సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై మూవీ రివ్యూ
Emotional Engagement Emoji
ఓటీటీ లో రిలీజ్ అయ్యి అక్కడ సక్సెస్ అయ్యిఅక్కడ నుంచి థియేటర్‌లోకి అడుగుపెట్టిన చిత్రంగా ఈ సినిమా ఇప్పటికే రికార్డు సృష్టించింది. అలా అంత సక్సెస్ అవ్వటానికి ఈ సినిమాలో ఏముందిపెద్ద స్టార్ లేడుతెలుగువారికి తెలుసున్న డైరక్టర్ లేడు అయినా ఇక్కడా డిస్కషన్ పాయింట్ గా నిలవటానికి కారణం ఏమిటిఈ సినిమాలో కథేంటి వంటి విషయాలు చూద్దాం.
స్టోరీ లైన్ :
బాబాజీ (సూర్య మోహన్ కులశ్రేష్ట) కు ఎంతో మంది భక్తులు. అలాగే ఆయన వయస్సు మీరిన వాడు. ఆ స్దాయి వ్యక్తి, వయస్సులో పెద్దవాడు తనని లైంగింకంగా వేధించాడని ఆరోపిస్తూ మైనర్ బాలిక ను(అద్రిజా సిన్హా) పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కథ మొదలువుతంది. ను కంప్లైంట్ తీసుకుని పోలీసులు బాబాజీని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తారు. అయితే ను తరపున వాదించే లాయర్ డబ్బుకు కక్కుర్తిపడి కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తాడు. ఈ విషయం తెలిసిన ను కుటుంబం పోలీసుల సూచన మేరకు పోక్సో చట్టం గురించి బాగా తెలిసిన న్యాయవాది పి.సి.సోలంకి (మనోజ్ బాజ్‌పాయ్) దగ్గరకు వెళ్తారు. నుతరపు లాయిర్ గా రంగంలోకి దిగిన సోలంకి ఈ కేసుని గెలిపించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? వాటిని అధిగమించాడు? చివరకు బాబాజీకి శిక్ష ఎలా పడేలా చేసాడు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
విశ్లేషణ :
అనేక పత్రికలు పత్రికలు, వెబ్‌సైట్స్‌లో వచ్చిన ఎన్నో వాస్తవిక సంఘటనల ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 16 ఏళ్ల బాలిక, ఆమె అనుభవిస్తున్న బాధ, సోలంకి ఆమె తరఫున చేసిన న్యాయపోరాటం ఈ చిత్రం మెయిన్ ఫోకస్ పెట్టడమే కలిసి వచ్చింది. సినిమాలో ఎక్కడా కూడా విలన్ (బాబా)ను ఫోకస్ చేయాలని అనుకోలేదు. కథనం దృష్టి మొత్తం సోలంకి చేస్తోన్న పోరాటంపైనే ఉంది. ఈ సినిమా చూస్తున్న మనకూ న్యాయవ్యవస్థ అమితమైన గౌరవం ఏర్పడేలా ఆ వ్యవస్థకు అద్దం పట్టేలా దీన్ని రూపొందించమే ఇవాళ ఇంతటి ప్రశంసలకు నోచుకుంటోంది అవకాశం దొరికితే సమాజంలో డబ్బు, పలుకుబడి ఉన్న వాళ్లు చట్టం నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు? అనేది ప్రధానమైన పాయింట్ గా ఈ స్క్రిప్టుని ముందుకు తీసుకెళ్లారు. అంతేకాదు వాళ్లు తమ రక్షణ కోసం అవసరమైతే ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరన్న విషయాన్ని చాలా చక్కగా చూపించారు దర్శకుడు అపూర్వ సింగ్.
అలాగే కోర్టులో బాధితురాలిని ఇబ్బంది పెట్టేందుకు దారుణమైన ప్రశ్నలు అడగటం, వాటికి ను ధైర్యంగా సమాధానాలు ఇవ్వడం తదితర సన్నివేశాలు సినిమాపై ఇంట్రస్ట్ ని పెంచాయి. కోర్టులో బాబాజీ తరపు లాయర్లకు దీటుగా సోలంకి ప్రతివాదనలు వినిపించడం, ప్రతి విచారణలోనూ బాబాజీ బెయిల్ రాకుండా తానే గెలవడం వంటి సన్నివేశాలను చాలా చక్కగా తీశారు. అయితే ఈ సినిమా సామాన్యుడు కాస్త కొరుకుడు పడటం కష్టమే. కోర్టులో విచారణ సందర్భంగా న్యాయపరిభాషలో చెప్పే క్లాజ్‌లు, సబ్ క్లాజ్‌లు సామాన్య ప్రేక్షకుడికి అర్థం కావు. ఇక తుది తీర్పు రోజున జరిగే విచారణ , క్లైమాక్స్ సీన్ లో ఎమోషన్స్ బాగా పండాయి.
టెక్నికల్ గా :
టెక్నికల్ గా సినిమా చాలా బాగుంది. అర్జున్ సినిమాటోగ్రఫీ, లైటింగ్ ఎఫెక్ట్ ఓటిటి సినిమాను సైతం నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లాయి. అలాగే సినిమా కోసం వేసిన కోర్టు సెట్ లా అనిపించకుండా రియలిస్ట్‌గా చూపించారు. సుమీత్ ఎడిటింగ్ ఎక్కడా లాగ్ లేకుండా సాగిపోయింది. లెంగ్త్ తక్కువే. ఇక సంగీత్-సిద్ధార్థ్ రాయ్ సంగీతం నడిచిపోతుంది. డైలాగులు బాగున్నాయి
ఫెరఫార్మన్స్ పరంగా లాయర్ సోలంకి పాత్రలో మనోజ్ బాజ్‌పాయ్ అద్బుతంగా చేసారు.క్లైమాక్స్ సీన్ లలో తన అనుభవం అంతా రంగరించి అద్బుతం చేసాడు. మిగతా నటీనటులు చాలా మంది మనోజ్ కు పోటీ ఇచ్చే ప్రయత్నం చేసారు. అంతా హిందీ నటులే. మనం పోల్చుకోవటం కొద్దిగా కష్టం.
చూడచ్చా :
ఈ వీకెండ్‌లో ఒక మంచి కోర్టు రూమ్ డ్రామా చూడాలనుకుంటే ఈ సినిమా ప్రయత్నించవచ్చు. తెలుగు ఆడియో అందుబాటులో ఉంది కాబట్టి ఇబ్బంది ఉండదు.
నటీనటులు :
మనోజ్‌బాజ్ పాయ్, సూర్య మోహన్ కులశ్రేష్ట, ప్రియాంక సీతియా, విపిన్ శర్మ, నిఖిల్ పాండే, జైహింద్ కుమార్ తదితరులు
సాంకేతికవర్గం :
సంగీతం: సంగీత్ సిద్ధార్థ్;
సినిమాటోగ్రఫీ: అర్జున్ కక్రీతి;
ఎడిటింగ్: సుమీత్ కోటియాన్;
రచన: దీపక్ కింగ్రానీ;
దర్శకత్వం: అపూర్వ సింగ్ ఖర్కీ;
రన్ టైమ్ : 132 మినిట్స్
ఓటిటి: జీ5
Release Date : June 7, 2023