Reading Time: 2 mins

స‌దా న‌న్ను న‌డిపే చిత్రం టీజ‌ర్ విడుద‌ల

లంకా ప్ర‌తీక్ ప్రేమ్ కుమార్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం `స‌దా న‌న్ను న‌డిపే`. వైష్ణ‌వి ప‌ట్వ‌ర్ద‌న్ నాయిక‌గా న‌టించింది. లంకా క‌రుణాక‌ర్ దాస్ నిర్మాత‌. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. మంగ‌ళ‌వారం శివారాత్రినాడు ప్ర‌సాద్‌ల్యాబ్‌లో టీజ‌ర్ వేడుక నిర్వ‌హించారు.  టీజ‌ర్‌ను  ముఖ్య అతిథి తెలంగాణ హోం మంత్రి మ‌హ్మ‌ద్ అలీ ఆవిష్క‌రించారు.

అనంత‌రం మంత్రి మ‌హ్మ‌ద్ అలీ మాట్లాడుతూ, టీజ‌ర్ వేడుక‌లో పాల్గొన‌డం ఆనందంగా వుంది. హీరో ప్ర‌తీక్ అన్ని శాఖ‌ల‌పై ప‌ట్టుతో ముంద‌డుగు వేసినందుకు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నాను. హైద‌రాబాద్‌లో సినిప‌రిశ్ర‌మ డెవ‌ల‌ప్‌మెంట్‌కు వాతావ‌ర‌ణం అనుకూల‌మైంది. ఫిలింసిటీ కూడా వుంది. రాబోయే ఐదేళ్ళ‌లో ముంబై త‌ర‌హా సినీ ప‌రిశ్ర‌మను హైద‌రాబాద్‌లో చూడొచ్చు. క‌రోనా వ‌ల్ల సినీ ప‌రిశ్ర‌మ చాలా న‌ష్ట‌పోయింది. సి.ఎం. గారు కేబినెట్ మీటింగ్‌లో సినిమా ప‌రిశ్ర‌మ‌పై చ‌ర్చ‌కూడా చేశారు. సినీ ప‌రిశ్ర‌మ‌కు ఏదైనా చేయాల‌నే త‌ప‌న ఆయ‌న‌లో వుంది. ఇక ఈ సినిమా చ‌క్క‌టి ప్రేమ‌క‌థ‌తో వుంది. ప్రేమ‌క‌థ‌లు ఎల్ల‌వేల‌లా విజ‌యాన్ని సాధిస్తాయ‌ని పేర్కొన్నారు.

హీరో ప్ర‌తీక్ మాట్లాడుతూ, మా టీజ‌ర్ కార్య‌క్ర‌మానికి మ‌హ్మ‌ద్ అలీ గారు వ‌స్తున్నార‌ని తెలియ‌గానే `త‌గ్గేదేలే`అన్నంత ధైర్యం మాకు క‌లిగింది. డిజిట‌ల్ టీజ‌ర్‌ను త‌ల‌సాని గారు ఆవిష్క‌రించారు. నేను గ‌తంలో `వాన‌విల్లు` అనే సినిమా చేశాను. ఇది నా రెండో సినిమా. క్యూట్ ల‌వ్ స్టోరీ ఇది. గీతాంజ‌లి, ప్రేమించుకుందాంరా  త‌ర‌హాలో చ‌క్క‌టి ల‌వ్ స్టోరీగా రూపొందింది. ఫైట్స్‌, కామెడీ, రొమాన్స్ కూడా ఇందులో వుంటాయి. మ‌రోవైపు అగ్ర‌హీరోల సినిమా టీజ‌ర్‌లు విడుద‌ల నాడే నాది కావ‌డం ఆనందంగా వుంది. బ‌య‌ట ఈ సినిమా పోస్ట‌ర్ చూసి అర్జున్ రెడ్డి త‌ర‌హాలో వుంద‌నే కొంద‌ర‌న్నారు. మా సినిమా ల‌వ్ స్టోరీ క‌నుక కొద్దిగా రొమాన్స్ వుంటుంది. కానీ వల్గారిటీ వుండ‌దు. మా మూవీలో ట్విస్ట్‌లు, స‌స్పెన్స్/లు వుండ‌వు. చ‌క్క‌టి ప్రేమ‌క‌థ‌గా తీర్చిదిద్దామ‌ని అన్నారు.

