Reading Time: 3 mins

`వ‌జ్ర క‌వ‌చ‌ధ‌ర గోవింద‌` సినిమా స‌క్సెస్ మీట్‌

స‌ప్త‌గిరి హీరోగా న‌టించిన సినిమా `వ‌జ్ర క‌వ‌చ‌ధ‌ర గోవింద‌`. వైభ‌వీజోషి నాయిక‌. అర్చ‌న కీల‌క పాత్ర‌లో న‌టించారు. శివ‌శివ‌మ్ ఫిల్మ్స్ నిర్మించింది. న‌రేంద్ర , జి.ఎన్‌.రెడ్డి నిర్మాత‌లు. అరుణ్ ప‌వార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా ఈ నెల 14న విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా ఆదివారం హైద‌రాబాద్‌లో స‌క్సెస్‌మీట్‌ను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా 

నిర్మాత న‌రేంద్ర మాట్లాడుతూ “చాలా ఆనందంగా ఉంది. ఏం మాట్లాడాలో అర్థం కావ‌డం లేదు. శివ శివ‌మ్ ఫిల్మ్స్ ప‌తాకంపై `వ‌జ్ర క‌వ‌చ‌ధ‌ర గోవింద‌` అనే సినిమా చేశాం. మాది మాస్ సినిమా. మాస్ ప్రేక్ష‌కుల‌కు న‌చ్చింది. ఆద‌రిస్తున్న అంద‌రికీ ధ‌న్య‌వాదాలు. ఈ స‌క్సెస్‌కు కార‌ణ‌మైన మీడియా మిత్రుల‌కు ధ‌న్య‌వాదాలు. వాళ్లు లేకుంటే మా బ్యాన‌ర్ ఉండేది కాదు. మా సంస్థ‌ను నిల‌బెట్టినందుకు వారికి ధ‌న్య‌వాదాలు. ఈ చిత్రంతో సినిమా ఇండ‌స్ట్రీలో మా బ్యాన‌ర్ ఉంద‌ని అంద‌రికీ తెలిసింది. ఈ సినిమాకు సంబంధించి మేం భారీ హిట్లు ఏమీ ఊహించ‌లేదు. కానీ మా  శ్ర‌మ‌కు త‌గ్గ ప్ర‌తిఫ‌లం కావాల‌ని మాత్రం కోరుకున్నాం. అది ద‌క్కింది. అంద‌రం తృప్తిగా ఉన్నాం. నిర్మాత‌గా 100 శాతం మేం స‌క్సెస్ అయ్యాం. ప‌రిపూర్ణంగా సేఫ్ అయ్యాం అని చెప్తున్నాం. స‌ప్త‌గిరిగారు ఎల్ల‌వేళ‌లా మా వెన‌కే ఉండి స‌పోర్ట్ చేశారు. స‌ప్త‌గిరిలాంటి హీరోను న‌మ్ముకుంటే క‌చ్చితంగా 200 కుటుంబాలు బ‌తుకుతాయి. మా సంస్థ‌లో ఏడాదికి రెండు సినిమాలు చేయాల‌నుకుంటున్నాను. మేం ప‌డ్డ శ్ర‌మ‌కి స‌క్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది.  ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌కు, సాంకేతిక నిపుణుల‌కు ధ‌న్య‌వాదాలు. మా సినిమాను కొని మ‌మ్మ‌ల్ని ముందుకు న‌డిపించిన బ్ర‌హ్మ‌య్య‌గారికి ధ‌న్య‌వాదాలు. ఆయ‌న కూడా రిలీజ్ చేసి సేఫ్ అయ్యార‌ని తెలిసి చాలా ఆనందంగా ఉన్నాం“ అని అన్నారు. 

బ్ర‌హ్మ‌య్య మాట్లాడుతూ “నేను గ‌తంలో 114 సినిమాలు సీడెడ్‌లో రిలీజ్ చేశా. ఏ సినిమాను ఎంత‌కు కొనాలో నాకు తెలుసు. నేను అడిగిన రేటుకు `వ‌జ్ర‌క‌వ‌చ‌ధ‌ర‌గోవింద‌`ను నాకు ఇచ్చారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ పూర్తిగా నేనే బిజినెస్  చేశాను. వైజాగ్‌, ఈస్ట్, వెస్ట్, కృష్ణ‌, గుంటూరు, నెల్లూరు, నైజామ్‌లో డిస్ట్రిబ్యూట‌ర్లు న‌న్ను న‌మ్మి సినిమా తీసుకున్నారు. ఈ ఏడాది జ‌న‌వ‌రి నుంచి కొన్ని థియేట‌ర్ల‌లో జ‌నాలు లేక `హాలు రిపేరులో ఉన్న‌ది` అని బోర్డు పెట్టిన ఉదంతాలు కూడా నాకు తెలుసు. స‌రైన సినిమా లేకపోవ‌డంతో త‌లెత్తిన దారుణ‌మైన ప‌రిస్థితి ఇది. సినిమాలు లేక ఎగ్జిబిట‌ర్లు అల్లాడిపోతున్నారు. ఆ స‌మ‌యంలోనే 14న 400 థియేట‌ర్ల‌లో `వ‌జ్ర‌క‌వ‌చ‌ధ‌ర‌గోవింద‌`ను విడుద‌ల చేశాం. ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌తో ఈ సినిమా బాగా ఆడుతోంది. 2 రోజుల‌కు రూ.90ల‌క్ష‌ల గ్రాస్ వ‌సూలు చేసింది. 14న విడుద‌లైన నాలుగు సినిమాల్లోనూ ఈ సినిమా పెద్ద హిట్ అయిందంటే మేం స‌క్సెస్ సాధించిన‌ట్టే. మేం 20-30 కోట్ల‌తో సినిమా చేయ‌లేదు. చిన్న హీరోతో చేశాం. మా ఖ‌ర్చుతో పోలిస్తే చాలా లాభం వ‌చ్చింది. బీసీ సెంట‌ర్ల వారు బాగా ఆద‌రిస్తున్నారు. రూ.500కూలీకి వెళ్లేవారు కూడా రూ.50 పెట్టి ఈ సినిమాను చూస్తుండ‌టం గ్రేట్‌. స‌ప్త‌గిరి ప్ర‌తిరోజూ తెల్లారుజామున 6 గంట‌ల‌కు లొకేష‌న్‌కి వ‌స్తే, రాత్రి 1 గంట‌కు ఇంటికి వెళ్తున్నాడు. ఆయ‌న చేసిన కృషికి ఆద‌ర‌ణ ద‌క్కింది“ అని చెప్పారు.

