సుల్తాన్ చిత్రం ఓటీటీ ఆహా లో

Published On: April 28, 2021   |   Posted By:
సుల్తాన్ చిత్రం ఓటీటీ ఆహా లో
 
ఏప్రిల్ 30న తెలుగు ఓటీటీ ‘ఆహా’లో కార్తి, రష్మిక మందన్న జంటగా నటించిన సుల్తాన్ 
 
బ్లాక్ బస్టర్ సినిమాలు, వెబ్ సిరీస్, వెబ్ షోస్‌లతో హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’ హౌస్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. ఈ క్రమంలో ఏప్రిల్ 30న హీరో కార్తి, రష్మిక మందన్న జంటగా  నటించిన ‘సుల్తాన్ కోలాహలం ‘ఆహా’లో ప్రారంభం కానుంది. యాక్షన్, రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్ అన్ని అంశాల కలయికలో రూపొందిన ఈ చిత్రాన్ని భాగ్యరాజ్ కన్నన్ తెరకెక్కించారు. ఈ చిత్రం రీసెంట్‌గా థియేటర్స్‌లో విడుదలై సందడి చేసిన సంగతి తెలిసిందే. 
 
కార్తి హీరోగా నటించిన ‘ఖైది’ చిత్రం కూడా ‘ఆహా’లో విడుదల బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే కోవలో ‘సుల్తాన్‘ చిత్రం కూడా ప్రేక్షకుల్లో అదే రకమైన ఆసక్తిని రేకెత్తిస్తుందని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. వెబ్ షోస్, సక్సెస్‌ఫుల్ చిత్రాలతో పాటు  ఏప్రిల్ నెలలో లెవన్త్ అవర్, తెల్లవారితే గురువారం, చావు కబురు చల్లగా చిత్రాలు విడుదలై ప్రేక్షకులను అలరించాయి. ఈ సమ్మర్‌లో వేసవిని జయించేలా ఇళ్లలోకి థియేటర్స్ ఎక్స్‌పీరియెన్స్‌ను తీసుకొస్తోంది ‘ఆహా’.