రానా సినిమాకు ప్రభాస్ ప్రచారం

Published On: July 22, 2017   |   Posted By:
రానా సినిమాకు ప్రభాస్ ప్రచారం
వీళ్లిద్దరూ కలిసి బాహుబలి లాంటి భారీ చిత్రంలో నటించారు. అంతకుమించి ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. అందుకే రానా సినిమా కోసం ప్రభాస్ కదిలివచ్చాడు. తన ఫ్రెండ్ సినిమా కోసం ప్రచారం షురూ చేశారు. తేజ దర్శకత్వంలో నేనే రాజు నేనే మంత్రి సినిమా చేశాడు రానా. ఈ సినిమాకు సరికొత్తగా ప్రచారం చేపడుతున్నారు.
ఏఆర్ టెక్నాలజీ ఆధారంగా సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. అంటే ఈ టెక్నాలజీ ద్వారా రానా లేకుండానే అతడితో ఫొటో దిగే అనుభూతిని పొందవచ్చన్నమాట. ఇప్పుడీ టెక్నాలజీ సహాయంలో ప్రభాస్ కూడా రానాతో ఫొటో దిగాడు. అయితే ఆ ఫొటో తీసింది స్వయంగా రానానే కావడం విశేషం.
సినిమా ప్రమోషన్ లో భాగంగా రానా, ప్రభాస్ చేసిన హంగామా వీడియోను రిలీజ్ చేశారు. ఇంతకుముందు ఇదే టెక్నాలజీ ఆధారంగా రాజమౌళి కూడా రానాతో ఫొటో దిగాడు. నేనే రాజు నేనే మంత్రి సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ఆగస్ట్ 11న థియేటర్లలోకి రానుంది.