రుద్ర‌మాంబ‌పురం చిత్రం ఫ‌స్ట్‌లుక్‌ విడుద‌ల‌

Published On: September 20, 2021   |   Posted By:

రుద్ర‌మాంబ‌పురం చిత్రం ఫ‌స్ట్‌లుక్‌ విడుద‌ల‌

 

రుద్ర‌మాంబ‌పురం` ఫ‌స్ట్‌లుక్‌, మోష‌న్‌పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి.

శుభోద‌యం సుబ్బారావు, అజ‌య్ ఘోష్‌ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతోన్న చిత్రం `రుద్ర‌మాంబ‌పురం`. మూల‌వాసుల క‌థ అనేది ట్యాగ్‌లైన్‌. ఎన్‌వీఎల్ ఆర్ట్స్ ప‌తాకంపై నందూరి రాము నిర్మిస్తున్నారు. మ‌హేష్ బంటు ద‌ర్శ‌కుడు. ఈ రోజు శుభోద‌యం సుబ్బారావు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి విడుద‌ల‌చేసి టైటిల్ చాలా బాగుందని ప్ర‌శంసించి చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.  ఈ చిత్రంలో పెద్ద‌కాపు మ‌ల్లోజుల శివ‌య్య పాత్ర‌లో  శుభోద‌యం సుబ్బారావు న‌టిస్తున్నారు. వెంగీ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి ఎన్ సుధాక‌ర్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌, బొంతల నాగేశ్వ‌ర్ రెడ్డి ఎడిట‌ర్‌. వెంక‌టేశ్వ‌ర‌రావు ఆర్ట్ డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

సాంకేతిక వ‌ర్గం:
నిర్మాత‌: నందూరి రాము
ద‌ర్శ‌క‌త్వం: మ‌హేష్ బంటు
బ్యాన‌ర్: ఎన్‌వీఎల్ ఆర్ట్స్
క‌థ‌: అజ‌య్ ఘోష్
డిఓపి: ఎన్ సుధాక‌ర్ రెడ్డి
సంగీతం: వెంగీ
ఎడిట‌ర్‌: బొంత‌ల నాగేశ్వ‌ర్ రావు
ఆర్ట్‌: వెంక‌టేశ్వ‌ర రావు
ఫైట్స్‌: దేవ‌రాజు