వసూళ్లలో నాలుగో స్థానానికి చేరిన ‘నిన్ను కోరి’ సినిమా

Published On: July 22, 2017   |   Posted By:
వసూళ్లలో నాలుగో స్థానానికి చేరిన ‘నిన్ను కోరి’ సినిమా
నాని, నివేత థామస్ హీరోహీరోయిన్లుగా నటించిన నిన్నుకోరి సినిమా ఓవర్సీస్ లో సూపర్ హిట్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. తాజా లెక్కల ప్రకారం.. తెలుగు రాష్ట్రాల కంటే ఓవర్సీస్ నుంచే ఈ సినిమాకు ఎక్కువ వసూళ్లు వస్తున్నాయట. సినిమా చాలా భాగం అమెరికా బ్యాక్ డ్రాప్ లో ఉండడంతో అక్కడి ప్రేక్షకులకు అది బాగా కనెక్ట్ అయింది.
తాజాగా విడుదల చేసిన లెక్కల ప్రకారం నిన్నుకోరి సినిమా ఓవర్సీస్ లో ఆల్ టైం తెలుగు సినిమా వసూళ్లలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం ఈ సినిమా వసూళ్లు 7కోట్ల 50లక్షల రూపాయలకు అటుఇటుగా ఉన్నాయి. నాని నటించిన ఓ సినిమా ఇలా టాప్-5లోకి ఎంటర్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం.
ఇక అమెరికాలో బాగా ఆడిన టాప్-10 తెలుగు సినిమాలేంటో చూద్దాం
బాహుబలి-2 – రూ. 128.57 కోట్లు
ఖైదీ నంబర్ 150 – రూ.16.33 కోట్లు
గౌతమీపుత్ర శాతకర్ణి – రూ. 11.01 కోట్లు
నిన్ను కోరి – రూ. 7.47 కోట్లు
కాటమరాయుడు – రూ. 7.39 కోట్లు
దువ్వాడ జగన్నాథమ్ – రూ. 7.37 కోట్లు
నేను లోకల్ – రూ. 6.87 కోట్లు
శతమానం భవతి –  రూ. 5.32 కోట్లు
ఘాజీ –  రూ. 4.99 కోట్లు
రారండోయ్ వేడుక చూద్దాం – రూ.3.59 కోట్లు