Reading Time: 2 mins

రాహు ట్రైలర్ లాంచ్

కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక  కీలక పాత్రలు పోషిస్తున్నారు.  త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న రాహు ట్రైలర్ ని దర్శకుడు వీరు పోట్ల లాంచ్ చేశారు.
సిధ్ శ్రీరామ్ పాడిన “ఏమో ఏమో ” పాట  వన్ మిలియన్ వ్యూస్ ని సాధించి  రాహు పై అంచనాలు పెంచింది.  చిత్ర యూనిట్ తో పాటు, మధుర శ్రీధర్ , రచయిత బి వి యస్ రవి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధులు గా హాజరయ్యారు.

ఈ సందర్భంగా
దర్శకుడు సుబ్బు వేదుల    మాట్లాడుతూ
” మమ్మల్ని  సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికి థాంక్స్ .  రాహు అంటే అందరూ జాతకాలు స్టోరీ అనుకుంటున్నారు. కానీ మా స్టోరీ అది కాదు. హీరోయిన్ కి ఒక డిజార్డర్ ఉంటుంది, అది ఒక రాహు లాంటిది. అలాగే తన జీవితంలో మరో  రాహు బయట ఉంటాడు. ఈ రెండు సమస్యల పై తాను చేసిన పోరాటమే రాహు కథ. హై టెక్నికల్  వాల్యూస్ తో ఈ కథ ను తెరకెక్కించాము. నాకు సహకరించిన నా టీం కి థాంక్స్.” అన్నారు.
డిఒపీ సురేష్ మాట్లాడుతూ  : “ఒక మంచి టీం తో పని చేయడం చాలా ఆనందం గా ఉంది. మధురా  శ్రీధర్ గారు  అందిస్తున్న సపోర్ట్ కి థాంక్స్ ” అన్నారు.

మ్యూజిక్ ప్రవీణ్ లక్కారాజు మాట్లాడుతూ    : “ఏమో ఏమో పాటకు వస్తున్న రెస్పాన్స్ బాగుంది . మధురా శ్రీధర్ గారు నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. సెకండ్ ఆఫ్  బ్యాగ్రౌండ్ స్కోర్ కి చాలా స్కోప్ ఉంది. దర్శకుడు సుబ్బు  చాలా ఫ్రీడమ్ ఇచ్చారు . ” అన్నారు.

చలాకీ చంటి మాట్లాడుతూ  : నాకు అవకాశం ఇచ్చిన అందరికీ థాంక్స్. నా పాత్రకు చాలా స్కోప్ ఉంది. మంచి టీం తో వర్క్ చేసాను ” అన్నారు.

నిర్మాత ల్లో ఒకరైన
శ్రీ శక్తి బాబ్జి మాట్లాడుతూ  : “దర్శకుడు చెప్పిన కథ కంటే సినిమా చాలా బాగా వచ్చింది.  రాహు సినిమా మాకు సంతృప్తి నిచ్చింది” అన్నారు.

నిర్మాత ఎ వి ఆర్ స్వామి మాట్లాడుతూ :
” ఒక మంచి టీం తో రాహు సినిమా ని నిర్మించాము.
సినిమా టీజర్, కి  పాట లకి మంచి రెస్పాన్స్ వస్తుంది.
మా సినిమా కు సపోర్ట్ చేస్తున్న  మధురా శ్రీధర్ గారి కి థాంక్స్ ” అన్నారు.

హీరోయిన్ కృతి   మాట్లాడుతూ : “రాహు మూవీ
నాకు చాలా స్పెషల్, నన్ను నమ్మి నాకు ఈ పాత్రను ఇచ్చిన దర్శకుడు కి చాలా థాంక్స్.  నాకు ఈ పాత్ర కు చాలా  ఛాలెంజ్  గా ఉంది. … టీజర్ బాగా రీచ్ అయి నందుకు చాలా అందంగా ఉంది” అన్నారు.

హీరో అభిరామ్ వర్మ మాట్లాడుతూ  : ” దర్శకుడు
సుబ్బు కి చాలా  థాంక్స్.  రాహు టీం లో చాలా ఎనర్జీ ఉంది. ఈ టీం తో వర్క్ చేయడం నాకు చాలా ఆనందం గా ఉంది. ప్రొడ్యూసర్స్ కి చాలా  థాంక్స్” అన్నారు.

మధురా శ్రీధర్  మాట్లాడుతూ ” ఇప్పుడు థ్రిల్లర్స్ యుగం నడుస్తోంది. సుబ్బు  మంచి స్టోరీ టెల్లర్. ఇప్పుడు సినిమాలు ఒక పాట తో రిజిస్టర్ అవుతున్నాయి.  ఓపెనింగ్స్ తెస్తున్నాయి.  సిధ్ శ్రీరామ్ పాడిన ఏమో ఏమో సాంగ్ రాహు కి మంచి హైప్ ని తెచ్చింది. ఈ కథ నాకు తెలుసు. చాలా కొత్త గా ఉంది.  మధురా ఆడియో ద్వారా  రాహు సినిమా పాటలు విడుదల అవడం  ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను.” అన్నారు.

బి వి యెస్ రవి మాట్లాడుతూ  :
“ఫిల్మ్ మేకర్స్ ,  టెక్నీషియన్స్ థ్రిల్లర్ జనర్ లో సినిమాలు చేయడానికి బాగా ఇష్ట పడతారు. వాళ్లకు కొత్త గా  చేయడానికి స్కోప్ దొరుకుతుంది. ట్రైలర్, సాంగ్స్ చాలా ఇంప్రెస్సివ్ గా ఉన్నాయి.  ఆర్టిస్ట్ లు
మూడ్ ని అర్థం చేసుకొని పని చేయాలి.  రెగ్యులర్ స్టోరీస్ చూడకుండా నిర్మాతలు  థ్రిల్లర్ కి ఒప్పుకోవడం గ్రేట్ ” అన్నారు.

దర్శకుడు వీరు పోట్ల మాట్లాడుతూ : ” రాహు ట్రైలర్ చాలా బాగుంది. ఆడియెన్స్  యాక్సప్ట్  చేస్తారని నమ్ముతున్నాను. కథ నాకు తెలుసు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.  కృతి, అభి బాగా చేశారు అల్ ద బెస్ట్  అన్నారు “

కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నికలు నటిస్తున్నారు.
టెక్నికల్ గా అత్యున్నతంగా ఉండబోతోన్న ఈ చిత్రానికి ఎడిటర్ : అమర్ రెడ్డి, సినిమాటోగ్రఫీ : సురేష్ రగుతు, ఈశ్వర్.

సంగీతం : ప్రవీణ్ లక్కరాజు, పి.ఆర్.వో : జి.ఎస్.కె మీడియా, నిర్మాతలు : ఏ.వి.ఆర్ స్వామి, శ్రీ శక్తి బాబ్జీ, రాజా దేవరకొండ, రచన-దర్శకత్వం : సుబ్బు వేదుల.