సామాట్ర్ పృథ్వీరాజ్ మూవీ రివ్యూ

Published On: June 6, 2022   |   Posted By:

సామాట్ర్ పృథ్వీరాజ్ మూవీ రివ్యూ

అక్షయ్ ‘సామాట్ర్ పృథ్వీరాజ్’ రివ్యూ

Emotional Engagement Emoji

👎

హిందీలో శరవేగంగా సినిమాలు చేసే స్టార్ అక్షయ్ కుమార్ (Akshay Kumar). ఒక్కో సినిమాను 30రోజుల నుంచి 40రోజుల్లోనే పూర్తి చేసి నెక్ట్స్ ప్రాజెక్టులోకి వెళ్లిపోతూంటాడు. అయితే ఒక్కోసారి ఆ స్పీడే క్వాలిటీ రాకుండా అడ్డుపడుతోందనే విమర్శలు ఉన్నాయి. ఇక ఆయన తాజాగా నటించిన చిత్రం ‘సామాట్ర్ పృథ్వీరాజ్’ (Samrat Prithviraj). 2017లో మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న మానుషి చిల్లర్ (Manushi Chhillar) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని చంద్ర ప్రకాష్ ద్వివేది (Chandraprakash Dwivedi) దర్శకత్వం వహించారు. ప్రతిష్టాత్మక బ్యానర్ యశ్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films) నిర్మించింది. ఈ నేపధ్యంలో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. వాటిని సినిమా ఏ మేరకు అందుకుంది. సినిమా విజయం సాధించిందా…అసలు కథేంటి వంటి విషయాలు చూద్దాం.

స్టోరీలైన్

12 వ శతాబ్దానికి చెందిన సామ్రాట్ పృథ్వీరాజ్ (అక్షయ్ కుమార్)కు ఒకటే ఆలోచన. అది ఢిల్లీ సామ్రాజ్యంపై అధిపత్యం. అందు కోసం ఆపు,అంతూలేని ఎదురులేని పోరాటాలు చేస్తూంటాడు. అదే సమయంలో మహ్మద్ ఘోరి (మానవ్ విజ్) కూడా అంతే పట్టుదలతో ఢిల్లీని హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. వీరిద్దరి మధ్యా హోరా,హోరీ పోరు జరుగుతూంటుంది. ఈ క్రమంలో జరిగిన యుద్దంలో ఘోరీని పృథ్వీరాజ్ ఓటమి పాలు చేస్తాడు. మరో ప్రక్క నమ్మకంగా ఉంటూనే తనకు పక్కలో బళ్లెంగా మారిన జైచంద్ (అశుతోష్ రాణా) కూడా ఢిల్లీని హస్తగతం చేసుకొనేందుకు ప్రయత్నిస్తుంటాడు. అతనితో తలపడాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే పృథ్వీరాజ్ సాహసాలు, వీరత్వం చరూసి సంయోగిత (మనూషి చిల్లర్) ఆయనను తప్ప మరొకరిని పెళ్లి చేసుకొనని శపధం చేసి,పట్టుదలగా కూర్చుంటుంది. ఈ క్రమంలో తన పక్కనే ఉంటూ కుట్రలు పన్నే జైచంద్‌కు పృథ్వీరాజ్ ఎలా ఎదుర్కొన్నాడు? సంయోగిత ప్రేమను పృథ్వీరాజ్ అంగీకరించారా? అనే ప్రశ్నలకు సమాధానమే సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమా కథ.

ఎలా ఉంది..

