లెవన్ టీజర్ లాంఛ్ ఈవెంట్
‘ లెవన్ ‘ టీజర్ లాంఛ్ ఈవెంట్ ప్రసాద్ ల్యాబ్స్ లో గ్రాండ్ గా జరిగింది. టీజర్ ఇంట్రెస్టింగ్ గా వుంది. నవీన్ చంద్ర ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా పెర్ఫార్మెన్స్ ఇంప్రెసివ్ గా వుంది. మీడియా ఇంటరాక్షన్ లో ఒక ప్రశ్న కి సమాధానంగా నవీన్ చంద్ర ‘ ఈ సినిమా ఇప్పటివరకూ వరల్డ్ సినిమా లో ఎవరూ చెప్పని పాయింట్ ని మా డైరెక్టర్ లోకేష్ అడ్రెస్ చేస్తున్నారు. పదకొండు మంది మీద పదకొండు సార్లు ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తుంది, అందుకే ఈ సినిమా కి ‘ లెవన్ ‘ అనే పెట్టాం’ అని చెప్పారు. కథ అంతా నవీన్ చంద్ర మరియు శశాంక్ ( ఐతే, సై) మధ్య నడుస్తుంది. ఇందులో నవీన్ చంద్ర, శశాంక్ ఇద్దరూ డబుల్ యాక్షన్ చేస్తున్నారని సమాచారం.