లాస్ట్ సీన్ చిత్రం ప్రారంభం

Published On: August 16, 2018   |   Posted By:

లాస్ట్ సీన్ చిత్రం ప్రారంభం

ప్రకాష్ ఠాకూర్ సమర్పణలో గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమి పతాకంపై హర్ష కుమార్, తులికా సింగ్ హీరోహీరోయిన్లుగా దీపక్ బలదేవ్ ఠాకూర్ దర్శకత్వంలో ‘లాస్ట్ సీన్’ చిత్రం తాజాగా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి  సల్మాన్ సర్కార్ క్లాప్ నివ్వగా, ప్రకాష్ ఠాకూర్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

హైదరాబాద్‌లో ఆగస్ట్ 20 నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

ఈ సందర్భంగా దర్శకుడు దీపక్ బలదేవ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘‘ ఇదొక డిఫరెంట్ లవ్‌స్టోరి. ఇప్పటి వరకు ఎక్కడా చూడనిది. లాస్ట్ సీన్ కథ అద్భుతంగా కుదిరింది. హైదరాబాద్‌లో ఆగస్ట్ 20 నుంచి మూడు రోజుల పాటు షూటింగ్ జరుపుతాము. నెలాఖరు నుంచి 18 రోజుల పాటు కేరళలో జరిగే షూటింగ్‌తో ఫస్ట్ షెడ్యూల్ పూర్తవుతుంది. సంగీతానికి స్కోప్ ఉన్న చిత్రమిది. అందరికీ నచ్చేలా ఉంటుంది..’’ అన్నారు.

హర్షకుమార్, తులికాసింగ్, మధునారాయణ్, హిమాయత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: జవహర్ రెడ్డి, డైలాగ్స్: రమణ్ గోయల్, సంగీతం: అనిల్, ప్రొడక్షన్ కంట్రోలర్: కొల్లా జగన్‌మోహన్ రావు, కాస్టింగ్ డిజైనర్: రీతా భవాలి, కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: దీపక్ బలదేవ్, నిర్మాణం: గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమి.