ది వారియర్ మూవీ రివ్యూ

Published On: July 14, 2022   |   Posted By:

రామ్ ‘ ది వారియర్ ‘ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

👎

`వారియ‌ర్`  సినిమా ప్ర‌మోష‌న్లు జోరుగా సాగుతున్నా.. పెద్ద‌గా బ‌జ్ క్రియేట్ కాలేదు.  ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. మ‌రోవైపు అడ్వాన్సు బుకింగులు చాలా డల్‌గా ఉన్నాయి. హైద‌రాబాద్‌లోని మ‌ల్టీప్లెక్సుల్లో… సీట్లు  ఫిల్ కాలేదు. దానికి తోడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. థియేట‌ర్ల‌కు జ‌నం వెళ్లి, సినిమా చూసే మూడ్ లేదు. టిక్కెట్ రేట్లు బాగా ఎక్కువ.ఓపెనింగ్స్ అంత డ‌ల్‌గా ఉన్నాయంటున్నారు. రిలీజ్ అయ్యాక ఊపొస్తుందని అందరూ ఆశించారు. అయితే ఆ పరిస్దితి ఈ సినిమా క్రియేట్ చేయగలిగిందా… సినిమా కథ ఏంటి..

స్టోరీ లైన్

వృత్తిని దైవంగా నమ్మే డాక్టర్ సత్య (రామ్ పోతినేని) కెరీర్ ప్రారంభంలో దెబ్బ తింటాడు. హౌస్ సర్జన్ చేయటం కోసం కర్నాలు వచ్చిన అక్కడ లోకల్ డాన్ గురు (ఆది పినిశెట్టి) తో తగువు వస్తుంది. అందుకు కారణం గురు ప్రాణం తీద్దామనుకున్న వ్యక్తి కు తను డాక్టర్ గా ప్రాణం పోస్తాడు. అది తట్టుకోలేని గురు మనుష్యులు నిర్దాక్ష్యణంగా ప్రాణం తీస్తారు. అది చూసిన సత్య తట్టుకోలేకపోతాడు. సత్య పోలీసులకు ఫిర్యాదు చేస్తే గురు తన పవర్ చూపించి వెనక్కి తీసుకునేలా చేస్తాడు. మరో ప్రక్క  గురు బినామీ రవి(అజయ్) తయారు చేసిన కంపెనీ మందులు వాడకం వలన ముగ్గురు చనిపోతారు. సత్య గురు బినామీలు చేస్తున్న డ్రగ్ మాఫియాని ఆధారాలతో కలెక్టర్ కి పట్టిస్తాడు.

దీంతో గురు, సత్యాన్ని చావకొట్టి కర్నూల్ సెంటర్ లోవ్రేలాడదీస్తాడు. తర్వాత సత్య తను గురుని ఎదుర్కోవాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం  గురు నుంచి తప్పించుకున్న సత్య రెండేళ్ల తర్వాత కర్నూల్కు డీఎస్పీగా వస్తాడు. ఆ తర్వాత సత్య ఏం చేశాడు ? గురును ఎలా ఎదుర్కొన్నాడు ? పోలీసులను ఎలా మార్చాడు ? డాక్టర్గా చేయలేని ఆపరేషన్ పోలీస్గా ఎలా చేశాడు ? అనే తదితర విషయాలు తెలియాలంటే ‘ది వారియర్’ చూడాల్సిందే.

స్క్రీన్ ప్లే ఎనాలసిస్…

విలన్..హీరో వీళ్లద్దరి మధ్య జరిగే ఇలాంటి కథలు మన కొత్తేమీ కాదు. అయితే అందులో ఎంత కొత్తదనం ఇమిడ్చామన్నది ముఖ్యం. అయితే కేవలం హీరో …పోలీస్ గా ఎలా మారాడు అనే దాకానే కొత్తగా కథ తయారు చేసుకున్నాడు దర్శకుడు. ఆ తర్వాత మిగతాదంతా రొటీన్ గా అల్లుకుంటూ పోయాడు. దాంతో మొదట్లో ఏదో కొత్తగానే ఉంది అనిపిస్తుంది. కానీ మెల్లిమెల్లిగా కథ రొటీన్ ట్రాక్ లో కి వెళ్లిపోవటం మొదలవుతుంది. ఈ క్రమంలో సినిమా మొత్తం ఊహించిన విధంగా, రొటీన్గా తయారైంది. దానికి తోడు ప్యాసివ్ క్యారక్టర్ హీరోది. ఎంతసైపు వన్ సైడ్ వార్ లా ఉంటుంది. ఎత్తుకు పై ఎత్తులు పెద్దగా కనపడవు. అలాగే విలన్ గురుపై కంప్లైంట్ ఇవ్వ‌డానికి ఎవ్వ‌రూ రాని క్ర‌మంలో ఓ అబ్బాయి ముందుకు రావ‌డం, అత‌ని క‌థ ఇంట్రస్టింగ్ గా అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత చెప్పుకోదగినది ఏదీ జరగక.. మళ్లీ డల్ అయ్యిపోతుంది. దీంతో బోర్ కొట్టిన ఫీలింగ్ కలుగుతుంది.

