Reading Time: < 1 min

సూప‌ర్‌మ‌చ్చి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Image

క‌ల్యాణ్‌దేవ్‌, రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ కాంబినేష‌న్ చిత్రానికి టైటిల్ అనౌన్స్‌మెంట్‌, 

క‌ల్యాణ్‌దేవ్‌, రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రానికి సూప‌ర్‌మ‌చ్చి అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేస్తూ ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. వ‌ర్షంలో స్నేహితుల న‌డుమ హీరో క‌ల్యాణ్‌దేవ్ న‌వ్వుతూ ఉండే లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.
పులివాసు డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ రెహ చ‌క్ర‌వ‌ర్తి హీరోయిన్‌గా న‌టిస్తుంది. 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. మ్యూజిక్ సెన్సేష‌న‌ల్ ఎస్.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.
న‌వంబ‌ర్ 8న విడుద‌ల కానున్న శ్రీవిష్ణు `తిప్ప‌రామీసం` చిత్రాన్ని నిర్మించిన రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌లో రూపొందుత‌న్న చిత్ర‌మిది.

న‌టీన‌టులు:
క‌ల్యాణ్‌దేవ్‌, రెహ చ‌క్ర‌వ‌ర్తి, నరేశ్ వి.కె, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, ప్ర‌గ‌తి, అజ‌య్‌, మ‌హేశ్‌, ష‌రీఫ్‌, స‌త్య త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  పులి వాసు
నిర్మాత‌:  రిజ్వాన్‌
కో ప్రొడ్యూస‌ర్‌:  ఖుషి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  మ‌నోజ్ మావెళ్ల‌
మ్యూజిక్‌:  ఎస్‌.ఎస్‌.త‌మ‌న్
కెమెరా:  శ్యామ్ కె.నాయుడు
ఎడిటింగ్‌:  మార్తాండ్ కె.వెంక‌టేశ్‌
ఆర్ట్‌:  బ్ర‌హ్మ క‌డ‌లి
పాట‌లు:  కెకె