సెన్సార్ కు వెళ్లబోతున్న కోతల రాయుడు

Published On: March 23, 2021   |   Posted By:
సెన్సార్ కు వెళ్లబోతున్న  కోతల రాయుడు
 
ఏ.యస్.కె ఫిలిమ్స్ పతాకంపై శ్రీకాంత్, నటాషా దోషి ,డింపుల్ చోపడా,ప్రాచీ సిన్హా నటీనటులుగా సుధీర్ రాజు దర్శకత్వంలో ఏ.యస్.కిషోర్, కొలన్ వెంకటేష్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘కోతల రాయుడు’. ఈ చిత్రం సెన్సార్ కు వెళ్లబోతున్న సందర్భంగా 
 
చిత్ర నిర్మాతలు ఏ.యస్.కిషోర్, కొలన్ వెంకటేష్ దర్శకుడు సుధీర్ రాజు మాట్లాడుతూ.. శ్రీకాంత్ హీరోగా నటించిన ఫుల్, ఫ్యామిలీ  ఎంటర్టైన్మెంట్ కామెడీ సినిమా  “కోతల రాయుడు” . శ్రీకాంత్ గతంలో నటించిన ఆహ్వానము, పెళ్లిసందడి తరహాలో వస్తున్న  ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది.  దర్శకుడు సుధీర్ రాజు మంచి కంటెంట్ వుంబ కథను తీసుకొని చాలా బాగా తెరకెక్కించాడు.  నిర్మాత ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా చిత్రాన్ని చాలా చక్కగా నిర్మించాడు. సునీల్ కష్యప్ ఈ చిత్రానికి  అద్భుతమైన సంగీతాన్ని అందించాడు.సినిమా చాలా బాగా వచ్చింది. సినిమాలో  35 మంచి ప్యాడింగ్ ఆర్టిస్టులు లభించడం చాలా ఆనందంగా ఉంది.మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది . సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ సినిమా  ఆడియోను విడుదల చేసి సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం అని అన్నారు
 
నటీనటులు
 
శ్రీకాంత్, నటాషా దోషి ,డింపుల్ చోపడా,ప్రాచీ సిన్హా,సుడిగాలి సుదీర్, గీతాసింగ్ ,మురళి శర్మ ,సత్యం రాజేష్ ,పృథ్వి ,పోసాని కృష్ణ మురళి, జయప్రకాష్ రెడ్డి, చంద్రమోహన్ ,రాకెట్ రాఘవ, సుధ, హేమ, ధన్రాజ్ ,రవి వర్మ ,శ్రీలక్ష్మి ,జయవాణి ,బిత్తిరి సత్తి , రచ్చ రవి ,అనంత్, రంగ స్థలం మహేష్, జూనియర్ రేలంగి, గీతాంజలి, చిట్టి, డి వి తదితరులు 
 
సాంకేతిక నిపుణులు
 
బ్యానర్‌ : ఏ.యస్.కె ఫిలిమ్స్
నిర్మాతలు : ఏ.యస్.కిషోర్, కొలన్ వెంకటేష్
కథ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్‌ : సుధీర్ రాజు
కెమెరామెన్ : కె. బుజ్జి: 
మ్యూజిక్‌ : సునీల్ కశ్యప్
లిరిక్స్ : డాక్టర్ కందికొండ
మాటలు : విక్రమ్ రాజు
ఎడిటర్‌ : యస్.బి ఉద్ధవ్
ఫైట్ మాస్టర్ :- రియల్ సతీష్