వరుడు కావలెను మూవీ రివ్యూ
నాగ శౌర్య ‘వరుడు కావలెను’ మూవీ రివ్యూ
Emotional Engagement Emoji (EEE) :
రొమాంటిక్ కామెడీలు మన రీజనల్ లాంగ్వేజ్ లు సినిమాల్లో ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో చెప్తే బాగుంటాయి. సక్సెస్ రేటు కూడా ఎక్కువే. కాకపోతే అవి ఖచ్చితంగా రొమాంటిక్ కామెడీలే అయ్యిండాలి, రొమాన్స్, కామెడీ మిళితమై ఉండాలి. అయితే అంత జానర్ అవగాహనతో వచ్చే సినిమాలు మనకు తక్కువే. మన తెలుగులో అన్ని జానర్స్ మిక్స్ అయ్యి ఓ కొత్త జానర్ గా రూపాంతరం చెంది మన ముందు వాలుతూంటాయి. కాకపోతే కొత్త గా వచ్చే ఈ జనరేషన్ డైరక్టర్స్ మాత్రం అప్పుడప్పుడూ జానర్ మర్యాద ఇస్తూ కథలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ కొత్త దర్శకురాలు ఇండస్ట్రీ కు పరిచయం అవుతూ ‘వరుడు కావలెను’ చిత్రం చేసారు. ప్రోమోలుతో సినిమాలో విషయం ఉందనిపించారు. నిజంగానే సినిమాలో విషయం ఉందా…దర్శకురాలు ఈ సినిమాని రొటీన్ పంధాలోనే నడిపించారా లేక కొత్తగా ట్రై చేసారా..అసలు కథేంటి, రీతూవర్మకు మరో పెళ్లి చూపులు లాంటి సినిమా అవుతుందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
చాలా స్ట్రిక్ట్ గా ఉండే భూమి (రీతూ వర్మ) ప్రేమ,పెళ్లి వంటివాటికి దూరంగా ఉంటుంది. అందుకో ప్రస్తుతంలో ఓ కంపెనీ, గతంలో ఓ ప్లాష్ బ్యాక్ ఉంటాయి. గత,వర్తమాన లగేజీలతో ఆమె సతమతమవుతూ ఇలా స్ట్రిక్ట్ గా తయారైందన్నమాట. ఇక భూమికు ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేయాలనేది తల్లి (నదియా) జీవితాశయం. కానీ అది జరిగే పనిలా ఉండదు.ఈ లోగా పారిస్ నుంచి ఓ ప్రాజెక్ట్ పని మీద ఆకాష్ (నాగశౌర్య) హైదరాబాద్ లో లాండ్ అవుతాడు. ఫేమస్ ఆర్కిటెక్ట్‌గా పేరుతెచ్చున్న ఆకాష్… భూమిని ప్రాజెక్టు పనిలో భాగంగా కలుస్తాడు. ఆమె కంపెనీ బిల్డింగ్ కోసం ప్లాన్ ఇస్తాడు. ఆమెతో ప్రేమలో పడి ముందుకు వెళ్దామనుకుంటాడు. అందుకోసం ట్రైల్స్ వేస్తాడు. కానీ భూమి వాటిని అడ్డంగా కట్ చేస్తుంది. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించి ఆమెను ప్రేమలో పడేస్తాడు. ఇక ఒకరికొకరు ప్రపోజ్ చేసుకుంటారనుకునేలోగా ఓ ట్విస్ట్. ఇద్దరు విడిపోతారు. ఆ తర్వాత ఆమె గతం రివీల్ అవుతుంది. అందులో ఓ లవ్ స్టోరీ ఉంటుంది. ఇంతకీ భూమి గతంలో కాలేజీ రోజుల్లో ప్రేమలో పడింది..ఆకాష్ లవ్ ప్రపోజల్ ఏమైంది. ఇద్దరూ ఎలా ఒక్కటయ్యారు? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
స్క్రీన్ ప్లే విశ్లేషణ