క‌థానాయిక వైష్ణ‌వి మాట్లాడుతూ, మంచి టీమ్‌తో ప‌నిచేసే అవ‌కాశం వ‌చ్చింది. నిర్మాత సెట్లో కి వ‌స్తే చాలా స‌ర‌దాగా వుంటారు. యూనిట్‌కు ఎన‌ర్జీ ఇస్తారు. హీరో ప్ర‌తీక్ యాక్ష‌న్ సీన్స్ సెంటిమెంట్ సీన్స్ బాగా చేశాడు. ఒక్క రొమాన్స్ విష‌యంలో మొహ‌మాట ప‌డ్డాడు. నేనే లీడ్ తీసుకుని ఎంక‌రేజ్ చేశానంటూ . చ‌లోక్తి విసిరింది.

నిర్మాత లంకా క‌రుణాక‌ర్ దాస్ మాట్లాడుతూ, క‌రోనా వ‌ల్ల అనేక విధాలుగా ఇబ్బంది ప‌డ్డాం. కానీ సినిమా పూర్తి చేయ‌డానికి యూనిట్ చాలా స‌హ‌క‌రించింది. నా కుమారుడు ప్ర‌తీక్‌లో ప‌ట్టుద‌ల బాగుంది. అందుకే హీరోతోపాటు ప‌లు బాధ్య‌త‌లు కూడా స్వీక‌రించాడు. ఈ కార్య‌క్ర‌మానికి విచ్చేసిన హోం మంత్రిగారికి, శివ కుమార్‌గారికి, గోపాల్ కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నానని అన్నారు.

న‌టుడు న‌వీన్ మాట్లాడుతూ, హీరోను స‌ర‌దాగా ఏడిపించే పాత్ర‌ను చేశాను. నిర్మాత యూత్‌ఫుల్ సినిమా తీశారు. హీరోయిన్ వైష్ణ‌వి ఆహా అనిపించేలా పెర్ పార్మెన్స్ చేసింది. ఈరోజు విడుద‌లైన టీజ‌ర్ చాలా బాగుంది. సినిమా మ‌రింత‌గా బాగుంటుంది. పూర్తి వినోదాత్మ‌కంగా సాగుతుంది. అని తెలిపారు.
ఇంకా ఈ వేడుక‌లో పాల్గొన్న వారంతా చిత్రం విజ‌య‌వంతం కావాల‌ని ఆకాంక్షించారు.

న‌టీన‌టులుః

ప్ర‌తీక్ ప్రేమ్ కుమార్, వైష్ణ‌వి ప‌ట్వ‌ర్ద‌న్,  నాగేంద్ర‌బాబు, రాజీవ్ క‌న‌కాల‌, సూర్య‌, న‌వీన్ నేని, రంగ‌స్థ‌లం మ‌హేష్‌, సుద‌ర్శ‌న్‌, ఆల‌మ‌ట్టి నాని త‌దిత‌రులు న‌టించారు.

సాంకేతికతః
కెమెరాః ఎస్‌.డి. జాన్‌, సంగీతంః ప్ర‌భు, సుభాక‌ర్‌, ఫైట్స్‌- నందు, ఆర్ట్‌- గోవిందు, డైలాగ్స్‌- రూప్ కుమార్‌, ఎడిటింగ్‌- ఎస్‌. ఆర్. శేఖ‌ర్‌. నిర్మాత‌- లంకా క‌రుణాక‌ర్ దాస్, పి.ఆర్‌.ఓ.- వంశీ-శేఖ‌ర్‌. క‌థ‌, స్క్రీన్ ప్లే, బేక్‌గ్రౌండ్ స్కోర్‌, ద‌ర్శ‌క‌త్వంః లంకా ప్ర‌తీక్ ప్రేమ్ కుమార్