సూర్య‌తో అమితాబ్‌

Published On: January 10, 2018   |   Posted By:

సూర్య‌తో అమితాబ్‌

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్‌, బిగ్ బి ప్ర‌స్తుతం ద‌క్షిణాది సినిమాల్లో న‌టించ‌డానికి ఆస‌క్తిని చూపుతున్నారు. అస‌లు విష‌యానికి వ‌స్తే మెగాస్టార్ చిరంజీవితో `సైరా న‌ర‌సింహారెడ్డి` చిత్రంలో న‌టిస్తున్నారు. ఇందులో చిరంజీవి గురువు పాత్ర‌లో అమితాబ్ క‌న‌ప‌డ‌నున్నారు. ఈ సినిమా కాకుండా ఓ త‌మిళ చిత్రంలో కూడా అమితాబ్ క‌న‌ప‌డ‌బోతున్నార‌ట‌. సూర్య హీరోగా కె.వి.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ నిర్మించ‌నుంది. ఇందులో ఓ కీల‌క పాత్ర‌లో అమితాబ్‌ను న‌టింప‌చేసేందుకు ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలే జ‌రుగుతున్నాయని కోలీవుడ్ వ‌ర్గాల స‌మాచారం. ఈ సినిమా ఏప్రిల్‌లో స్టార్ట్ అవుతుంద‌ని, ఆలోపు సూర్య సెల్వ రాఘ‌వ‌న్ సినిమాను పూర్తి చేసేస్తాడు.