చాంద్ బర్దే రాసిన పృథ్వీరాజ్ రాసో అనే ప్రేమ కావ్యాన్ని బేస్ చేసుకుని దర్శకుడు చంద్రప్రకాష్ త్రివేది స్రిప్టు రాసుకున్నారు. కానీ అంతే ప్రతిభావంతంగా తెరకెక్కించలేకపోయారు. అలాగే పృద్వీరాజ్ పరాక్రమాలుని ఎక్కువగా చూపలేకపోయారు. హడావిడిగా సినిమాని చుట్టేసినట్లు ఉంది కానీ ఎక్కడా ఓ చారిత్రక సినిమాని తీస్తున్నట్లు అనిపించలేదు. కథలో కావాల్సిన ఎలిమెంట్స్ ఉన్నా వాటిని విస్తరణ లోపంతో మరుగునే ఉంచేసారు. అలాగే కథకు తగ్గ గ్రాఫిక్స్ కూడా లేవు. విఎఫ్ ఎక్స్ దారుణంగా ఫెయిలైంది. బాలీవుడ్ లో ఇంతకు మించిన హిస్టారిక్ వార్ డ్రామాలు చాలా చూసి ఉండటం వల్ల పృథ్విరాజ్ పెద్దగా కిక్క ఇవ్వలేదు. జోధా అక్బర్ లాంటి క్లాసిక్స్ కు దగ్గరగా కూడా వెళ్లలేకపోయాడు. మరో ప్రక్క ఈ సినిమాలో చరిత్రను వక్రీకరించారనే విమర్శలు వస్తున్నాయి. మిత్ ని, హిస్టరీని కలపటంలో దారుణంగా ఫెయిలయ్యారు. అక్షయ్ కుమార్ నటన కూడా ఆ పెద్ద రాజుని గుర్తు కూడా చేయలేకపోయింది. అలాగే మహ్మద్ ఘోరి పరాజయంతోనే కథ పూర్తై పోయింది. కానీ ఆ తర్వాత కథను సాగ తీసారు. అలాగే ఇది ప్రేమ కావ్యమా లేక వార్ ఫిల్మా అనేది కూడా డైరక్టర్ డిసైడ్ చేసుకోలేకపోయారని అర్దమవుతోంది. ఏదైమైనా పద్మావత్, కేసరి, బాజీరావు మస్తానీ లాంటి సినిమాల స్దాయిలో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచలేక తడబడింది.

టెక్నికల్ గా…

సినిమా ఉన్నంతగా అని చెప్పలేం కానీ బాగుంది. నేపధ్య సంగీతం కథకు తగ్గట్లు ఉంటే ఇంకా బాగుండేది. అప్పటికి డైలాగులుతోటి, కాస్ట్యూమ్స్ తోటి లాక్కొచ్చే ప్రయత్నం చేసారు. మనుష్ నందన్ అందించిన సినిమాటోగ్రఫి కూడా బాగోలేదు. అలాగే శంకర్, ఎహాసాన్, లాయ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకోలేకపోయింది.సినిమా స్క్రిప్టులో larger vision, greater integrity లోపించింది. సినిమా ప్రారంభం సింహం, అక్షయ్ కుమార్ ల మద్య ఫైట్ తో మొదలెట్టిన దర్శకుడు ఆ తర్వాత ఆ ఇంటెన్సిటీని ప్రదర్శించలేకపోయారు.విలన్ కు అయితే సరైన ఇంట్రడక్షన్ లేదు. ఆర్ట్ వర్క్ కూడా అప్ టు ది మార్క్ లేదు. ఏదైమైనా రాజమౌళి, సంజయ్ లీలా భన్సాలి వంటి దర్శకులు చేతిలో పడితే మ్యాజిక్ జరిగేది అనిపించింది. హడావిడే తప్ప ఆత్మ లేని ఈ సినిమా అక్షయ్ కుమార్ సినిమాల ఎంపిక సరిచేసుకోవాల్సిన అవసరాన్ని తేల్చి చెప్తుంది.

చూడచ్చా…

చారిత్రక కథాంశాలు పట్ల ఆసక్తి ఉన్నవారు ఓ సారి చూడవచ్చు.

బ్యానర్: యష్ రాజ్ ఫిలింస్
నటీనటులు: అక్షయ్ కుమార్, సంజయ్ దత్, సోనుసూద్, మనూషి చిల్లర్, అశుతోష్ రాణా తదితరులు
సినిమాటోగ్రఫి: మనుష్ నందన్
ఎడిటింగ్: ఆరిఫ్ షేక్
మ్యూజిక్: శంకర్, ఎహసాన్ లాయ్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా
రచన, దర్శకుడు: చంద్ర ప్రకాశ్ ద్వివేది
నిర్మాత: ఆదిత్య చోప్రా
రన్ టైమ్: 2 hours 15 minutes.
రిలీజ్ డేట్: 2022-06-03