రేపుడ్ వెబ్ సిరీస్ ప్రారంభం

Published On: September 14, 2020   |   Posted By:
రేపుడ్ వెబ్ సిరీస్ ప్రారంభం
 
టాలెంట్ కేఫ్ బ్యానర్ పై క్రైం థ్రిల్లర్ ”రేపుడ్” పూజా కార్యక్రమాలతో ప్రారంభం
 
టాలెంట్ కేఫ్ బ్యానర్ లో ఇష్టంగా ఫెమ్ అర్జున్ మహి, శేఖరం గారి అబ్బాయి ఫెమ్ విన్ను మద్దిపాటి హీరోలుగా కారుణ్య చౌదరి, మాయ నెల్లూరి, అమీక్ష హీరోయిన్లుగా రవి శర్మ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న వెబ్ సిరీస్ ‘రేపుడ్’. క్రైం థ్రిల్లర్ గా ఉండబోతున్న ఈ వెబ్ సిరీస్ అత్యంత ఆసక్తికరంగా ఉండనుంది.
 
శనివారం(12.09.2020) రోజు ఈ వెబ్ సిరీస్ పూజా కార్యక్రమాలు టాలెంట్ కేఫ్ ఆఫీసులో జరిగింది. రెగ్యులర్ షూటింగ్ కూడా అదే రోజు ప్రారంభం అయ్యింది. వీడు మాములోడు కాదు, ఝలక్ చిత్రాలకు దర్శకత్వం వహించిన రవి శర్మ ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేయబోతున్నారు. 
 
ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ నిర్మాత శ్రీదేవి గారు మాట్లాడుతూ…
షూటింగ్ షెడ్యూల్స్ ఈ నెల 22వ తేదీ వరకు ఉంటుంది. సెకండ్ షెడ్యూల్ అక్టోబర్ మూడోవారంలో ఉంటుంది. మొత్తం 15 ఎపిసోడ్స్ గా ఈ వెబ్ సిరీస్ ను చిత్రీకరించబోతున్నాము. సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులతోనే ఈ వెబ్ సిరీస్ తీస్తామని తెలిపారు. 
 
నటీనటులు:
 
అర్జున్ మహి, కారుణ్య చౌదరి, రవి వర్మ, విన్ను మద్దిపాటి, మాయ నెల్లూరి, అమీక్ష, దువ్వాసి మోహన్, జోష్ రవి, అనుపమ స్వాతి, శిరీష, నేహల్
 
సాంకేతిక నిపుణులు:
కెమెరా:భాస్కర్ ద్రోనాల
కథ, మాటలు: ప్రకాష్ వేద
ఎడిటింగ్: మహేష్ కాసర్ల
సంగీతం: వికాస్ కురిమిళ్ళ
నిర్మాణం: టాలెంట్ కేఫ్
స్క్రీన్ ప్లే, డైరెక్షన్: రవి శర్మ