వివాహ భోజనంబు మూవీ రివ్యూ
సత్య ‘వివాహ భోజనంబు’ రివ్యూ
Rating:2/5
‘వివాహ భోజనంబు’ కు రెండు ప్లస్ లు ఉన్నాయి. ఒకటి ఈ సినిమాకు ఎంచుకున్న కరోనా లాక్ డన్ నేపధ్యం. రెండోది కామెడీ టైమింగ్ బీబత్సంగా ఉన్న సత్య. ఈ రెండు సినిమాపై ఎక్సపెక్టేషన్స్ బాగా పెంచేసాయి. ట్రైలర్, టీజర్ చూస్తే ఏదో హిలేరియస్ ఎంటర్టైనర్ చూడబోతున్న ఫీల్ తెచ్చాయి. ఆ ఎక్సపెక్టేషన్స్ ని ఏ మేరకు ఈ సినిమా అందుకుంది. సత్య హీరోగా బిజీ అవుతాడా..అసలు కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
మహేష్ పరమ పినాసి మహేష్ (సత్య). పార్కింగ్ ఫీజుకు పది రూపాయలు కట్టాలి అని తనకు పనున్న చోటి నుంచి దూరంగా గుడి దగ్గరకు వెళ్లి బండి పార్క్ చేసి వచ్చే రకం. అతణ్ని ఓ పెద్దింటి అందమైన అమ్మాయి అనితతో (ఆర్జావీ) ప్రేమిస్తుంది. ఆమె తండ్రి రామకృష్ణ (శ్రీకాంత్ అయ్యంగార్) కి మహేష్ మైండ్ పోతుంది.అల్లుడుగా యాక్సెప్టు చేయలేకపోతాడు. కానీ తనకు ఏ మాత్రం ఇష్టం లేకపోయినా తప్పక పెళ్లికి ఓకే చెప్తాడు. మహేష్ పెళ్లికు గ్రీన్ సిగ్నల్ వస్తుంది. అతను ఆనందంగా పెళ్లి చేసుకున్న సమయానికే కరోనా కారణంగా లాక్ డౌన్ మొదలవుతుంది. వేరే దారిలేక అమ్మాయి తరఫు బంధువులంతా అతడి ఇంట్లోనే తిష్ట వేస్తారు. అక్కడ నుంచి వాళ్లను పంపించేయాలని మహేష్ ఏం ప్లాన్స్ చేసారు. డబ్బు ఖర్చు విషయంలో అతను పడ్డ ఇబ్బందులేంటి.. మహేష్ అంత పిసినారిగా ఉండటానికి కారణమేంటి, అంబులెన్స్ డ్రైవర్ నెల్లూరు ప్రభ (సందీప్ కిషన్) పాత్ర ఏమిటి? .. వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
స్క్రీన్ ప్లే ఎనాలసిస్…
కరోనా టైమ్ లో జనాలు పడ్డ కష్టాలు చుట్టూ అల్లుకున్న ‘వివాహ భోజనంబు’లో ప్రిమైజ్ ఇంట్రస్టింగ్. పరమ పిసినారి అయిన హీరో ఇంట్లో లాక్ డౌన్ కారణంగా లాక్ అయిపోయిన అత్తారింటి జనం…వారి చుట్టూ తిరిగే కామెడీ. సత్య కామెడీ టైమింగ్, ఈ బేసిక్ ప్లాట్ లైన్ చూసి ఓ రేంజిలో ఎక్సపెక్టేషన్స్ పెట్టుకుంటే ఈ సినిమా వాటిని చల్లార్చేస్తుంది. ఎక్కడా పడి పడీ నవ్వుకునే సిట్యువేషన్స్ క్రియేట్ చేయలేదు. ఎంతసేపు బడ్జెట్ లో నడిచిపోయే సీన్స్ మాత్రమే అల్లుకున్నారు. దాంతో ట్రైలర్ లో చూసిన విషయం తప్ప సినిమాలో అంత మ్యాటర్ లేదని అర్దమైపోతుంది. ముఖ్యంగా కథ,కథనం తేలిపోయాయి. సినిమాకు కావాల్సిన మలుపులు ఎక్కడా లేవు. లేజీ రైటింగ్ సినిమాని రిపీట్ సీన్స్ తో నిండిపోయేలా చేసింది. అలాగని ఎక్కడా నవ్వులు లేవు అని కాదు..సినిమాకు సరిపడినన్ని లేవు. అప్పటికీ లాక్ డౌన్ టైమ్ లో ఆశీర్వాద్ ఆటా కోసం పడిన పాట్లు, అప్పుడు వచ్చిన మీమ్స్, ఫన్నీ వీడియోలూ.. ఈ సినిమా కోసం వాడున్నారు. అవన్నీ ప్రేక్షకులు రిలేట్ చేసుకుంటున్నారు. కానీ సరిపోలేదు. సినిమాకు షార్ట్ ఫిలింకు తేడా అక్కడే వస్తుంది. కథ లో మలుపులు లేకపోతే సినిమా పండదు. చూసేవాడి గుండె నిండదు. నిర్మాత గల్లాపెట్టె నిండదు. ఇదంతా ఇంటర్ లింక్. ఒకప్పుడు జంధ్యాల,ఇవివి వంటివారు చేసే కామెడీ సినిమాలు చూస్తే ఇలాంటి కామెడీ సినిమాల్లో ఉన్న లోపం స్పష్టంగా కనపడుతుంది. కామెడీ సినిమా అనేది సీరియస్ బిజినెస్ అది గుర్తించాలి.
