వెల్లువ చిత్రం టైటిల్ పోస్టర్ విడుదల
వీనస్ మూవీస్ పతాకంపై రంజిత్, సౌమ్య మీనన్(కేరళ), అలీ, రావు రమేష్, పెద్ద నరేష్, నటీనటులు గా మైల రామకృష్ణ దర్శకత్వంలో M. కుమార్ , M. శ్రీని వాసులు సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న చిత్రం “వెల్లువ”.
ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లోని సైనిక్ పురి లోగల హైజాక్ బిస్ట్రో లో అలీ పై ‘చెప్పకురా మామా నువ్వు చెప్పకు సారీ ‘ సాంగ్ చిత్రీకరణ జరుపుకుంటుంది.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.ఈ సమావేశంలో అలీ గారు ‘వెల్లువ’ చిత్ర టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు.
అనంతరం
నటుడు అలీ మాట్లాడుతూ* ..చిత్ర నిర్మాత కుమార్ గారు మనీషా ఫిల్మ్స్ లో 20 సంవత్సరాలుగా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా పని చేశాడు, ఇప్పుడు ఈ చిత్రాన్ని శ్రీనివాస్ గారితో కలిసి నిర్మిస్తున్నాడు. హీరో రంజిత్ కి ఇది మూడవ సినిమా. రంజిత్ తో గతంలో జువ్వ మూవీ చేసాను. ఇది తనతో రెండవ సినిమా .ఈ సినిమా కోవిడ్ కారణంగా ఆలస్యం అయ్యింది. అసిస్టెంట్ గా, కో డైరెక్టర్ గా,.అసోసియేట్ డైరెక్టర్ గా వ్యవహరించిన రామకృష్ణ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయ మవుతున్నాడు. ఈ సినిమాకు ఘంటాడి కృష్ణ అద్భుతమైన పాటలు అందించాడు.ఇందులో నాతో “చెప్పకురా మామా ..నువ్వు చెప్పకు సారీ ..పాటను పాడించారు. ఇందులో హీరో హీరోయిన్లు చాలా చక్కగా నటించారు ఇది బ్యూటిఫుల్ మెసేజ్ ఉన్న కథ . అక్టోబర్ లో విడుదల అవుతున్న ఈ సినిమా చిత్ర యూనిట్ కు పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అన్నారు.
చిత్ర దర్శకుడు రామకృష్ణ మాట్లాడుతూ … నిర్మాతలకు నేను చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. లవ్, ఫ్యామిలీ ఎమోషన్ తో వస్తున్న చిత్రమిది. నిర్మాతలు నాకేం కావాలో అన్ని సమకూర్చారు. కొవిడ్ కారణంగా లేట్ అయినా సినిమా చాలా బాగా వచ్చింది. ఘంటాడి కృష్ణ గారి సంగీతం,బాల్ రెడ్డి గారి ఫోటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్ అవుతుంది. హీరో హీరోయిన్లు చాలా చక్కగా నటించారు. రావు రమేష్ గారు, అలీ, సీనియర్ నరేష్, లాంటి పెద్ద నటులతో సినిమా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.హీరో రంజిత్, అలీ గార్లతో చేసే ఈ పాటతో తో సినిమా పూర్తయింది. ప్రేక్షకులందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.
హీరో రంజిత్ మాట్లాడుతూ .. సీనియర్ నటులతో నేను చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఘంటాడి కృష్ణ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలీ గారితో కలసి పాట చేసుకున్నందుకు చాలా అందంగా ఉంది .ఇలాంటి మంచి సినిమా లో నటించే అవకాశం కల్పించిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
చిత్ర నిర్మాత ఎం శ్రీనివాసులు మాట్లాడుతూ ..దర్శకుడు చెప్పిన కథ నచ్చింది.విద్యార్థి చివరి దశలో మనం జీవనోపాధిని ఏర్పాటు చేసుకుంటే జీవితాంతం అందరమూ కూడా సంతోషంగా ఉంటాం.జీవనోపాధి తర్వాతే లవ్, పెళ్లి అనే మంచి కాన్సెప్టు తో వస్తున్న సినిమా ఇది. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు మంచి మెసేజ్ అందిస్తున్నాము.ఇందులో నటీనటులు అందరూ చాలా చక్కగా నటించారు .మంచి కాన్సెప్టుతో వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆశీర్వదించాలని కోరుచున్నాను అన్నారు.
మరో నిర్మాత కుమార్ మాట్లాడుతూ ..ఈ సినిమా అలీ, రావు రమేష్ , సీనియర్ నరేష్ గార్లకు కథ నచ్చడంతో సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. వారికి ఈ కథ నచ్చడంతో ఈ సినిమాపై మాకు మరింత నమ్మకం ఏర్పడింది.. గతంలో నేను చాలా సినిమాలు చేశాను సీనియర్ నటులతో ఇప్పుడు ఈ చిత్రాన్ని తీస్తున్నాం .సినిమాలో మంచి కంటెంట్ ఉంది. సొసైటీకి ఇలాంటి మంచి సినిమా కావాలి. ఘంటాడి కృష్ణ గారు అందించిన పాటలను ప్రేక్షకులు అందరూ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. టెక్నీషియన్స్ అందరూ కోవిడ్ పరంగా ఎంతో ఇబ్బంది పడిన కూడా మాకు సపోర్ట్ గా నిలిచారు వారి వల్లే సినిమా బాగా వచ్చింది. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది..అన్నారు
సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ మాట్లాడుతూ … వీనస్ పతాకంపై వస్తున్నా “వెల్లువ” సినిమాకు నేను నిజంగా వెల్లువ లాంటి సంగీతం అందించాను. ఇంత మంచిది సబ్జెక్టుకు ఇంత మంచి పాటలు నాతో దగ్గరుండి చేయించుకున్నారు దర్శక, నిర్మాతలు.నిర్మాతలకు సినిమాపై టేస్ట్ ఉండడం వల్లే పాటలు సిచువేషన్ తగ్గట్టు బాగా వచ్చాయి. ఈ సినిమా నేను అందించిన మ్యూజిక్ నా కెరీర్లో మైల్ స్టోన్ గా నిలుస్తుంది అని భావిస్తున్నాను అన్నారు.
నటీనటులు
రంజిత్ , సౌమ్య మీనన్ (కేరళ ),విలన్ గగన్ విహారి (108 మూవీ ఫేమ్),రావు రమేష్, పెద్ద నరేష్, ఆలీ, సత్యం రాజేష్, తోటపల్లి మధు, ఆటో రామ్ ప్రసాద్, జూనియర్ రేలంగి, ఆనంత్, కెవ్వు కార్తిక్, సంధ్య జనక్, సుధ (కన్నడ),రియా, కల్పన, రాధిక
సాంకేతిక నిపుణులు
నిర్మాతలు :- M. కుమార్ , M. శ్రీనివాసులు
డైరెక్షన్ :- మైల రామకృష్ణ
ఎగ్స్క్యూటివ్ ప్రొడ్యూసర్ :- బి.నాగేశ్వర్ రావు
మ్యూజిక్ :-ఘంటాడి కృష్ణ
డి.ఓ.పి :- బాల్ రెడ్డి
ఎడిటర్ :- ప్రవీన్ పూడి
రైటర్ :-పరుచూరి నరేష్
డాన్స్ మాస్టర్ :- అజయ్ ,వెంకటేష్ దీప్
ఫైట్ మాస్టర్ :- శంకర్
ఆర్ట్ డైరెక్టర్ :- నారాయణ
లిరిక్స్ :- రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీ మణి, ఉమా మహేష్, పండు తన్నేరు