సెకండ్ హాఫ్ మొత్తం సగటు కమర్షియల్ సినిమా ఫార్మేట్ లో కి వెళ్లిపోవటం డైజస్ట్ కాదు. సెకండ్ హాఫ్ అంతా సత్యనే పై చేయి సాధిస్తుంటాడు. ఈ క్రమంలో సగటు మాస్ ఎలివేషన్స్ తెరపై వస్తుంటాయి. ఫస్టాఫ్ మొత్తం సత్య డాక్టర్ గా కర్నూల్ కి రావడం… హీరోయిన్ తో కొన్ని టైం పాస్ సీన్లు, తర్వాత గురు మనుషులకు ఎదురుపడటం, సత్య ఎదురుతిరగడం, సత్యని గురు కొట్టడంతో ఫస్ట్ హాఫ్ ముగిసిపోతుంది. ఏమీ జరిగినట్లు అనిపించదు. ఉన్నంతలో ఫస్ట్ హాఫ్ లో ఆదికి ఇచ్చిన ఎలివేషన్ మాత్రమే చెప్పుకోదగ్గదిగా వుంటుంది. విజిల్ మహాలక్ష్మి (కృతీశెట్టి), సత్య మధ్య వచ్చే లవ్ ట్రాక్  సరదాగా బాగుంది.

నటీనటుల్లో…రామ్ ఒకే పాత్రలో  ద్విపాత్రాభినయమ చేసే  అవకాశం వచ్చింది.  డాక్టర్ గా సాఫ్ట్ గా వున్న సత్య పోలీస్ గా మాస్ పోలీస్ గా  రెచ్చిపోయాడు. యాక్షన్ సీన్స్ బాగా చేశాడు. డ్యాన్సులు ఎప్పటిలానే బాగున్నాయి. ఇక కృతి శెట్టికి చెప్పుకోవటానికి ఏమీ లేదు.  లాస్ట్ లో ఓ చిన్న  సెంటిమెంట్  సీన్ తప్పించి. మాస్ పాటల్లో కృతి అందుకోలేకపోయింది. గురుగా ఆది అదరకొట్టారు.  నదియా, బ్రహ్మాజీ పాత్ర ఓకే.

టెక్నికల్ గా …ఈ సినిమాకు దేవిశ్రేప్రసాద్ ప్లస్ అదే సమయంలో మైనస్ కూడా. ఎప్పటిలాగే టిపికల్ కమర్షియల్ మాస్ సాంగ్స్ ఇచ్చాడు. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం వర్కవుట్ కాలేదు. సుజిత్ వాసుదేవన్ సినిమాటోగ్రఫీ  సినిమాకు ప్లస్ అయ్యింది. ఎడిటింగ్ జస్ట్ ఓకే. పాటల కొరియోగ్రఫీ బాగుంది. మాస్ డైలాగులు గొప్పగా లేవు. పేలలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ప్లస్ లు:
రామ్, ఆది ల నటన
యాక్షన్  బ్లాక్స్

మైనస్ లు:
కథ,కథనం
డల్ క్లైమాక్స్

చూడచ్చా?
రొటీన్ గా ఉంటే ఏంటి సర్దుకుపోతాం అంటే ఓ లుక్కేయచ్చు

తెర వెనక..ముందు

న‌టీన‌టులు: రామ్ పోతినేని, కృతిశెట్టి, ఆది పినిశెట్టి, న‌దియా, అక్షర గౌడ‌, బ్రహ్మాజీ, పోసాని కృష్ణముర‌ళి త‌దిత‌రులు;
కూర్పు: నవీన్ నూలి;
కళ: డి.వై.సత్యనారాయణ;
పోరాటాలు: విజయ్ మాస్టర్, అన్బు-అరివు;
ఛాయాగ్రహణం: సుజీత్ వాసుదేవ్;
మాటలు: సాయిమాధవ్ బుర్రా, లింగుస్వామి;
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్;
స‌మ‌ర్పణ: ప‌వ‌న్ కుమార్;
నిర్మాత‌: శ్రీ‌నివాసా చిట్టూరి;
నిర్మాణ సంస్థ: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్;
రన్ టైమ్ : 155 మినిట్స్
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శక‌త్వం: ఎన్‌. లింగుస్వామి;
విడుద‌ల‌ తేదీ: 14 జులై 2022