అర్చ‌న మాట్లాడుతూ “నేను ఈ సినిమాలో న‌ల్లూరి ప్ర‌స‌న్న‌ల‌క్ష్మీ అనే పాత్ర చేశాను. ఎం.ఎల్‌.ఏగా చేశాను. ఆపేరులోనే ఓ గ‌మ‌కం, వెయిట్ ఉన్నాయి. నాకు చాలా న‌చ్చిన పాత్ర అది. స‌ప్త‌గిరిగారు ఆ పాత్ర‌కు న‌న్ను అనుకున్నందుకు ధ‌న్య‌వాదాలు. మా నిర్మాత‌లు సినిమా విడుద‌ల‌కు ముందే `మంచి లాభాల‌కు సినిమాను అమ్మేశాం` అని చెప్పారు. ఆ రోజే మా సినిమా స‌క్సెస్ అయింది . సినిమాను విడుద‌ల చేసిన బ్ర‌హ్మ‌య్య‌గారు ఇంత ఆనందంగా ఉన్నారంటే రియ‌ల్ స‌క్సెస్ అని అర్థం. సినిమాల్లో చిన్నా, పెద్దా ఉండ‌వు. మంచి పాత్ర ఉంటే త‌ప్ప‌కుండా ఆర్టిస్టుల‌కు గుర్తింపు వ‌స్తుంది. స‌ప్త‌గిరిగారు ప్ర‌తి ఆర్టిస్టుకీ కంఫ‌ర్ట్ ఇస్తారు. నేను సినిమాకు సంత‌కం చేసిన‌ప్పుడు కొన్ని సీన్లే ఉన్నాయి. కానీ పాత్ర బాగా వ‌స్తోంద‌ని పెంచారు. ఈ సినిమాను `ఎ` సెంటర్ల‌లోనూ బాగా ఆద‌రిస్తే ఇంకా పెద్ద హిట్ అవుతుంది. ఓ సారి ఈ త‌ర‌హా సినిమాల‌ను ఎ సెంట‌ర్ వాళ్లు రుచి చూస్తే బావుంటుంది“ అని అన్నారు.

ద‌ర్శ‌కుడు అరుణ్ ప‌వార్ మాట్లాడుతూ “కాలేజ్, స్కూల్ ఓపెనింగ్ టైమ్‌లోనూ సినిమా ఇంత బాగా ఆడుతున్నందుకు ఆనందంగా ఉంది. నేను మాట్లాడే ప్ర‌తిదీ నా సినిమా మీద ప్రేమ‌తో మాట్లాడుతున్నాను. మా సినిమా మాస్ సెంటర్ల‌లో చాలా బాగా ఆడుతోంది. ఈ సినిమాను నేను ద‌ర్శ‌క‌త్వం చేయ‌డానికి కార‌కులైన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు. థియేట‌ర్ల‌లో జ‌నాలు న‌వ్వుతుంటే చాలా ఆనందంగా ఉంది. మామూలుగా మనం ఫైవ్ స్టార్ హోట‌ల్లో తింటుంటాం. అప్పుడ‌ప్పుడూ రోడ్డు ప‌క్క‌న బండి మీద భోజ‌నం కూడా బావుంటుంది. మా సినిమా అంతే బావుంటుంది. ఒక‌సారి చూడ‌మ‌ని కోరుకుంటున్నా“ అని చెప్పారు.

స‌ప్త‌గిరి మాట్లాడుతూ “మ‌న బ‌డ్జెట్‌కి, మ‌న టార్గెట్‌ను రీచ్ అయ్యామ‌ని బ్ర‌హ్మ‌య్య‌గారు చెప్పారు. ప‌రిశ్ర‌మ‌లో నిర్మాత‌ల‌ది దైవ‌స్థానం. జి.ఎన్‌.రెడ్డి, న‌రేంద్ర‌గారికి ధ‌న్య‌వాదాలు. న‌టీన‌టులు, ట‌క్నీషియ‌న్లు అంద‌రికీ ధన్య‌వాదాలు. సినిమా తొలిరోజు మిక్స్డ్ టాక్ వ‌చ్చింది. తర్వాత వెంట‌నే యావ‌రేజ్ అన్నారు. చిన్న‌వాళ్లం. అంద‌రూ ఆశీర్వ‌దించండి. మ‌రిన్ని సినిమాలు చేసేలా ఎంక‌రేజ్ చేయండి. స్కూల్స్, కాలేజీ ఓపెనింగ్ స‌మ‌యంలోనూ మా సినిమాను ఆద‌రిస్తున్నందుకు ధ‌న్య‌వాదాలు. సెకండాఫ్ ల్యాగ్‌ను 10 నిమిషాలు తీసేస్తున్నాం. ఇక 100 శాతం గ్రాండ్ స‌క్సెస్ అవుతుంది. అంద‌రూ మ‌మ్మ‌ల్ని సేవ్ చేసి కాపాడండి“అని అన్నారు.