షార్ట్ ట్విస్ట్ షార్ట్ ఫిలిం రివ్యూ

Published On: March 10, 2021   |   Posted By:
షార్ట్ ట్విస్ట్’ షార్ట్ ఫిలిం రివ్యూ
 
మన ఆలోచనలను బట్టే మన ప్రాజెక్టు ఫైనల్ అవుట్ పుట్ ఉంటుంది. అది సినిమా కావచ్చు..షార్ట్ ఫిలిం కావచ్చు. షార్ట్ ఫిలిం ఎలా ఉండాలి…చిన్న సైజ్ సినిమాలా అనిపించాలా..అనుకుంటే అది అలాగే తయారవుతుంది. లేదూ షార్ట్ ఫిలిం అంటే సరదాగా కాసేపు అలా ఎంటర్టైన్ చేస్తే చాలు అనుకుంటే అదే వస్తుంది. అంటే కాన్సెప్టు దగ్గర నుంచి ఎడిటింగ్ దాకా మనం ఏ యాంగిల్ లో దాన్ని చూస్తామో అదే ఆవిష్కారమవుతుంది. అవ్వాలి కూడా. ఇదిగో ఈ షార్ట్ ట్విస్ట్ అనే షార్ట్ ఫిలిం కూడా అంత తక్కువ సమయంలోనే అతి ఎక్కువ చెప్పాలి..అనే ఆలోచనతో తయారైనట్లు అనిపిస్తుంది.

ముందు స్క్రిప్టు గురించి మాట్లాడుకుందాం… చిన్న ట్విస్ట్ తో క్యారక్టర్ డ్రైవన్ ప్లాట్ తో నడిచే ఈ కథలో..కిడ్నాపర్ పాత్రకు అంత ప్లాష్ బ్యాక్ డైలాగులు అనవసరం అనిపిస్తుంది. కిడ్నాప్ చేసే క్యారక్టర్ ..నేను ఫలానా దాని కోసమే చేసాను అనే వివరణ ఇచ్చుకోవటం ఏమిటి…అంటే కిడ్నాప్ చేసిన వాడిలో ఆ గిల్టీ ఫీలింగ్ ఉండి..అది మాటల్లో బయిటపడిందా…రైటే అది విని అవతలి కన్వీన్స్ అయ్యి…లక్షలు రూపాయలు వదిలేసుకోవాలనుకోవటం ఏమిటి…ఇద్దరూ మంచివాళ్లే. అంటే కిడ్నాప్ కు గురైన వ్యక్తి ఇంత మంచి వాడని తెలిసి..కష్టాలు చెప్పుకుని కన్వీన్స్ చేసుకుంటే పోయాది కదా…అబ్బే …అంతా అయ్యిపోయాక..వేరే దారిలేక తన లోని మంచితనం అన్నా ఎక్సపోజ్ చేద్దామని అనుకుని ఉండచ్చు కానీ నిజంగా ఎవరైనా కష్టాలు చెప్పుకుంటే డబ్బులు ఇస్తారా..అలాగే ఇతను ఇంత కరిగిపోతాడని అతను ముందే ఊహించి,పోలీస్ ల నుంచి,మరొకరి నుంచి ఆ తర్వాత కేసులు, సమస్యలు లేకుండా ఉండటం కోసం ఆ డైలాగులు కల్పించి చెప్పాడా…కిడ్నాపర్ అంత తెలివైనవాడా..నిజంగా అతను ఆడింది గేమా…?

అలాగే షార్ట్ ఫిలిం చూసి కిడ్నాప్ చేసానన్నాడు. అంటే అతనికి ముందే ఇతనే షార్ట్ ఫిలిం చేసాడని తెలిసి…కావాలనే ఎంచుకున్నాడా…ఆ షార్ట్ ఫిలిం మూలంగా  కిడ్నాపర్ గతంలో ఏదన్నా దెబ్బ తిని, వీడికి బుద్ది చెప్పాలని, తను కోల్పోయిన డబ్బుని తిరిగి రికవరీ కోసం ఈ వ్యక్తినే ఎంచుకున్నాడా…ఏమో … ఏదైనా జరగచ్చు… ఇవన్ని ఈ షార్ట్ ఫిలిం చూసాక వచ్చే ఆలోచనలు. ఇన్ని ఆలోచనలు రేపాడంటే డైరక్టర్ గొప్పతనమే.

