సూపర్ డీలక్స్ మూవీ రివ్యూ
సమంత,సేతుపతి ‘సూపర్ డీలక్స్’ రివ్యూ
Rating:3/5
త్యాగరాజన్ కుమార్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ డీలక్స్ చిత్రం 2019లో తమిళంలో విడుదలైంది. వైవిధ్యమైన కథ, కథనాలతో రూపొంది విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ చిత్రంలో నటీనటులు అద్భుతమైన నటనను ప్రదర్శించారని రివ్యూలు వచ్చాయి. దాంతో తెలుగులో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేలా ఓ ఇంట్రస్ట్ ని క్రియేట్ చేసిన ఈ అంథాలజీ చిత్రం. దానికి తోడు విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఈ చిత్రంలో తను పోషించిన పాత్రకుగానూ బెస్ట్ సపోర్టింగ్ రోల్ కేటగిరిలో జాతీయ అవార్డును దక్కించుకున్నారు.నాటి డిస్కో డాన్సర్ కు సెట్ చేయబడిన ఈ చిత్రం ప్రోమోను కూడా అందరినీ బాగా ఆకర్షించింది. ఈ నేపధ్యంలో రిలీజైన ఈ చిత్రం ఏ మేరకు తెలుగు వాళ్లకు నచ్చింది..అనుకున్న స్దాయిలో ఈ సినిమా ఉందా.. హిజ్రాను ప్రధాన పాత్రగా చూపించే కమర్షియల్ సినిమా టాలీవుడ్ లో పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. మరి ఈ సినిమా ఆడుతుందా…కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్
‘సూపర్ డీలక్స్’ నాలుగు వేర్వేరు కథల సమాహారం. భార్య భర్తలు పవిత్ర (సమంత), మహేశ్ (ఫహద్ ఫాజిల్) మధ్య ఓ సంఘటన పెద్ద ఆగాధాన్నే క్రియేట్ చేస్తుంది. పవిత్ర తన మాజీ ప్రియుడితో శృంగారంలో పాల్గొంటుండగా అతను పక్కమీదే ప్రాణాలు వదలుతాడు. భార్య చేసిన పనితో కలత చెందిన భర్త ఏం చేయాలో అర్దం కాదు. మొదట మహేష్ ఆ శవాన్ని పూడ్చిపెట్టడానికి తన అర్ధాంగితోనే ప్రయత్నాలు మొదలు పెట్టడం మరో కోణం. అలా పవిత్ర చేసిన పని కారణంగా ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకుంటారు.
ఇలాంటివే మరో మూడు కథలు. ఓ అడల్డ్ సినిమాలో నటించిన మహిళ లీలా (రమ్యకృష్ణ).. ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనుకుంటుంది. ఆమె భర్త ఆమెను పట్టించుకోడు. అయినా బండి లాక్కొస్తూంటుంది. అయితే అనుకోకుండా ఆమె కొడుకు .. బ్లూఫిలింలో తన తల్లి (రమ్యకృష్ణ) కనిపించడంతో తట్టుకోలేక హత్యాయత్నం చేస్తాడు.
ఇక హిజ్రాశిల్ప/ మాణిక్యం (విజయ్ సేతుపతి) తన ఫ్యామిలీ కోసం ముంబయి నుంచి తిరిగి వస్తాడు. అతను ట్రాన్స్ జెండర్‌గా మారడం వల్ల కుటుంబంలో చోటుచేసుకొన్న భావోద్వేగాలు, అలాగే ట్రాన్స్ జెండర్‌గా సమాజంలో అనుభవించిన బాధలు ఈ చిత్రంలో ఓ కోణం. ఇలా నాలుగు కథలు నాలుగు విధాలుగా సాగుతాయి.
ఎనాలసిస్ ..
