శుక్ర మూవీ రివ్యూ

Published On: April 24, 2021   |   Posted By:

శుక్ర మూవీ రివ్యూ

కాన్సెప్టు మూవీ :‘శుక్ర’ రివ్యూ

రేటింగ్ : 2/ 5

ఇప్పుడున్న పరిస్దితుల్లో సినిమా థియోటర్ లో రిలీజ్ అంటే సాహసమే. ఎందుకంటే ఎంతమంది ధైర్యం చేసి సినిమాకు వెళ్తారో తెలియని సిట్యువేషన్. అయినా ముందుగా అనుకున్న ఎగ్రిమెంట్స్, లెక్కలతో సినిమాలని కొందరు రిలీజ్ చేసేస్తున్నారు. థియోటర్ లో రిలీజ్ అయితే ఓటీటి, శాటిలైట్ మార్కెట్ ఉంటుందనే ఆలోచన కూడా దీనికి ముడి పడి ఉంది. ఈ నేపధ్యంలో ఈ వారం జనాలు ముందుకు వచ్చిన సినిమా  ‘శుక్ర’. ఈ సినిమా ఎలా ఉంది..కథేంటి… ‘శుక్ర’ టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి వంటి వివరాలు రివ్యూలో చూద్దాం.  

స్టోరీ లైన్

విలియమ్ రిచర్డ్సన్ అలియాస్ విల్లీ (అరవింద్ కృష్ణ) బిజినెస్ లో బాగా నష్టపోతాడు. దాంతో భార్య రియా (శ్రీజితా ఘోష్) తో చిన్న చిన్న విభేదాలు వస్తూంటాయి. అప్పటికి ఆమెతో కాంప్రమైజ్ అవుతూ మెప్పించటానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో భార్య బర్తడే ఫంక్షన్ ఏర్పాటు చేస్తాడు. తన క్లోజ్ సర్కిల్ లోని కొంతమందిని మాత్రమే ఈ పార్టికి పిలుస్తాడు. అయితే ఆ పార్టికు వచ్చిన తొమ్మిది మందిలో ముగ్గురు తెల్లారేసరికి హత్య చేయబడి ఉంటారు. ఆ ముగ్గురులో ఒకరు అతని భార్య రియా. దాంతో విల్లీ తల్లడిల్లిపోతాడు. అక్కడ నుంచి ఇన్విస్టిగేట్ చేస్తాడు. ఎవరు ఆ రాత్రి వారిని హత్య చేసారు. బయిట తిరుగుతున్న థగ్స్ అనే మాఫియా ముఠాకు ఈ హత్యలతో సంభధం ఉందా.. ఆ రాత్రి ఏం జరిగింది…వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 
ఎనాలసిస్ …

ఇలాంటి కథలు హాలీవుడ్ లో వస్తూంటాయి. ఓ భవంతి. పార్టీ జరుగుతూంటుంది. కొన్ని హత్యలు జరుగుతాయి. ఎవరు చేసారు అనే పాయింట్ చుట్టూ ఈ కథలు అల్లుతారు. వీటికి స్క్రీన్ ప్లే ప్రధానం. ఒక్కో లేయిర్ లో ఉన్న ముడిని ఇన్విస్టిగేట్ మోడ్ లో విడతీస్తూ ముందుకు వెళ్తారు. ఈ క్రమంలో కొంత సస్పెన్స్, థ్రిల్లింగ్ ఉంటుంది. గంటన్నరపాటు పాటులు, ఫైట్స్ లేకుండా వేరే ఎలిమెంట్స్ కలపకుండా కంటిన్యూగా ఈ సినిమా ఉంటే..అదీ ఇంట్రస్టింగ్ గా చూడగలుగుతాము. అయితే ఇందులో అదే మిస్సైంది. కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కానీ అవి అనుకున్న స్దాయిలో పండలేదు. హీరో,హీరోయిన్ క్యారక్టర్స్ కు ట్విస్ట్ లు ఉండటంతో వాటి ఎమోషన్స్ ఫేక్ గా ఉంటాయి.

