సమ్మతమే మూవీ రివ్యూ 

Published On: June 24, 2022   |   Posted By:

సమ్మతమే మూవీ రివ్యూ

sammathame: కిరణ్ అబ్బవరం ‘సమ్మతమే’ రివ్యూ!

Emotional Engagement Emoji

👍

కిరణ్‌ అబ్బవరం తెలుగు పరిశ్రమలో స్ధిరపడేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఒక్కోటి ఫలిస్తే మరిన్ని వికటిస్తున్నాయి. అయితే అతనితో ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న పెద్ద నిర్మాణ సంస్దలు సినిమాలు చేసేందుకు ఎగ్రిమెంట్ చేసే స్దాయికి ఆ సినిమాలే తీసుకెళ్లాయి. ఈ క్రమంలో తాజాగా కిరణ్ తాజా చిత్రం ‘సమ్మతమే’ రిలీజైంది. తన స్నేహితుడు గోపీనాథ్ రెడ్డిని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ అతని తల్లి కంకణాల ప్రవీణ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఏ మేరకు జనాలను ఆకట్టుకుంది. వర్కవుట్ అయ్యే కాన్సెప్టేనా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
కథ
చిన్నప్పుడే తల్లిని కోల్పోవటంతో కృష్ణ (కిరణ్‌ అబ్బవరం) కుటుంబం ఆడదిక్కు లేనిదవుతుంది. దాంతో త్వరగా పెళ్ళి చేసుకుని జీవితంలో సెటిల్ అయిపోవాలని కృష్ణ కలలు కంటూంటాడు. పెద్దలు కుదిర్చిన సంభందమే చేసుకోవాలనే కృష్ణకు పెళ్లికు ముందు ప్రేమ వంటివి నచ్చవు. తనకు రాబోయే భార్య ఇలా ఉండాలి అని కొన్ని ఊహలు, కచ్చితమైన అభిప్రాయాలు ఏర్పాటు చేసుకుంటాడు. ఈ క్రమంలో తను పెళ్లిచూపుల్లో శాన్వి (చాందిని చౌదరి)ని చూసి ఇష్టపడ్డా, ఆమెకు పెళ్లికు ముందు ఓ ప్రేమ వ్యవహారం ఉందని తెలుసుకుని రిజెక్ట్ చేస్తాడు. ఆ తర్వాత మరో ఇరవై పెళ్లిచూపులకు వెళ్లినా తనకు నచ్చే క్వాలిటీస్‌ ఉన్న అమ్మాయి దొరకదు. ఈ క్రమంలో అతనికో విషయం అర్దమవుతుంది. అసలు తాను అందరినీ రిజెక్టు చేయటానికి కారణం ..శాన్వితో తను ప్రేమలో పడ్డానని అని అర్థం చేసుకుంటాడు. ఆమెకి దగ్గరవుతాడు. కానీ అక్కడే ట్విస్ట్ పడుతుంది. సిటీ కల్చర్‌‌లో పెరిగిన శాన్వి పద్ధతులు, ఇష్టాలు అతనికి నచ్చవు. ఆమెని మోడ్రన్ కల్చర్ కు దూరంగా, తన ఇష్టాలకి దగ్గరగా మార్చుకోవటం కోసం ప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రమంలో ఏం జరిగింది. అతని ప్రయత్నాలు ఫలించాయా…లేక ఆమెను ఆమెగానే ఏక్సెప్టు చేసాడా..చివరకు ఏమైంది అనేది మిగతా కథ.
విశ్లేషణ