ఇలా ఈ అంథాలజీ వేర్వేరే కథలను ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈ జీవితాలను కలిపి ఉంచేది ఏమిటి? కామం, అవిశ్వాసం, లైంగికత, మతం, నేరం వంటి ఇతివృత్తాలను తెలియజేసేలా సూపర్ డీలక్స్ అనే అంథాలజీ భావోద్వేగాల కలయికలో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తుంది. పవిత్ర కథతో సినిమాను మొదలు పెట్టిన డైరక్టర్ ఒక్కో కథలోని క్యారక్టర్స్, వాటి కాంప్లిక్ట్ ని ప్రస్తావించుకుంటూ వెళ్లాడు. అలాగే ఆయా పాత్రలు తమ సమస్యల నుంచి బయట పడటానికి చేసే ప్రయత్నాలు, వాటి మధ్య చోటు చేసుకునే సంఘర్షణ హైలెట్ గా నిలిచింది. అలాగే ఈ సీరియస్ డ్రామాకు ఫన్ జోడిస్తూ నడిపించిన విధానం కలిసొచ్చింది.
సాధారణంగా ఇలాంటి అంథాలజీ కథలులో ప్రేక్షకులు ఇన్వాల్స్ అవటం కష్టం. ఎమోషనల్ గా కూర్చోబెట్టవు. ఒక్కో కథ అయ్యిపోగానే డిస్కకనెక్ట్ అయ్యిపోతూటాం. అయితే ఈ సినిమా కథలలో ప్రతీ దాంట్లోనూ డిఫరెంట్ పాయింట్ ఉంది. అలాగే ప్రతీ కథ కూడా అందులో ఉన్న స్టోరీ లైన్ లో కాప్లిక్ట్స్ బలంగా ఉండటంతో ఫాస్ట్ గా పరుగులు పెడుతుంది. నడిపించిన తీరు సాగతీతకు గురి కాకపోవడంతో స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్ గా సాగింది . పాత్రల పరిచయానికి చాలా ఎక్కువ సమయం తీసుకోకుండా కథనాన్ని రేసీగా మార్చటంతో ఏదో బెస్ట్ థ్రిల్లర్ చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఒక దశ దాటాక కామన్ ఆడియెన్ సైతం ఇలాంటి అంథాలిజీ లీనమై చూస్తాడు. కారణం రైటింగ్ లో తీసుకున్న జాగ్రత్తలే, స్పీడుగా నడిచే టేకింగే.
అలాగే ఇలాంటి కథలలో డిటైలింగ్ ముఖ్యమనేది కాదనలేనివిషయం. అయితే అదే ఎక్కువైంది ఈసినిమాకు. డిటేలింగ్ పేరుతో టైమ్ గడిపేసాడు డైరక్టర్. దాంతో అవసరం లేని సన్నివేశాలు అక్కడక్కడా వస్తాయి. అప్పుడే మన చేతిలో ఫార్వార్డ్ ఆప్షన్ కూడా ఉంటుందని గుర్తు వస్తుంది. ఈ అంథాలిజీలో మధ్యలో కొన్ని సీన్స్ మాత్రం కాస్త స్లో అయ్యాయి. చాలా బలమైన క్యాస్టింగ్ సపోర్ట్,దాన్ని వాడుకునేంత స్ట్రాంగ్ కంటెంట్ ఉండటంతో ఈ సినిమా చాలా కాలం గుర్తుండిపోతుంది.
వాస్తవానికి సూపర్ డీలక్స్ లాంటి సినిమాలు అన్ని భాషల్లోనూ రావాల్సిన అవసరం ఉంది. కాకపోతే కమర్షియల్ కోణంలో చూసుకుంటే మాత్రం వీటి వల్ల కలిగే ప్రయోజాలను తక్కువే అని చెప్పాలి.. కేవలం అభిరుచి ఉన్న నిర్మాతలు తీస్తే ..అలాంటి అభిరుచి ఉన్న ప్రేక్షకులు మాత్రమే చూస్తారు . ఈ సినిమా రిలీజ్ అయిన టైంలో సోషల్ మీడియాలో ఎన్ని ప్రశంసలు దక్కినా చాలా కాలం పాటు తెలుగులో కనీసం డబ్ చేసే సాహసం కూడా ఎవరూ చేయలేదు. ఇప్పుడు ఓటీటిలో దిగేదాకా తెలుగులో వస్తుందని నమ్మలేని స్దితి. ఇప్పుడు మాస్టర్, ఉప్పెనతో వచ్చిన క్రేజ్ ఆధారంగా విజయ్ సేతుపతి ప్లస్ సమంతా ఇమేజ్ లు దీని వ్యూస్ కు హెల్ప్ అయ్యే అవకాసం ఉంది. చివరకు ఏమౌతుందో చూడాలి.
