విడుదలకు సిద్దమైన రైఫిల్ చిత్రం
సే ఫ్యాక్ట్ క్రియేషన్స్ పతాకంపై భాను చందర్, కిరణ్, చందన సిరి కృష్ణన్, చమ్మక్ చంద్ర, రేఖ నటీ నటులుగా వెంకట్ రామళ్ల దర్శకత్వంలో సాయి సిద్దార్థ రామళ్ల నిర్మించిన చిత్రం రైఫిల్ .అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా ముందుగా మీడియా మిత్రులకు ప్రీమియర్ షో వేయడం జరిగింది. షో అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో
చిత్ర దర్శకుడు వెంకట్ రామళ్ల మాట్లాడుతూ..ఇది ఒక డి. గ్లాసిఫైడ్ ట్రూ స్టోరీ..20 సంవత్సరాల క్రితం తెలంగాణ ప్రాంతంలోని ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల్లో జరిగిన ఇన్సిడెంట్ ను స్టోరీని తీసుకొని ఈ సినిమా చేయడం జరిగింది .ఈ సినిమాకు లొకేషన్స్ మొదలుకొని ప్రొడక్షన్స్ డిజైన్స్ అన్నీ మా అమ్మాయి సిందూజ చూసుకుంది.యంగ్ యానర్జటిక్ స్టార్ మా అబ్బాయి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు.. కో ప్రొడ్యూసర్ గా మా వైఫ్ చేసింది.. నేను మంచి టీం ను సెలెక్ట్ చేసుకొని డైరెక్షన్ చేశాను.. నటీ, నటులు, టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా రైఫిల్ సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
చిత్ర నిర్మాత సాయి సిద్దార్థ రామళ్ళ మాట్లాడుతూ.. ఈ రోజు మీడియాకు వేసిన ప్రీమియర్ షో లో చూసిన వారందరూ సినిమా బాగుందని చెప్పడంతో చాలా సంతోషం వేసింది.మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా రైఫిల్ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుందని అన్నారు
గెస్ట్ గా వచ్చిన నటుడు కార్తికేయ మాట్లాడుతూ..సినిమా చాలా బాగుంది.ప్రస్తుత సమాజంలో మార్పు రావాలనే ఉద్దేశ్యం తో వెంకట్ గారు తన కుటుంబంలోని వారందరినీ ఇన్వాల్వ్ చేస్తూ చక్కటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా తీశారు.. ఈ సినిమా వారందరికీ బిగ్ హిట్ అవ్వాలని అన్నారు.
ఆర్టిస్ట్ డా!మారుతి మాట్లాడుతూ..ఇది ఒక చక్కటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా .. ఎవరి చేతుల్లో రైఫిల్ ఉంటే బాగుంటుంది అనేది సినిమాలో చాలా చక్కగా చెప్పారు..అలాగే ఫారెస్ట్ లో సినిమా తీయడం చాలా కష్టం అలాంటింది ఫారెస్ట్ లో తీసిన సీన్స్ బాగా వచ్చాయి.ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
ఆర్టిస్ట్ ధనరాజ్ మాట్లాడుతూ.. ఈ సినిమా చూసిన తరువాత ఇందులో నేను చెయ్యనందుకు చాలా బాధ పడుతున్నాను. సమాజానికి ఎలా మంచి చెయ్యచ్చో ఈ సినిమా లో చాలా చక్కగా చూయించారని అన్నారు.
ఆర్టిస్ట్ దాసన్న మాట్లాడుతూ.. వెంకట్ నా ప్రియ మిత్రుడు.. కలలే నా కుటుంబం అనే రీతిలో ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి తను డైరెక్షన్ చేస్తూ తన కొడుకును నిర్మాతగా, ప్రొడక్షన్ డిజైనర్ గా కూతురును, కో ప్రొడ్యూసర్ గా భార్యను ఇండస్ట్రీ కి పరిచయం చేయడం చాలా హ్యాపీ గా ఉంది..ఎంతో కష్టపడి చేసిన ఈ రైఫిల్ సినిమాను ప్రేక్షకులను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..
ఆర్టిస్ట్ వర్షిత మాట్లాడుతూ.. రామ్ గారి ఫ్యామిలీ అందరూ కష్టపడి చేసిన ఈ సినిమాను ప్రేక్షకులందరూ బిగ్ హిట్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు
తారాగణం :
భాను చందర్, కిరణ్, చందన సిరి కృష్ణన్, చమ్మక్ చంద్ర, రేఖ, జయ నాయుడు, జగదీశ్వరి, మారుతీ సాకారం, వీరభద్రం, యుగంధర్, పట్టాభి గుప్తా, శ్రీ కుమారి, తడివేలు
సాంకేతిక నిపుణులు :
బ్యానర్ : సే ఫ్యాక్ట్ క్రియేషన్స్
కెమెరా: సుధాకర్ నాయుడు
ఎడిటింగ్: స్వామి చిత్రాల
సంగీతం: విజయ్ సలవాడి
నిర్మాత : సాయి సిద్దార్థ రామళ్ల
కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం: వెంకట్ రామళ్ల