టెక్నికల్ గా
దర్శకుడుగా రామ్ అబ్బరాజు చాలా సింపుల్ సీన్స్ తో సినిమాని లాగేసాడు. ఎక్కడా తను శ్రమ పడలేదు.ప్రేక్షకుడుకి పెట్టలేదు. అయితే అదే క్రమంలో సినిమా డెప్త్,ఎమోషన్ మిస్సైన విషయాన్ని మర్చిపోయాడు. సినిమాలో హైలెట్ గా ఉన్న అంశాలుకూడా చాలా సాదాసీదాగా ముందుకు వెళ్లిపోయాయి. ఎక్కడా ఏదీ రిజిస్టర్ కాలేదు. దాంతో ఏదో జబర్దస్త్ కామెడీ స్క్రిప్ట్ లా స్కిట్ లా గడిచింది. కామెడీకు సినిమాలో చాలా స్కోప్ ఉన్నా ప్రయత్నించలేదు. డైరక్టర్ గా అతను జస్ట్ ఓకే అనిపించుకున్నాడు. ఇక అన్వీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. ,కొత్తగానూ లేదు..చెత్తగానూ లేదు.వాటే మ్యాన్ అంటూ సాగే థీమ్ మ్యూజిక్ సత్య క్యారక్టర్ ని హైలెట్ చేయటానికి పనికొచ్చింది.ఎబిసిడీ సాంగ్ బెస్ట్. మణికందన్ సినిమాటోగ్రఫీ, చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ అద్బుతం కాదు కానీ సినిమాకు సరిపోయాయి. ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం మరీ లో బడ్జెట్ లో చుట్టేసినట్లు స్పష్టంగా తెలిసిపోతున్నాయి.
నటీనటుల విషయానికి వస్తే..సత్య తన కామెడీ టైమింగ్ తో పన్ లేని చోట కూడా పుట్టించే ప్రయత్నం చేసాడు. హీరోయిన్ చూడ్డానికి బాగుంది కానీ నటన జస్ట్ ఓకే. అంతకు మించి చేయటానికి ఏమీ లేదు సందీప్ కిషన్ తన పాత్ర సినిమాకు ఏమీ కలిసి రాలేదు. శ్రీకాంత్ అయ్యంగార్ ఇలాటి పాత్రలు చాలా చేసేయటం వల్ల ప్రత్యేకంగా ఏమీ అనిపించలేదు. సుదర్శన్ తన నెల్లూరు యాసతో మరోసారి నవ్వించాడు.
బాగున్నవి
సత్య కామెడీ టైమింగ్
లాక్ డౌన్ బ్యాక్ డ్రాప్
బాగోలేనివి
ఊహకు అందే కథ
ఫ్లాష్ బ్యాక్, క్లైమాక్స్
అర్దం పర్దం లేని స్క్రీన్ ప్లే
చూడచ్చా
అక్కడక్కడా కొన్ని పంచ్ లు,సిట్యువేషన్స్ నవ్విస్తాయి. చాలు అనుకుంటే చూసేయచ్చు
తెర వెనక ..ముందు
నటీనటులు: సత్య, సందీప్ కిషన్, ఆర్జవి, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, సుబ్బరాయశర్మ, టీఎన్ఆర్(దివంగత), హర్ష, శివన్నారాయణ, మధుమణి, నిత్యశ్రీ, కిరీటి తదితరులు;
సంగీతం: అన్వీ;
సినిమాటోగ్రఫీ: ఎస్.మణికందన్;
ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్;
నిర్మాత: కె.ఎస్.శినిష్, సందీప్ కిషన్;
రచన: భాను భోగవరపు;
మాటలు: నందు ఆర్.
దర్శకత్వం: రామ్ అబ్బరాజు;
రన్ టైమ్ :2 గంటల,1 నిముషం
విడుదల తేదీ: 27 ఆగస్ట్, 2021
ఓటీటి: సోనీ లివ్