ఇక డైరక్షన్ విషయానికి వస్తే..ఏదైతే క్లైమాక్స్ లో ట్విస్ట్ పండాలో అది పేలలేదు. హడావిడిగా ముగిసినట్లైంది. అలాగే కిడ్నాపైన వ్యక్తి పేరు జనాలు గుర్తు పెట్టుకుని..అతనే షార్ట్ ఫిలిం చేసాడని అనుకోవాలని అతని పేరు స్క్రీన్ పైన చూపెట్టడం…కొంచెం అత్యాసతో చేసిన పనే. మహేష్ బాబు సినిమా చూస్తేనే ..సినిమా అయ్యాక..అతను పేరు చెప్పమంటే తడుముకుంటాం. అలాంటిది షార్ట్ ఫిలింలో ఓ మనిషి పేరు గుర్తు పెట్టుకుని, ఆ ట్విస్ట్ ఎంజాయ్ చేయటం కష్టమే. అలాగే జోష్ రవి..కిడ్నాపర్ గా ఫెరఫెక్ట్ గా సినిమాటెక్ గా చేసుకుంటూ వెళ్లిపోయాడు. అయితే అదే సమయంలో అతనికి పోటీ కాకపోయినా సమానంగా చెయ్యాల్సిన అవతలి  పాత్ర కుర్రాడు పూర్తిగా తేలిపోయాడు. దాంతో ఇది వన్ వే గా మారిపోయింది. ఆ కుర్రాడు డబ్బున్న కుర్రాడు..కిడ్నాప్ చేస్తే లక్షలు ఇవ్వగల సమర్దుడు అనిపించుకునేలా లేడు. అసలు అతనే ఎవరి కారైనా ఎత్తుకొస్తున్నాడా, వాడే చివరకు తన కారు ఎక్కిన వాడిని దోచుకుందామని ప్లాన్ చేసి లిప్ట్ ఇచ్చే క్యారక్టర్ లా అనిపించింది…మళ్లీ కొత్త కథ తయారువుతుందేమో  ఇక్కడితో వదిలేయండి…అంటే కాస్టింగ్ కరెక్ట్ గా కుదరలేదు.

అలాగే ప్రక్కన కూర్చున్నది కిడ్నాపర్ ..తుపాకి గురి  పెట్టాడు అని తెలియగానే అతనిలో టెన్షన్ ఎస్టాబ్లిష్ కాలేదు. ఏ సడెన్ బ్రేకో వేస్తారు. అలాంటి భయంకరమైన సిట్యువేషన్ లో …చెమట కారుతూంటుంది..అంత ఏసి లో కూడా. కానీ ఆ కుర్రాడు మాత్రం ఇలాంటి కిడ్నాప్ లు రోజుకొకటి చూస్తానులే..కానీయ్ అన్నట్లుగా కార్ లాంగ్ డ్రైవ్ కు వెళ్తున్నట్లు కూల్ గా వెళ్లిపోయాడు. అలా కూల్ గా ఉన్న వ్యక్తి ని చూస్తే …కిడ్నాపర్ కు కూడా కంగారు వస్తుంది. కొంపతీసి వాడేమన్నా మర్డర్ చేసి పారిపోయి వస్తున్నాడా..వాడ్ని నేను కిడ్నాప్ అంటూ కదిపానా అని…

ఫైనల్ గా ..టెక్నికల్ గా చూస్తే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. కెమెరా ఏంగిల్స్ కూడా కొన్ని చాలా బాగున్నాయి.అయితే సమయం తక్కువ ఉండటం వల్లనేమో…ఎక్కువ షాట్స్ తీసుకోలేదు. ఎనీహౌ  డైరక్షన్ నీటుగా ఉంది. గ్రేట్ గా కూడా ఉండేలి నెక్ట్స్ టైమ్ ట్రై చేయాలి.

టీమ్

నటీనటులు: జోష్ రవి, అనుదీప్, భీమరాజు
సంగీతం : వినోద్ కుమార్
ఛాయాగ్రహణం: శ్రీనివాస్ చౌదరి
ఎడిటర్ : కపిల్ బల్లా
డైరక్షన్ టీమ్ : శ్రీను యాదవ్, అహం గస్తి  
రచన : సూర్య ప్రకాష్ జోశ్యుల
రన్ టైమ్ : 14 నిముషాలు
నిర్మాత : ప్రశాంత్ యర్రమిల్లి
దర్శకత్వం : కనక వెంకటేష్ . బి
విడుదుల తేదీ: పిబ్రవరి 26, 2021