‘ప్రేమ అంటే ఒకరి ఇష్టాయిష్టాల్ని మరొకరు గౌరవించడమే తప్ప మన ఇష్టాల కోసం మరొకరి ఇష్టాలను చంపేయడం కాదు’ అనే పాయింట్ ని తీసుకుని అల్లిన కథ,కథనం ఇది. అయితే చాలా థిన్ లైన్ కావటంతో ఇద్దరి మధ్యా సీన్స్ కొంత సేపు అయ్యేసరికి రిపీట్ అవుతున్న ఫీల్ వచ్చి బోర్ కొట్టాయి. వాస్తవానికి రొమాంటిక్ కామెడీగా చేద్దామనుకున్న ఈ సినిమా ఆ స్దాయిలో సీన్స్ లేకపోవటం,ఓ షార్ట్ ఫిల్మ్ చూస్తున్న ఫీల్ కలిగించింది. అక్కడికి ఫస్ట్ హాఫ్‌ అంతా హీరో హీరోయిన్ల పరిచయం, వారిమధ్య ప్రేమ మొదలవడం లాంటి సీన్స్ తో సరదాగా గడిచినట్లు అనిపించిననా,సెకండాఫ్ కు వచ్చే సరికి ఆ స్పీడు మిస్సైంది. చిన్న పాయింట్ ని పూర్తి స్దాయిలో సాగతీసే ప్రయత్నం చేశాడు దర్శకుడు గోపీనాథ్ రెడ్డి. సినిమా క్లయిమాక్స్ కు వచ్చేదాకా ఏమీ జరిగినట్లు అనిపించదు. దానికి తోడు సినిమా తర్వాత ఏం జరుగుతుందో ఊహించేగల ప్రెడిక్టబులటీ ఈ కథకు సమస్యగా మారుతుంది. కేవలం రెండు క్యారక్టర్స్ అనుకున్నారు..వారి మధ్య సంఘటనలు క్రియేట్ చేయలేకపోయారు. వారిని ఎంచుకున్న పాయింట్ మంచిదే. ‘ఎదుటి వారి పట్ల మనం చూపించే ప్రేమ అన్ కండీషనల్ గా ఉండాలి. అందులో ఇఫ్స్ అండ్ బట్స్ కు చోటివ్వకూడదు’ అని ఈ మూవీ ద్వారా చెప్పాలని అనుకున్నారు. కానీ పూర్తిగా అది స్క్రిప్టు గా రూపుదిద్దుకోలేదు.
టెక్నికల్ గా చూస్తే…
నటీనటుల విషయానికి వస్తే…. కిరణ్‌ అబ్బవరం మిడిల్ క్లాస్ అబ్బాయి క్యారక్టర్ లో ఇమిడిపోయాడు. సరదా సరదాగా అతని పాత్రను డిజైన్ చేసిన మేరకు బాగా పండించాడు.ఈ జనరేషన్ అమ్మాయిగా చాందిని చౌదరి బాగా నటించింది. కానీ ఆమె గ్లామర్ పాత్రకు సరిపోలేదు. కాస్త రాశీఖన్నాలాంటి అమ్మాయి అయితే సెట్ అయ్యిదేనిపించింది. ఇతర ప్రధాన పాత్రల్లో గోపరాజు రమణ, శివన్నారాయణ, సప్తగిరి, చమ్మక్ చంద్ర, సితార, అన్నపూర్ణ తదితరులు ఓకే అనిపించారు.
ఈ మూవీతో సినిమాటోగ్రాఫర్ గా పరిచయం అయిన సతీశ్ రెడ్డి మాసం విజువల్స్ బాగానే ఉన్నాయి. శేఖర్ చంద్ర రెండు పాటలు మినహా మ్యాజిక్ చెయ్యలేకపోయాడు. ఎడిటింగ్ బాగుంది…ఫన్ ని బాగానే డీల్ చేసారు కానీ ఎమోషన్స్ సీన్స్ లో డైరక్టర్ తేలిపోయారు. దానికి తగినట్లు స్క్రిప్టు కలిసిరాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.
బాగున్నవి
స్టోరీ లైన్
లెంగ్త్ తక్కువ కావటం
బాగోలేనివి
పండని ఎమోషనల్ సీన్స్
రిపీట్ గా అనిపించే స్క్రీన్ ప్లే ,సీన్స్
పాటలు
చూడచ్చా
ఓటిటికు సరిపడ్డ కంటెంట్ ఇది. అక్కడే చూస్తే బెస్ట్ అనిపిస్తుంది. థియోటర్ సినిమాగా సమ్మతించలేం.
నటీనటులు : కిరణ్‌ అబ్బవరం, చాందిని చౌదరి, గోపరాజు రమణ తదితరులు
నిర్మాణ సంస్థ : యూజీ ప్రొడక్షన్స్
నిర్మాతలు: కంకణాల ప్రవీణ
దర్శకత్వం : గోపినాథ్ రెడ్డి
సంగీతం :శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ :సతీష్ రెడ్డి మాసం
ఎడిటర్‌ : విప్లవ్ నైషధం
Run Time: 2hr 10 Min
విడుదల తేది :జూన్‌ 24,2022