Reading Time: 3 mins

లాఠీ మూవీ రివ్యూ

Emotional Engagement Emoji

ప్రతీ సారి పోలీస్ డ్రామాలో కొత్త ఎలిమెంట్స్ ని చొప్పించటం కష్టం ఎప్పుడో సింగం లాంటి సినిమాలు తప్పించి జనాల్లోకి వెళ్లవు యాక్షన్ ఉన్నా అందుకు తగ్గ రీజన్ సీజన్ లేనప్పుడు బోల్తా పడుతూంటాయి. విశాల్ గతంలోనూ పోలీస్ క్యారక్టర్స్ చేసారు ఈసారి ఓ కానిస్టేబుల్ పాత్రతో పలకరించాడు ఇలాంటి సినిమాలకు ఎంగేజింగ్ స్కీన్ ప్లే, కాంప్లిక్ట్స్ అవసరం మరి ఈ సినిమాలో ఆ ఎలిమెంట్స్ ఉన్నాయా చిత్రం కథేంటి బి,సి సెంటర్లలో అయినా వర్కవుట్ అయ్యే కాన్సెప్టా అనేది రివ్యూలో చూద్దాం.

కథాంశం

ముర‌ళీకృష్ణ (విశాల్‌) నిజాయితీకు బ్రాండ్ అంబాసిడర్ లాంటివాడు భార్య క‌విత (సునైన‌), త‌న అబ్బాయి రాజునే ప్ర‌పంచంగా బ‌తుకుతుంటాడు. ఆల్రెడీ ఓ కేసు విషయంలో కాస్త పాస్ట్ అయ్యి స‌స్పెన్ష‌న్‌ని గుర‌వుతాడు ఆ త‌ర్వాత డీఐజీ క‌మ‌ల్ (ప్ర‌భు) అండ‌తో అతను మ‌ళ్లీ డ్యూటీలో చేర‌తాడు. అయితే అదే డీఐజీ క‌మ‌ల్ త‌న క‌స్ట‌డీలో ఉన్న ఓ క్రిమినల్ ని లాఠీతో శిక్షించాల‌ని ముర‌ళీని కోర‌తాడు పై అధికారి చెప్ప‌డంతో ఆ క్రిమినల్ ఎవ‌ర‌నేది కూడా చూడ‌కుండా లాఠీతో శిక్షిస్తాడు అప్పటి నుంచి సమస్యలు మొదలవుతాయి. ఆ క్రిమినల్ పేరు మోసిన దాదా సూరా కొడుకు వీరానే ఆ నేర‌స్థుడిని ఆ త‌ర్వాత తెలుస్తుంది త‌న‌ని ప‌ట్టుకున్న పై ఆఫీసర్ క‌మ‌ల్‌ని కాకుండా త‌న‌ని కొట్టిన ముర‌ళీకృష్ణ‌పై వీరా అత‌ని తండ్రి సూరా పగ ప్రతీకారం పెంచుకుంటాడు. దాంతో ఆ విలన్స్ ఇద్దరూ ముర‌ళీని, అత‌ని కుటుంబాన్ని టార్గెట్ చేసారు. అప్పుడు ఏమైంది? అక్కడ నుంచి ఓ సాధార‌ణ పోలీస్ కానిస్టేబుల్ ఓ క్రిమినల్ తో మధ్య పోరాటం ఎలా సాగిందనేదే మిగ‌తా క‌థ‌.

ఎనాలసిస్

ఈ సినిమా వాస్తవానికి ఓ కఠినమైన, ఊహించని సమస్యను వెలికిలోకి తెచ్చిందే పై అధికారులు చెప్పే పనులు వల్ల క్రింద స్దాయి ఉద్యోగులు ఏ విధంగా ఇబ్బంది పడతారు డిపార్టమెంట్ ఏ విధమైన సాయిం అందిస్తుంది అని చెప్పాలి అనేది డైరక్టర్ ఆలోచన. అంతా బాగానే ఉంది అల్లుడు నోట్లో శని అన్నట్లు సినిమా ప్రారంభం బాగానే ఉంది కొన్ని సర్పైజ్ లు ఉన్నాయి ఎత్తుగడ బాగుంది. అయితే సినిమా ముందుకు వెళ్తున్న కొలిదీ స్క్రిప్టు సమస్యలు మొదలవుతాయి ప్లాట్ తన విస్తృతి తగ్గించుకుని చిన్నదై పోతుంది. అప్పటిదాకా సినిమాపై పెంచుకున్న ఇంప్రెషన్ మొత్తం పోతుంది సెకండాఫ్ కు వచ్చేసరికి మరీ చేయి దాటిపోతుంది. సెకడాఫ్ లో వచ్చే 45 నిముషాల స్టంట్ సీక్వెన్స్ సినిమాకు మేజర్ బ్యాక్ డ్రాప్ లో ఒకటి నేరేషన్ ని ఆపేసి విసిగిస్తుంది.

