Reading Time: < 1 min

సరిపోదా శనివారం చిత్రం షూటింగ్ మార్చి 18 నుంచి ప్రారంభం

నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ, డివివి ఎంటర్‌టైన్‌మెంట్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’ నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ మార్చి 18 నుంచి ప్రారంభం

నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ సెకండ్ కొలాబరేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ‘అంటే సుందరానికీ’ చిత్రంలో నాని సాఫ్ట్  పాత్రలో కనిపించగా, ఈ చిత్రంలో మునుపెన్నడూ లేని యాక్షన్-ప్యాక్డ్ క్యారెక్టర్‌లో ఆశ్చర్యపరచబోతున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్‌తో భారీ కాన్వాస్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ మార్చి 18 నుంచి ప్రారంభం కానుంది. హీరో నానితో పాటు ఇతరతారాగణం పాల్గొనే ఈ షెడ్యూల్ లో పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీన్స్ పాటు కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు. ఈ యాక్షన్ సీన్స్ సినిమాలో హైలెట్ గా వుండబోతున్నాయి.

ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయిక. SJ సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మురళి జి డీవోపీగా పని చేస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్.

ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్ట్ 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ విడుదల కానుంది.

నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, SJ సూర్య

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ
నిర్మాతలు: డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి
బ్యానర్: డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్
సంగీతం: జేక్స్ బిజోయ్
డీవోపీ: మురళి జి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
పీఆర్వో: వంశీ-శేఖర్