Reading Time: 2 mins

వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ రివ్యూ

 కష్టం యార్!!(‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ రివ్యూ)
 
Rating:2/5  

మనకెప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. మన ప్రక్కన ఉన్న తమిళంలో అప్పుడెప్పుడైనా ప్రయోగాత్మక చిత్రాలు వస్తున్నాయి. ప్రక్కన బాలీవుడ్లో వరసగా ప్రయోగాలు చేసేస్తున్నారు.అక్కడ  ప్రయోగాత్మక సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మధ్యన వరసపెట్టి బదాయి హో, పాడ్ మాన్, అంధాధూన్ వంటి సినిమాలతో కొత్త తరహా కథా ప్రయోగాలు చేస్తున్నారు. స్టార్స్ అందకు సహరిస్తున్నారు.   సూపర్ 30 సినిమాలో హృతిక్ రోషన్ చినిగిపోయిన, మాసిపోయిన తలతో కనిపించినా జనం జై కొట్టారు. యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా కూడా బట్టతలతో కనిపించినా హిట్ చేసారు. ఆ ఉత్సాహంతో అక్కడ మరిన్ని వైవిధ్యభరిత చిత్రాలకు అవి దారి తీస్తున్నాయి.

 కానీ మన తెలుగు దగ్గరకు వచ్చేసరికి..ఎట్టి పరిస్దితుల్లోనూ హీరో అంటే స్టైలిష్ గా ఉండాలి.. హ్యాండ్ సమ్ లుక్ తో కనిపించాలి.  హీరో ఎంత పేదవాడైన సరే కోటు బూటు వేసుకునే తిరగాలి. ఇలా రియాలిటీకి దూరంగా  ఉండే సినిమాలే నడుస్తున్నాయి.కానీ ప్రపంచ సినిమాలు చూస్తూ, అక్కడ చదువుకుని వచ్చినవారు ప్రయోగాలు చేయటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. దర్శకుడు క్రాంతి మాధవ్ కూడా అలాంటి ఓ కొత్త తరహా ప్రయోగంతో మన ముందుకు వచ్చారు. ఇందులో ఆయన చేసిన ప్రయోగం ఏమిటి ?సినిమా ఎలాగుంది ? ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందా చూద్దాం.

స్టోరీ లైన్

గౌతమ్‌ (విజయ్‌ దేవరకొండ) ఓ యాస్పరింగ్ రైటర్. అతను తను ప్రేమించిన అమ్మాయి యామిని (రాశీ ఖన్నా)తో ప్రేమలో ఉంటాడు. పెళ్లి చేసుకుంటే సమస్యలు వస్తాయని, సహజీవనం మొదలెడతారు. అయితే రైటర్ గా అతనికి కోరిక అయితే ఉంది కానీ ఓ అక్షరం కూడా రాయలేకపోతూంటాడు. దాంతో చూసి చూసి…ఇలా బేవార్సుగా తయారవుతున్నాడేంటి అని బాధపడి,వార్నింగ్ ఇచ్చి, విసుగెత్తి చివరకు బ్రేకప్ చెప్పేస్తుంది. అప్పుడు అతనిలో ‘కథ’లిక మొదలవుతుంది. వరసపెట్టి కథలు రాయటం మొదలెడతాడు. ఆ కథల్లో తనే హీరో. అయితే ఈ కథల వల్ల అతను సాధించిందేమిటి. తన లోపల ఉన్న అసలు నేను ను బయిటపెట్టుకునే ప్రయత్నం చేసాడా…చివరకు జైలుకు వెళ్లాల్సిన పరిస్దితి ఏమొచ్చింది. యామిని తిరిగి వెనక్కి వచ్చిందా…ఇందులో కేథరిన్, ఐశ్వర్యరాజేష్, ఇజబెల్లా పాత్రలు ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

