Reading Time: 3 mins

విక్రమ్‌ మూవీ రివ్యూ

కమల్ హాసన్ ‘విక్రమ్‌’ రివ్యూ

Emotional Engagement Emoji
?

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ సినిమాలు ఈ మధ్యకాలంలో పెద్దగా ఆడటం లేదు. అయితే వరసగా ఖైదీ, మాస్టర్ సినిమాలతో హిట్ కొట్టిన లోకేష్ కనగరాజ్ డైరక్టర్ కావటం, విజయ్ సేతుపతి విలన్ గా చేయటంతో సినిమాకు ఎక్కడలేని క్రేజ్ క్రియేట్ అయ్యింది. ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఆ బజ్ రెట్టింపు అయ్యింది. ఆ బజ్ ని సినిమా కొనసాగించిందా…సినిమాలో అసలు కంటెంట్ ఏమిటి..ఇంతకీ విక్రమ్ ఎవరు…కమల్ మ్యాజిక్ చెయ్యగలిగారా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథేంటి

సంతానం (విజయ్ సేతుపతి) కి చెందిన 2 లక్షల కోట్ల విలువైన ముడి కొకైన్‌తో కంటైనర్‌లు మిస్సవుతాయి. ఈ డబ్బు బయిటకు వస్తే… ఓ సమాంతర ప్రభుత్వాన్ని నడపడానికి సరిపోతుంది. దాంతో అతని కు, అతను కుటుంబానికి థ్రెట్ వస్తుంది. దాంతో ఎలాగైనా ఆ కంటైనర్స్ ని సొంతం చేసుకోవాలని రంగం లోకి దూకుతాడు. ఇదిలా ఉండగా…సిటీలో ఓ ముసుగు మనిషి వరసగా హత్యలు చేస్తూంటాడు. ఆ ముసుగు మనిషి కన్నన్ (కమల్ హాసన్)ని కూడా చంపుతాడు. ఆ ముసుగు మనిషి ఎవరనేది తెలియాలంటే మరో ముసుగులో ఉన్న వ్యక్తి ని రంగంలోకి దించాలని పోలీస్ అధికారులు ఫిక్స్ అవుతారు. ఈ క్రమంలో అండర్ కవర్ పోలీస్ అమర్ ( ఫహద్‌ ఫాజిల్‌) రంగంలోకి దించుతాడు. అతను తన ఇన్విస్టిగేషన్ మొదలెట్టి ముసుగు మనిషిని పట్టుకుంటాడు. ఆ ముసుగు మనిషి ముసుగు తొలిగించి చూసి షాక్ అవుతాడు. ఇంతకీ ఆ ముసుగు మనిషి ఎవరు… ఏజెంట్ విక్రమ్ ఎవరు? సంతానం కు చెందిన కంటైనర్స్ దొరికాయా… కన్నన్ అసలు కథేంటి..ఈ డ్రగ్స్ మాఫియాతో ఎలా కనెక్ట్ అయ్యాడు? ఇదే కథలోని సారాంశం.

విశ్లేషణ

మనకు మల్టీ స్టారర్ సినిమాలు కొత్తేమీ కాదు. కానీ విక్రమ్‌కు వీటన్నటికీ విభిన్నమైనది. ఇది ఈ సెగ్మెంట్‌లో కొత్త బెంచ్‌మార్క్‌ని సెట్ చేసే అద్భుతమైన ప్రయత్నం. మనం నటీనటులకు బదులుగా పాత్రలను వారి గొప్ప నటనను, వారి పాత్రలను మాత్రమే చూస్తాము. కమల్ హాసన్, విజయ్ సేతుపతి మరియు ఫహద్ ఫాసిల్ ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను పూర్తిగా భుజానకెత్తుకున్న వారి పాత్రలకు ఫెరఫెక్ట్ అనిపిస్తారు. అక్కడక్కడా తమిళ అతి అనిపించినా…పాత్రల ఎమోషన్స్ భాగమే అని భావిస్తాము. హీరో పర్శనల్ కాంప్లిక్ట్స్. సోషల్ కాంప్లిక్ట్ ని కలిపే ప్రయత్నం చేసారు. మాస్టర్ సినిమాలనూ ఇలాంటి ప్రయత్నమే చేసారు. ఇక్కడే అదే చేసారు. ఓ రకంగా ఇది అండర్ కాప్ ఫిల్మ్. ఆ తరహా సినిమాలు నచ్చేవారికి ఇది ఫెరఫెక్ట్ ఆప్షన్. లోకేష్ కనగరాజ్ బ్రిలియంట్ ఫిల్మ్ మేకర్ అని మరోసారి నిరూపించుకునే ప్రయత్నం చేసారు. అయితే ఈ ప్రయత్నంలో రాసిన స్క్రీన్ ప్లేలో కమల్ హాసన్ ..సినిమా ఫస్టాఫ్ లో పది నిముషాలు మాత్రమే కనిపించటం…కమల్ కోసం సినిమాకు వెళ్లేవారికి నిరాశ కలిగిస్తుంది. అయితే ఫస్టాఫ్ లో మిస్టరీ ఎలిమెంట్‌ని బాగా మెయింటైన్ చేశారు

