Reading Time: < 1 min

సర్కిల్ మూవీ మొదటి సింగిల్ విడుదల

దర్శకుడు నీలకంఠ సర్కిల్ నుండి మొదటి సింగిల్ విడుదల

ఆకట్టుకుంటున్న సర్కిల్ ఆఫ్ లైఫ్

దర్శకుడు నీలకంఠ చాలా సంవత్సరాల తరువాత సర్కిల్ సినిమాతో మన ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. తన దర్శకత్వ నైపుణ్యానికి మంజుల నటించిన షో సినిమా ద్వారా జాతీయ అవార్డు కూడా అందుకున్న నీలకంఠ ఇప్పుడు సర్కిల్‌తో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.

దర్శకుడు తన మొదటి చిత్రం షో ద్వారానే రెండు జాతీయ అవార్డులను గెలుచు కోవడమే కాకుండా విరోధి సినిమా ఇండియన్ పనోరమాలో కూడా ఎంపికయ్యింది. ఆ తర్వాత మిస్సమ్మ, సదా మీ సేవలో వంటి సినిమాలకు దర్శకత్వం వహించి మంచి పేరు తెచ్చుకున్నారు.‌ ఇక ఇప్పుడు సర్కిల్ అనే సినిమాతో తన కం బ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.

ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. థ్రిల్లర్‌ జానకి లో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకోనుంది

ఈ చిత్రం నుంచి మొదటి సింగిల్ సర్కిల్ ఆఫ్ లైఫ్, అనే టైటిల్ సాంగ్‌ను విడుదల చేసారు. జీవితం మరియు దాని అనిశ్చితి గురించి మాట్లాడే పెప్పీ ఫాస్ట్ బీట్ నంబర్ గా వచ్చిన ఈ పాట అందరిని అలరిస్తోంది. ఇక ఈ సింగల్ వీడియో సినిమాలోని విభిన్న సన్నివేశాల విజువల్స్‌ని చూపించి, సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది.

ఆరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సర్కిల్ చిత్రంలో

నటీనటులు:

సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్‌ మెహతా,రిచా పనై, నైనా , పార్థవ సత్య తదితరులు ..

సాంకేతిక నిపుణులు:

సినిమాటోగ్రపీ : రంగనాథ్ గోగినేని
ఎడిటర్ : మధు రెడ్డి
సంగీతం : ఎన్.ఎస్ ప్రశు
నిర్మాతలు : ఎమ్.వి శరత్ చంద్ర, టి సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ
రచన, దర్శకత్వం : నీలకంఠ