సి ఆర్ ప్రొడక్షన్స్ నూతన చిత్రం ప్రారంభం

Published On: November 23, 2021   |   Posted By:

సి ఆర్ ప్రొడక్షన్స్ నూతన చిత్రం ప్రారంభం

తెలంగాణ అగ్రికల్చర్ మినిస్టర్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభమైన సి ఆర్ “ప్రొడక్షన్స్ నూతన చిత్రం”
 
 
సి ఆర్ ప్రొడక్షన్ పతాకంపై రామ్ గౌడ, ప్రియా పాల్ జంటగా వి.జె సాగర్ దర్శకత్వంలో  సి.రవి సాగర్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాదు లోని సారథి స్టూడియోలో సినీ అతిథుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది.
 
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అగ్రికల్చర్ మినిస్టర్ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హీరో, హీరోయిన్ల పై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా చిత్ర నిర్మాత రవి సాగర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.. చిత్ర దర్శకుడు వి.జె సాగర్  గౌరవ దర్శకత్వం వహించారు.
 
అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయులు సమావేశంలో…
 
మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ….
 
నువ్వు గొప్పగా కల కనక పోతే ఎవరో కన్న కలలో నువ్వు బానిసవి అవుతావు అన్న డైలాగ్ చాలా అద్భుతంగా ఉంది అని ఈ ఒక్క డైలాగ్ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్తుంది అని అన్నారు.
 
చిత్ర నిర్మాత C.రవి సాగర్ మాట్లాడుతూ ..మా సినిమాకు చాలా బిజీగా ఉన్న సమయం తీసుకొని తెలంగాణ అగ్రికల్చర్ మినిస్టర్ వచ్చి ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను గత కొంత కాలంగా నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను, ప్రజలందరికీ మంచి ఆహారం ఇవ్వాలనే ఉద్దేశంతో సి.ఆర్ అనే ఒక బ్రాండ్ తో విషం లేనటువంటి  మంచి ఆహారాన్ని సమాజానికి అందిస్తూ  అదే పంథాలో ఇప్పుడు సమాజానికి మంచి సందేశం  ఇవ్వాలనే ఉదేశ్యం తో మీ ముందుకు వస్తున్నాను. పిల్లల్ని మనం హాస్టల్ లో జాయిన్ చేస్తూ వారికి మనం మంచి  విద్యని మాత్రమే ఇస్తున్నాము. కానీ ఎడ్యుకేషన్ తో పాటు చాలా మిస్ అవుతున్నారు , వారు మిస్సయిన ప్రభావం కొంతకాలం తర్వాత అది ఓల్డ్ ఏజ్ హోం గా రిఫ్లెక్షన్ కనిపిస్తుంది అనే కంటెంట్ మీద దర్శకుడు వి జె సాగర్  అద్భుతమైన కథను మంచి స్క్రీన్ ప్లే తో రాసుకున్నారు.ఈ సినిమాలోని ప్రతి సీన్లో కూడా ఒక నూతనత్వం ఉంది.ఫ్యామిలీతో కలిసి ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా ఇది.మా సినిమాకు డి.ఓ.పి గా కె.జి.యఫ్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు.మేము తీస్తున్న ఈ సినిమాను  ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు 
 
 
చిత్ర దర్శకుడు వి.జె సాగర్ మాట్లాడుతూ ..నేను దర్శకత్వా శాఖలో తొలిప్రేమ కరుణాకర్, రసూల్ ఎల్లోర్ దగ్గర పని చేశాను. తర్వాత  కొన్ని యాడ్ ఫిలిమ్స్ డైరెక్ట్  చేశాను.దర్శకుడిగా ఇది నా మొదటి చిత్రం .చిన్న పిల్లలు తల్లిదండ్రుల ప్రేమను ఎలా మిస్ అవుతున్నారు. ఆ ప్రేమ మిస్ అయితే పెద్దయిన తర్వాత ఎలా తయారవుతారు అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను చేస్తున్నాము. కన్నడలో  హీరో గా చేసిన హీరో మా సినిమాకు హీరోగా నటిస్తున్నారు. కే జి యఫ్ కు సంబంధించిన కెమెరా డిపార్ట్మెంట్ వారే ఈ సినిమాకు పనిచేస్తున్నారు నెక్స్ట్ మంత్ షూట్ కి వెళ్తున్నాము. మీ అందరి సహకారం మా సినిమాకు ఉండాలని కోరుతున్నాను అన్నారు.
 
 
 నటుడు విజయ్ భాస్కర్ మాట్లాడుతూ ..ఈ చిత్ర దర్శకుడు వి జె సాగర్ దగ్గర నేను ఇంతకుముందు కొన్ని యాడ్ ఫిలిమ్స్ లో నటించాను. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అన్నారు.
 
నటుడు దిల్ రమేష్ మాట్లాడుతూ ..ఒక రైతు గా నేచురల్ ఫార్మింగ్ చేస్తూ సినిమా మీద ఇంట్రెస్ట్ తో ఒక సినిమాచేస్తే అది సమాజానికి మంచి చేస్తుందని దర్శకుడు వి జె సాగర్  చెప్పిన కథను నమ్మి  ఇష్టంతో ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చారు. మంచి కథ తో పాటు ఈ సినిమాలో అద్భుతమైన డైలాగ్ లు ఉంటాయి. “మనం గొప్పగా కలగనకపోతే.. ఎవడో కన్న గొప్ప కలకు మనం బానిసవుతాం” ఒక డైలాగ్  జీవిత సత్యం లాంటి డైలాగ్ చెప్పారు. ఇలాంటి డైలాగులు స్క్రిప్టులో చాలా ఉన్నాయి. అలాంటి మంచి స్క్రిప్ట్ తో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది.  సమాజానికి ఆడియన్స్ కు ఈ సినిమా మంచి మెసేజ్ ఇస్తుందనే నమ్మకముందని అన్నారు. 
 
హీరోయిన్ ప్రియ పాల్ మాట్లాడుతూ..కథ చాలా స్ట్రాంగ్ గా ఉంది  సొసైటీకి ఈ కథ మంచి వ్యాల్యూ ఇస్తుంది. దర్శకుడు చాలా క్రియేటివ్ గా రాశారు.ఈ సినిమా  సొసైటీలో  ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. పిల్లల కోసం వాళ్ల ఎదుగుదల కోసం వాళ్లకు ఎలాంటి ఎడ్యుకేషన్ తో పాటు ఏమివ్వాలి అనేటటువంటి ఫ్యామిలీ వాల్యూస్ తో వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పక నచ్చుతుంది. ఇది నా మూడవ సినిమా నా గత రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సి.ఆర్ ప్రొడక్షన్ లో హీరోయిన్ గా చేసే అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు 
 
 
నటీనటులు
 
రామ్ గౌడ , ప్రియ పాల్ ,విజయ్ భాస్కర్, దిల్ రమేష్ 
 
సాంకేతిక నిపుణులు
 
బ్యానర్ : సి ఆర్ ప్రొడక్షన్ 
ప్రొడ్యూసర్ : సి రవి సాగర్ 
స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్ డైరెక్షన్ : వి.జె సాగర్  
డి.ఓ.పి తన్విక్