ఈ కథ గతంలో నాగ్ హీరోగా వచ్చిన మన్మధుడుకు ఫిమేల్ వెర్షన్ లా కనిపిస్తుంది. సేమ్ స్క్రీన్ ప్లే ఫాలో అయ్యారు. అయితే ఆ సినిమాలో జరిగిన మ్యాజిక్ ని రిపీట్ చేయలేకపోయారు. అక్కడ సినిమాని నిలబెట్టిన ఫన్నీ ఎపిసోడ్స్ ఇక్కడ కరువు అయ్యాయి. త్రివిక్రమ్ లా డైలాగులు రాసారు కానీ సీన్స్ క్రియేట్ చేయలేకపోయారు. హీరో,హీరోయిన్స్ మధ్య ఎమోషన్, లవ్ ని డెప్త్ గా వెళ్లి ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. దాంతో ఇది వన్ సైడ్ కథగా కనపడుతుంది. రెండు వేపులా ఓపెన్ అయ్యేసరికి సినిమా క్లైమాక్స్ కు వచ్చేస్తుంది. అలాగే ఈ కథకు పెద్ద మైనస్ కాంప్లిక్ట్ సరిగ్గా లేకపోవటం. దాంతో సీన్స్ కేవలం డైలాగులతో నింపిన భాక్స్ లుగా మారాయి. కాంప్లిక్ట్ లేకపోవటంతో డ్రామా క్రియేట్ కాలేదు. కేవలం సీన్ తర్వాత సీన్..తర్వాత సీన్ అన్నట్లు పేర్చుకుంటూ పోయారు. ఉన్నంతలో లైటర్ వీన్ కామెడీని నమ్ముకోవటంతో బోర్ కొట్టలేదు అంతే. ఫస్టాఫ్ ఇంట్రవెల్ దాకా అయితే అసలు ఏమీ జరిగినట్లు ఉండదు. ఇంటర్వెల్ లో చిన్న ట్విస్ట్. సెకండాఫ్ ఫ్లాష్‌బ్యాక్ తో స్టార్ట్ అవుతుంది. ఆ ప్లాష్ బ్యాక్ వల్ల కథకు కలిసొచ్చిందేమీ లేదు. అలాగే అందులో కొత్తదనమేమీ లేదు. ఫ్లాష్‌బ్యాక్ తర్వాత కథ కాస్త కదులుతుంది. సప్తగిరి చేసే కామెడీ ఆ బోర్ నుంచి తప్పిస్తుంది. క్లైమాక్స్ ఊహకు తగ్గట్టే సాగినా అంతకు మించి చేయగలిగేది ఏమీ ఉండదు.
టెక్నికల్ గా ..
డైరక్టర్ గా లక్ష్మీ సౌజన్య…పాసైపోయింది. ఆమెకు ఇది ఫస్ట్ సినిమా అనిపించదు. ఫుల్ క్లారిటీతో సీన్స్ తెరకెక్కించింది. నాగశౌర్య, రీతూ వర్మ అందంగా చూపించింది. స్క్రిప్టు మరింత స్ట్రాంగ్ గా ఉండే సినిమా నెక్ట్స్ లెవిల్ లో ఉండేది. . వంశీ పచ్చిపులుసు కెమెరా వర్స్, తమన్, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ నచ్చుతాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నతంగా ఉన్నాయి. గణేశ్ రావూరి మాటలే ఈ సినిమాని నిలబెట్టాయి. ఎడిటర్ సినిమాని మరీ స్లో పేస్ లో లేకుండా చూడాల్సింది.
నటీనటుల్లో
నాగశౌర్య, రీతూ వర్మ క్యారక్టర్స్ లో లీనమయ్యారు. ఎమోషన్ సీన్స్ లో రీతూ చాలా పరిణితి ప్రదర్శించింది. ఇంటర్వెల్ ముందు, క్లైమాక్స్‌కి ముందు సీన్స్ ఆ విషయాన్ని చెప్తాయి. సప్తగిరి సెకండాఫ్ కు వెన్నుముకలా నిలిచారు, వెన్నెల కిషోర్, హిమజ, ప్రవీణ్ ఫస్టాఫ్ ని పట్టుకున్నారు మురళీశర్మ, నదియా హీరోయిన్ తల్లిదండ్రులుగా అలవాటైన పాత్రల్లో మెప్పించారు.
నచ్చినవి:
మాటలు, పాటలు
క్లీన్ సీన్స్
లీడ్ పెయిల్ నాగశౌర్య, రీతూ ఫెరఫార్మెన్స్
సప్తగిరి లాగ్ కామెడీ
పాటలు
నచ్చనవి :
విషయం లేక సాగతీయటం
ప్రెడిక్టబుల్ సీన్స్ తో స్క్రీన్ ప్లే
ప్లాష్ బ్యాక్
స్లో నేరేషన్
చూడచ్చా
వీకెండ్స్ ఫ్యామిలీస్ కు కలర్ ఫుల్ కాలక్షేపం
ఎవరెవరు..
బ్యానర్ : సితార ఎంటర్టైన్మెంట్స్
నటీనటులు :నాగశౌర్య, రీతువర్మ , నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష తదితరులు.
మాటలు: గణేష్ కుమార్ రావూరి,
ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
నిర్మాత: సూర్య దేవర నాగవంశీ
కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: లక్ష్మీసౌజన్య
రన్ టైమ్: 2h 13m
విడుదల తేదీ: 29, అక్టోబర్ 2021.