సెకండాఫ్ లో ఆ లోటుని తీర్చేసారు. తండ్రి, కొడుకు ఎమోషన్ ని, తన ఏకైక వారసుడైన తన మనవడిని రక్షించడానికి తాత ఎలా ప్రయత్నిస్తున్నాడనేది మంచి ఎలిపెంట్. ఈ కథ గ్రిప్పింగ్ గా అనిపించింది. సెకండాఫ్ లో కమల్ మిషన్, అతని గురించి పూర్తిగా తెలిసాక రొటీన్ యాక్షన్ ఫిల్మ్ గా మారిపోయింది. సినిమాలో అడ్డుపడే పాటలు లేకపోవటం మంచి రిలీఫ్. విక్రమ్ ట్రీట్‌మెంట్ గతంలో లోకేష్ డైరెక్ట్ చేసిన ఖైదీ సినిమాని గుర్తు తెస్తుంది. కానీ విక్రమ్ కథ, ఎంచుకున్న బ్యాక్ గ్రౌండ్ పెద్దవి, క్యారక్టరైజేషన్స్ విభిన్నమైనవి. ఏదైమైనా ఇది కమల్, లోకేష్ కనగరాజ్ ఫ్యాన్స్ కు విందు భోజనం లాంటిదే.మిగతా వాళ్లకు ఓకే ఓకే ఫిల్మ్.

టెక్నికల్ గా…

దర్శకుడుగా లోకేష్ కనగరాజ్ స్టైల్ ఆఫ్ డైరెక్షన్ ఈ సినిమాలో మనకు కనపడుతుంది. తన తొలి చిత్రం ఖైదీ సినిమాలో కొన్ని సీన్స్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ సినిమాలో కూడా అలాంటి సన్నివేశాలను తెరకెక్కించటం బ్రిలియెంట్ ఐడియా. కథలో విషయం లేని చోట కూడా తనదైన స్టైల్ నెరేషన్ తో లోకేష్ కనగరాజ్ ప్రేక్షకులను తమ సీట్లకు కట్టిపడేస్తారు. కొన్ని చోట్ల కథ ప్రెడిక్టబుల్ గా ఉన్నప్పటికీ లోకేష్ తన నెరేషన్ తో కథను ముందుకు తీసుకు వెళ్లారు. సినిమాటోగ్రాఫర్ అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ సోసోగా ఉంది. అనిపిస్తుంది. అనిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కేక. అలాగే ముగ్గురు హీరోల కీ మూడు వేరే ట్యూన్స్ ని అందించి ఎలివేట్ చేయటం కూడా ప్రయోగమే. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకి బాగానే ప్లస్ అయ్యాయి.

నటీనటుల్లో కమల్ హాసన్ ఈ సినిమాలో వన్ మ్యాన్ షో. యాక్షన్ సీన్స్ తో పాటు ఎమోషన్ సన్నివేశాలలో కూడా అలరించారు. క్యారక్టర్ లో వేరియేషన్స్ ను కూడా కమల్ అద్బుతంగా చూపెట్టారు. విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఫాహాధ్ ఫాసిల్ కూడా తనదైన స్టైల్ లో తన పాత్రలో ఒదిగిపోయారు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

చూడచ్చా

లోకేష్ కనగరాజ్ అభిమానులకు ఇది పండగ లాంటి సినిమా. ఖచ్చితంగా చూడొచ్చు.

బ్యానర్: రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్
నటీనటులు: కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్, కాళిదాస్ జయరామ్, నరేన్, అర్జున్ దాస్, శివాని నారాయణన్ తదితరులు
సంగీతం : అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రాఫర్: గిరీష్ గంగాధరన్ ,
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్
మాటలు (తెలుగులో) : హనుమాన్ చౌదరి
యాక్షన్: అన్భు – అరువు
దర్శకత్వం: లోకేష్ కనగరాజ్
నిర్మాతలు: కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్
తెలుగు రిలీజ్ : శ్రేష్ట్ మూవీస్
రన్ టైమ్: 172 నిముషాలు
విడుదల తేదీ : 03, జూన్ 2022.