Reading Time: < 1 min

లైలా మూవీ ప్రారంభం

నేడు అన్నపూర్ణ స్టూడియోలో విశ్వక్ శేన్ హీరోగా లైలా అనే నూతన సినిమా పూజా కార్యక్రమం విశిష్ట అతిథుల సమక్షంలో ఆహ్లాదకరంగా జరిగింది.

తెలుగు సినిమా హీరోల్లో కెల్ల విశ్వక్ శేన్ ది విభిన్నమైన శైలి. విశ్వక్ శేన్ ఎంచుకున్న కథల దగ్గరనుండి, అతను చేసే పాత్రలన్నీ కొత్తగా, వైవిధ్యంగా వుంటూ అతనిలోని నటుణ్ణి ఇంకో స్థాయికి తీసుకెళ్ళేలా వుంటున్నాయి.

అదే తరహాలో లైలా సినిమా ఉండబోతోంది. ఈ సినిమాలో విశ్వక్ శేన్ అమ్మాయి పాత్రలో కనిపించనున్నాడు. లైలా క్యారెక్టర్ కోసం న్యూజిలాండ్ నుండి మేకప్ ఆర్టిస్ట్ శాన్ ఫూట్ అనే ప్రొస్తెటిక్ ఆర్టిస్ట్ ని తీసుకుంటున్నారని సమాచారం.

అతను ఇంతకుముందు తమిళ హీరో శివ కార్తికేయన్ రెమో సినిమా కోసం పనిచేసారు. అంతే కాకుండా ఎన్నో హాలీవుడ్ సినిమాలకు కూడా ప్రోస్తేటిక్ మేకప్ ఆర్టిస్ట్ గా చేసిన అనుభవం ఆయన సొంతం.

ఇక ఇప్పుడు రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న లైలాలో విశ్వక్సేన్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. సాహు గారపాటి నిర్మాతగా షైన్ స్క్రీన్ బ్యానర్ లో, రామ్ నారాయణ ( బట్టల రామస్వామి బయోపిక్కు )దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.

దర్శకేంద్రుడు శ్రీ కె రాఘేంద్రరావు గారు ముఖ్య అతిథిగా, డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ గౌరవ అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా హరేష్ శంకర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, కె రాఘేంద్రరావు గారు హీరో హీరోయిన్ల మీద క్లాప్ కొట్టి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఆకాంక్షా శర్మ పరిచయం అవుతున్నారు.

సినిమా వివరాలు :

సినిమా టైటిల్ : లైలా
బ్యానర్: షైన్ స్క్రీన్స్
విడుదల తేదీ : 14-02-2025
నటీనటులు : విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ
దర్శకుడు: రామ్ నారాయణ్
సంగీతం: తనిష్క్ బాగ్చి
సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ ప్రసాద్
ఎడిటర్: అన్వర్ అలీ
నిర్మాత: సాహు గారపాటి