Reading Time: < 1 min
రాహు శాటిలైట్ డిజిటల్ రైట్స్ జి తెలుగు సొంతం
 
రాహు శాటిలైట్ & డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న జి తెలుగు

కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక కీలక పాత్రలు పోషిస్తున్నారు. 
 
పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకున్న రాహు  రిలీజ్ కి ముందే ఇండస్ట్రీ ని ఆకర్షస్తుంది. చిన్న సినిమాలకు శాటిలైట్ రైట్స్ విడుదలకు ముందే అమ్ముడవడం అనేది గగనంగా మారిన ట్రెండ్ లో రాహు శాటిలైట్, డిజిటల్ రైట్స్ ఫ్యాన్సీ రెట్లు కు అమ్మడవడం సినిమా పై అందరి అంచనాలను పెంచింది. గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా విడుదలకు ముందే అందరి అటెన్షన్ ని రాబడుతున్న రాహు లో సిధ్
శ్రీరామ్ పాడిన ‘ఎమో ఎమో’ పాట  7 మిలియన్ వ్యూస్ కి చేరువలో ఉంది. ఈ పాట‘రాహు’ కి ప్రత్యేక ఆకర్షణగా మారింది.

దర్శకుడు సుబ్బు వేదుల మాట్లాడుతూ:
‘‘రాహు శాటిలైట్, డిజిటల్ హాక్కులు జి తెలుగు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సినిమా పై మాకున్న నమ్మకం మరింత పెరిగింది. కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలను టాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అవుతున్నాయి. ‘రాహు’ థ్రిల్లర్ మూవీస్ లో టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉండబోతుంది.  ప్రవీణ్ లక్కరాజు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రాహుకి అసెట్ గా మారింది. థ్రిలర్స్  తెలుగులో కొత్త  ట్రెండ్ ని సెట్ చేస్తున్నాయి. రాహు వాటి సరసన నిలబడుతుంది అని కాన్ఫిడెంట్ గా మా టీం ఉంది. ఈ చిత్రాన్ని మార్చ్ లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’  అన్నారు.

 న్యూ  ఎజ్ థ్రిలర్ గా రాబోతున్న రాహు చిత్రంలో కృతి గార్గ్, అభిరామ్వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నికలు నటిస్తున్నారు.
 
టెక్నికల్ గా అత్యున్నతంగా ఉండబోతోన్న ఈ చిత్రానికి
రచన, దర్శకత్వం – సుబ్బు వేదుల
నిర్మాతలు – ఏ వి
ఆర్ స్వామీ, శ్రీ శక్తి   బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల
డిఓపి – సురేష్ రగుతు,ఈశ్వర్ యల్లుమహాంతి ,
మ్యూజిక్ – ప్రవీణ్ లక్కరాజు
ఎడిటింగ్ – అమర్ రెడ్డి
పి ఆర్ ఓ : జీ యస్ కే  మీడియా