అదే హాలీవుడ్ చిత్రాల్లో ఇలాంటి సినిమాల్లో హీరో,హీరోయిన్స్ అంటూ ఎవరూ ఉండరు. అందరూ సస్పెక్టే. కాబట్టి కథను ఎంజాయ్ చేస్తా. ఆ మోడల్ ఇక్కడ మనకి పనికిరాదనిపిస్తుంది. డైరక్టర్ పాయింటాఫ్ వ్యూలోనే కథ,కథనం నడిపితే ఒడ్డున పడచ్చు. కానీ హీరో,హీరోయిన్ అనుకున్నప్పుడు వాళ్ల వైపునుంచి కథనం నడపటం కష్టం. సినిమా ప్రారంభంలో ఇదొక బ్రిలియంట్ థ్రిల్లర్ మూవీ అనిపిస్తుంది. కానీ రాను రాను ఆ నమ్మకం సడిలిపోతుంది. అయితే సిటీల్లో  పెరుగుత‌ున్న డ్రగ్ క‌ల్చర్ ని పార్టీ క‌ల్చర్ ని బాగా ప్రజెంట్ చేసాడు ద‌ర్శకుడు. యూత్ కి క‌నెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ మిస్ అవ‌కుండా ఉండేలా చూసుకున్నాడు. నేర ప్రవృత్తికి బీజం ప‌డే పార్టీ క‌ల్చర్ ని తెర‌మీద బాగా ఎస్టాబ్లిష్ చేసాడని చెప్పాలి. అయితే విల్లి, రియా మధ్య సాగే రొమాంటిక్ సీన్స్ పెట్టిన శ్రద్ద థ్రిల్లింగ్ సీన్స్ పై పెట్టలేకపోయాడు. అలాగే ఇంటర్వెల్‌కు వచ్చే ట్విస్ట్ బాగుంది. కానీ  సెకండాఫ్ ఆ స్దాయి ఇంట్రెస్ట్ సస్టైన్ చేయలేకపోయింది. క్లైమాక్స్ సైతం పార్ట్ 2లో మీ ప్రశ్నలకు ఆన్సర్స్ చూసుకోండి అని అర్దాంతరంగా ముగించేసాడు.

టెక్నికల్ గా ….

రెండు పార్ట్ లుగా కథ రాసుకోవటం వల్ల …ఈ పార్ట్ చాలా నెమ్మిదిగా సీన్స్ సాగుతున్నట్లు గా నడిపారు. అలాగే వజ్రాల స్మగ్లింగ్ ఈ హత్యలకు కారణం అని తెలిసినప్పడు కథ మీద అంచనాలు పెరిగినా దాన్ని సరిగ్గా వాడుకోలేకపోయాడు. అయితే డైరక్టర్ కు స్క్రిప్టు ,స్క్రీన్ ప్లై పట్టులేకపోయినా, విజువల్ సెన్స్… సినిమా లాంగ్వేజ్ పై మంచి గ్రిప్ ఉందని అర్దమవుతుంది. మొదటి ఫ్రేమ్ నుంచి మేకింగ్‌లో తన ప్రత్యేకత చూపించారు. డైరక్టర్ సినిమాటోగ్రాఫర్ జగదీశ్ బొమ్మిశెట్టి   కెమెరా వర్క్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. లైటింగ్ తో మంచి మూడ్ క్రియేట్ చేసారు. ఎడిటింగ్ కూడా కొంత లాగినట్లు అనిపించినా,కొన్ని చోట్ల తన పనితనం చూపించాడు. నేపధ్య సంగీతం కూడా ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల్లో ..విల్లీ క్యారెక్టర్ లో అర‌వింద కృష్ణ చాలా బాగా చేసాడు.క్యారెక్టర్ లొని గ్రే షేడ్ ను బాగా ప్రొజెక్టు చేసాడు.
 
చూడచ్చా

థ్రిల్లింగ్ సినిమాలు చూసేవారు ఓ లుక్కేయచ్చు.

తెర వెనుక..ముందు

నటీనటులు – అరవింద్ కృష్ణ, శ్రీజిత గోష్, విశాల్ రాజ్, సంజీవ్, ఈషా శెట్టి, జస్ ప్రీత్, పూజ, చాందినీ, కమలాకర్, రుద్ర తదితరులు
కాస్ట్యూమ్ డిజైనర్ – రియా పూర్వజ్
సంగీతం: ఆశీర్వాద్
సినిమాటోగ్రాఫర్: జగదీష్ బొమ్మిశెట్టి
 కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: సుకు పూర్వజ్
నిర్మాత: నల్ల అయ్యన్న నాయుడు
రన్ టైమ్:  2 గంటల 12 నిముపాలు
 రిలీజ్ డేట్: 2021-04-23