కనస్ట్రక్షన్ లో ఉన్న ఓ భ‌వ‌నంలో దాదాపు 45 నిమిషాల‌పాటు చుట్టుముట్టిన వంద‌ల మంది రౌడీల నేప‌థ్యంలో సాగే ఫైటింగ్ అల‌స‌ట‌కి గురిచేస్తుంది. హీరో మీద మనకు సానుభూతి ఏమన్నా ఉన్నా ఈ ఎపిసోడ్ తో మొత్తం పోతుంది మరీ ఓవర్ డ్రమిటిక్ గా, జెన్యూన్ రైటింగ్ ని మర్చిపోయేలా సినిమా మలుపు తీసుకుంటుంది. దాంతో ఫస్టాఫ్ లో చెలరేగిపోయిన లాఠీ విరిగిపోతుంది. హీరో పాత్ర ప్యాసివ్ కావటమే దీనికి కారణం. ఇలాంటి సినిమాలు వల్ల విశాల్ కు ఒరిగేది లేదు. చూసేవాళ్లకు అంత కన్నా లేదు అని అర్దమైన తర్వాత మనకు ఎందుకు కూర్చోవాలి అనిపిస్తుంది లేచి వచ్చేలా క్లైమాక్స్ సైతం ప్రేరేపిస్తుంది.

టెక్నికల్ గా

నేపథ్య సంగీతం కొన్ని చోట్ల చెవులకు పట్టిన తుప్పును వదిలించేలా ఉన్నా మిగతా చోట్ల సినిమాకు ప్లస్ అయ్యింది. దర్శకుడు వినోద్ కుమార్ టేకింగ్ 80లలో సినిమాలను గుర్తుకు తెచ్చేలా సాగింది ముఖ్యంగా ఈ సినిమా మొదట కథ, కథనం విషయంలోనే ఫెయిలైంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి ఎడిటింగ్ సెకండాఫ్ లో మరింత షార్ప్ చేసి లెంగ్త్ తగ్గిస్తే బాగుండేది.

నటీనటుల్లో విలన్ ఎప్పటిలాగే పోలీస్ పాత్రకు జీవం పోశాడు. ఇలాంటి పాత్రలు ఆయనకు కొట్టినపిండే ఆయ‌న‌కు జోడీగా సునైన బాగా న‌టించింది. ఫెరఫెక్ట్ పెయిర్ ప్రభు, తలైవాసన్ విజయ్ రెండు మూడు సీన్స్ అయినా గుర్తుండిపోయేలా బాగా చేసారు. శూర, వీరలుగా సన్నీ పీఎన్, రమణ జస్ట్ ఫరవాలేదనిపిస్తారు.

ప్లస్ లు ?

స్టోరీ లైన్
హీరో సెల్‌ఫోన్‌లోని రింగ్ టోన్ ఆధారంగా అతను ఎవ‌రో క‌నిపెట్టేందుకు విలన్ ప్ర‌య‌త్నించ‌డం
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
యాక్షన్ ఎపిసోడ్స్

బాగోలేనివి ?

ఓ ప‌ట్టాన కదలని సెకండాఫ్
విసుగెత్తించే రైటింగ్,
బోరింగ్ సీన్స్, కష్టమనించే క్లైమాక్స్
డైరక్షన్ మెరుపులు ఏమీ కనపడకపోవటం

చూడచ్చా

క‌థ‌, క‌థ‌నాల‌తో సంబంధం లేకుండా మాస్‌, యాక్షన్‌ని ఇష్ట‌ప‌డే సినీ ప్రియుల్ని మాత్రం ఈసినిమా ఆక‌ట్టుకుంటుంది

నటీనటులు :

విశాల్, సునయన, మాస్టర్ లిరేష్ రాఘవ, ప్రభు, తలైవాసల్ విజయ్, మనీషికాంత్ తదితరులు

సాంకేతికవర్గం :

బ్యానర్ : రానా ప్రొడక్షన్స్
మ్యూజిక్ : సామ్ సీఎస్
సినిమాటోగ్రఫీ : బాలసుబ్రమణ్యన్
మాటలు : రాజేష్ ఎ. మూర్తి (తెలుగులో)
రచయిత : పొన్ పార్థీబన్
రచన, దర్శకత్వం : ఎ. వినోద్ కుమార్
రన్ టైమ్ : 123 మినిట్స్
నిర్మాతలు : రమణ, నంద
విడుదల తేదీ: డిసెంబర్ 22, 2022