టెక్నికల్ గా
టెక్నికల్ గా బాగా సౌండ్ గా ఉందీ ఫిల్మ్. పి.ఎస్.వినోద్, నీరవ్ షా సినిమాటోగ్రఫీ అయితే అదిరిపోయిందని చెప్పాలి. కథలు,క్యారక్టర్స్, నేపధ్యం ని బట్టి లైటింగ్ ఎఫెక్ట్‌లను తీర్చిదిద్దిన విధానం మెప్పిస్తుంది. సత్యరాజ్ నటరాజన్ ఎడిటింగ్ ఫరవాలేదు. నాలుగు కథలు కావడంతో సినిమా లెంగ్త్ బాగా ఎక్కువైంది. యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాని మరో మెట్టు ఎక్కించింది. సినిమాలో పాటలేవీ లేవు. డైరక్టర్ త్యాగరాజన్ కుమారరాజా ‘సూపర్‌డీలక్స్’ ఫెరఫెక్ట్ గా తెరకెక్కించాడనే చెప్పాలి. మన తరం డైరక్టర్స్ లో గొప్ప డైరక్టర్ అనిపించుకున్నాడు.
నటీనటుల్లో ..
ఇలాంటి పాత్రలో సమంత కనిపిస్తుందంటే అసలు నమ్మబుద్ది కాదు. సమంత తన ఇమేజ్ కు పూర్తి విరుద్ధమైన కథలో నటించింది. ఛాలెంజింగ్ రోల్ అని చెప్పాలి. తను ఇరుక్కుపోయి, తన భర్తను సైతం ఇరికించేస్తేనేమో అనే సందేహంతో ముందుకు వెళ్లి ప్రమాదం నుంచి బయట పడేయాలనే తపన పడే భార్యగా మంచి హావభావాలను ఇచ్చింది. తన స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సినిమాకి చాలా దోహదపడింది. ఎవరైనా ఇమేజ్ లేని హీరోయిన్ చేసి ఉంటే మాత్రం ఇంపాక్ట్ తగ్గిపోయేది. సమంతను ఇలాంటి పాత్రలో చూడటం వెరైటీనే,
విజయ సేతుపతి తనకిచ్చిన క్యారెక్టర్ ని అపారమైన అనుభవంతో నిలబెట్టేశారు. క్యాస్టింగ్ పరంగా తీసుకున్న బెస్ట్ డెసిషన్ ఇదేనని చెప్పొచ్చు. మిగతా ఆర్టిస్ట్ లు పెర్ఫార్మన్స్ పరంగా మంచి అవుట్ ఫుట్ ఇచ్చారు . టెక్నీషియన్స్ తమకిచ్చిన బాధ్యతలకు న్యాయం చేకూర్చారు.
చూడచ్చా?
విభిన్నత కోరుకునే వారు ఖచ్చితంగా చూడదగ్గ సినిమానే
తెర వెనుక..ముందు
నటీనటులు: విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సమంత, రమ్యకృష్ణ, మిస్కిన్ రాజా, గాయత్రీ శంకర్ తదుతరులు.
సంగీతం: యువన్ శంకర్ రాజా;
సినిమాటోగ్రఫీ: పి.ఎస్.వినోద్, నీరవ్ షా;
ఎడిటింగ్: సత్యరాజ్ నటరాజన్;
స్క్రీన్‌ప్లే: త్యాగరాజన్ కుమార్ రాజా, మిస్కిన్, నలన్ కుమారస్వామి, నీలన్ కె.శేఖర్;
దర్శకత్వం: త్యాగరాజన్ కుమార్ రాజా;
రన్ టైమ్:2గం|| 55ని||
విడుదల: ఆహా

విడుదల తేదీ: 6 ఆగస్ట్, 2021