స్ర్రీన్ ప్లే సరిగమలు

ఇలాంటి కథలు స్క్రీన్ ప్లే పై పూర్తిగా బేస్ అవుతాయి. తన జీవితంలో ఏమి కావాలో అర్దం కానీ ఓ మగవాడి కథను తెరకెక్కించాలని దర్శకుడు భావించాడు. ఆ పాత్ర త్యాగాలు,ఎమోషన్స్ ఎవరికీ అక్కర్లేదు. అతని బాధను ఎవరూ పట్టించుకోరు. ప్రేమించి,సహజీవనం సైతం చేస్తున్న అమ్మాయి సైతం భరించలేకపోతుంది. ఎక్కడుంది సమస్య అని తనలోకి తను వెళ్లాలని ఆ పాత్ర కథలతో ప్రయాణం పెట్టుకుంటుంది. ఇదంతా ఓ కథగా చెప్పుకోవటానికి బావుంటుంది. కానీ తెరపైకి వచ్చేసరికి … కొన్ని వేరు వేరు ప్రేమ కథలు చూస్తున్నట్లు ఉంటుంది. జాయింట్స్ సరిగ్గా వేయలేదనిపిస్తుంది.

సినిమా ప్రారంభం చాలా ఇంట్రస్టింగ్ గా స్టార్టైంది. యామినీ, గౌతమ్ వాళ్ల రిలేషన్ షిప్ సమస్యలు ఎస్టాబ్లిష్ చేయటం బాగుంది. చాలా మెచ్యూరిటీగా హ్యాండిల్ చేసారనిపించింది. కానీ ఎప్పుడైతే హీరో..ఊహల్లోకి వెళ్లి కథలు కనటం మొదలెడతాడో అప్పుడే సినిమా లో విషయం ప్రక్కదారి పట్టింది. ఇంటర్వెల్ ఇంట్రస్టింగ్ గానే పడ్డా..సెకండాఫ్ మాత్రం చెప్పుకోదగినంత గొప్పగా లేదు. ఊహల్లో జరిగే కథే ప్రధానమైపోయింది. కానీ చూసేవాడు  మెయిన్ కథలో ఏం జరిగిందా ఎదురుచూస్తూంటాడు. దాంతో ఆ ట్రాక్ ల ఇంపాక్ట్ సినిమాపై బాగా పడింది. ఈ కథలన్నీ క్లైమాక్స్ లో కలిపే ప్రయత్నం చేసేసరికే చూసేవాడికి విసుగొచ్చేసింది.
 
నటీనటుల్లో…
ఇక సినిమాలో హైలెట్ ఏది అంటే విజయ్ దేవరకొండ పెరఫార్మెన్స్ అని చెప్పాలి. గౌతమ్ గా, శీనయ్యగా అదరకొట్టాడు. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్ సైతం తమ ఫెరఫార్మెన్స్ లో క్యారక్టర్స్ ని నిలబెట్టే ప్రయత్నం చేసారు. కేథరిన్, ఇస్ బెల్లా చేయటానికి ఏమీ లేదు.


 మ్యూజిక్..మిగతా డిపార్టమెంట్స్

గోపీ సుందర్ లో మొదటి రోజుల్లో ఉన్న మ్యాజిక్ మిస్సవుతూ వస్తోంది. అందుకు ఈ సినిమాకు ఆయన ఇచ్చిన మ్యూజికే ఉదాహరణ. ఒక్క పాట కూడా గొప్పగా లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ …జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ మాత్రం మరింత క్రిస్ప్ గా చెయ్యాలి. రైటింగ్ కొత్తగా ట్రై చేసారు. కానీ అది సరిపోదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి.

చూడచ్చా..
మీరు విజయ్ దేవరకొండ వీరాభిమాని అయితే బాగుందనిపిస్తుంది.

ఎవరెవరు…

న‌టీన‌టులు: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రాశీఖ‌న్నా, ఐశ్వర్య రాజేష్‌, ఇజాబెల్లె, కేథ‌రిన్, ప్రియ‌ద‌ర్శి, జ‌య‌ప్రకాష్‌, శ‌త్రు, విష్ణు త‌దిత‌రులు
స‌ంగీతం: గోపీసుంద‌ర్‌
ఛాయాగ్రహ‌ణం: జ‌య‌కృష్ణ గుమ్మడి
నిర్మాత‌: కె.ఎ.వ‌ల్లభ‌
స‌మ‌ర్పణ: కె.ఎస్‌.రామారావు
ర‌చ‌న‌, ద‌ర్శక‌త్వం: క్రాంతిమాధ‌వ్
విడుద‌ల‌: 14 ఫిబ్రవ‌రి 2020