్ అయ్యాయి ఇవన్నీ స్క్రిప్టు  పరంగా హైలెట్స్.

అదే సమయంలో సినిమా సెకండాఫ్ లో లాగ్ అంటే సాగతీత బాగా పెరిగింది. ఇంటర్వెల్ దగ్గర ఉన్న బిగి సెకండాఫ్ లో రాలేదు. ఫస్టాఫ్ లో ఉన్న కొత్తదనం సెకండాఫ్ లోకి వచ్చేసరికి మాయమైపోయింది.పాత తరహా ట్రీట్మెంట్ తో కథనం నీరుగారిపోయింది.  దొంగను వాడుకుని తెలివిగా ఇరికిద్దాం అన్న పోలీస్ ఐడియా బాగున్నా దాన్ని చెప్పేందుకు చేసిన సీన్స్ కుదరలేదు. అలాగే అన్ని క్యారక్టర్స్ కు పాజిటివ్ ముగింపు ఇవ్వాలన్న డైరక్టర్ తాపత్రయం విసిగిస్తుంది. వాస్తవానికి దూరంగా నిలుస్తుంది.  లెంగ్త్ కూడా పెంచేసింది. ఇవన్నీ సరిపోనట్లు తనికెళ్ల భరణి  స్పీచ్ లు విసిగిస్తాయి.
 
 
  టెక్నికల్ గా…

తన టీమ్ నుంచి అన్ని క్రాప్ట్ లోనూ మంచి అవుట్ పుట్ తీసుకున్నాడు డైరక్టర్ హసిత్ గోలి. కొత్త డైరక్టర్ అయినా ఎక్కడా ఆ విషయంలో రాజీ పడలేదు.  కూడా సినిమా ఓకే అనిపించుకుంటుంది.  అలాగే ఈ సినిమా స్క్రీన్ ప్లేలో తన మార్క్ ని  చూపించే ప్రయ్నం చేసాడు. డైలాగ్స్ కూడా ఒరిజినలాటితో తొణికిసలాడాయి.  వివేక్‌ సాగర్‌ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా సెట్ అయ్యింది.  పాటలు జస్ట్ ఓకే.   వేద రమణ్‌ శంకరన్‌ సినిమాటోగ్రఫీ కూడా మరో హైలెట్. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.ఫన్ సీన్స్ కు ప్రయారిటీ ఇవ్వటం కలిసొచ్చింది. మరీ ముఖ్యంగా  ప్రీ-ఇంటర్వెల్ సీన్స్ హిలేరియస్ గా ఉన్నాయి. సెకెండాఫ్ లో వచ్చే కొన్ని డ్రాగ్ సీన్స్ ని వదిలేస్తే  ఓ మంచి ఎంటర్ టైనర్.

నటీనటుల్లో …

భర్తగా, దొంగగా, బాయ్ ఫ్రెండ్ గా అన్నియాంగిల్స్  లో  శ్రీవిష్ణు  బాగా స్కోర్ చేసాడు.  శ్రీవిష్ణు లుక్స్, ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ అన్నీ ఇలాంటి క్యారెక్టర్ కు పక్కా సరిపోతాయి. వేరే ఎవరు చేసినా సినిమా ఇలా వుండేది కాదనిపించింది.శ్రీవిష్ణు భార్యగా, లా స్టూడెంట్ గా కనిపించిన సునైన కూడా అదరకొట్టింది. మరో ప్రక్క హీరో లవర్ గా మేఘా ఆకాష్, పోలీస్ విలియమ్‌ రెడ్డి గా రవిబాబు ఆకట్టుకున్నారు.  అజయ్ ఘోష్ సేమ్ టు సేమ్ .  గంగవ్వ పాత్ర కూడా గుర్తుండి పోతుంది.


చూడచ్చా?
ఫన్ సినిమాగా ఈ సినిమాని ఖచ్చితంగా చూడచ్చు, నవ్వుకోవచ్చు.  

ఎవరెవరు..
నటీనటులు: శ్రీవిష్ణు, మేఘా ఆకాష్‌, సునయన, రవిబాబు, తనికెళ్ల భరణి, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, అజయ్‌ ఘోష్‌ తదితరులు;
సంగీతం: వివేక్‌ సాగర్‌;
సినిమాటోగ్రఫీ: వేద రమణ్‌ శంకరన్‌;
ఎడిటింగ్‌: విప్లవ్‌;
నిర్మాత: అభిషేక్‌ అగర్వాల్‌, టీజీ విశ్వ ప్రసాద్‌;
రచన,దర్శకత్వం: హసిత్‌ గోలి;
రన్ టైమ్:2 గంటల, 29 నిముషాలు
విడుదల: 19-08-2021