Reading Time: 2 mins

సెహరి సినిమా ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ

పండుగ‌లాంటి సినిమా `సెహరి` – ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణలో కోటి

ఫిబ్ర‌వ‌రి 11న రిలీజ‌వుతున్న `సెహరి`

సెహ‌రి అనే ప‌దానికి అర్థం సెల‌బ్రేష‌న్స్ అంటూ ట్రైల‌ర్‌లో క్లుప్తంగా వివ‌రించారు ద‌ర్శ‌కుడు. అది సినిమాలో చూస్తే ప్రేక్ష‌కుల‌కు ఒక పండుగ‌లా వుంటుంద‌ని నిర్మాత తెలియ‌జేస్తున్నాడు. హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి హీరో హీరోయిన్లుగా జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో రూపొందిన‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘సెహరి’.  వర్గో పిక్చర్స్ ప‌తాకంపై రూపొందిన ఈ సినిమా టైటిల్‌తో పాటు, టీజర్, సాంగ్స్‌కు ఇప్ప‌టికే ప్రేక్షకుల నుంచి విశేష స్పంద‌న ల‌భించింది. ఫిబ్ర‌వ‌రి 11న  ఈ సినిమా విడుద‌ల‌వుతుంది.

 

ఈ సంద‌ర్భంగా బుధ‌వారంనాడు ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ ప్ర‌సాద్ ల్యాబ్‌లో జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా న‌టుడు, సంగీత ద‌ర్శ‌కుడు కోటి మాట్లాడుతూ, ఈ సినిమాలో హీరోకు తండ్రిగా న‌టించాను. అది కూడా చిత్రంగా జ‌రిగింది. నేను ఆమ‌ధ్య జీ-సరిగ‌మ లాస్ట్ సింగింగ్ ఐకాన్ లో వుండ‌గా వారు నాకు న్యూ గెట‌ప్ ఇచ్చారు. ఆ గెట‌ప్ చూసి ఇన్‌స్పైర్ అయిన ఈ సినిమా టీమ్ మా ఇంటికి వ‌చ్చి హీరో ఫాద‌ర్ చేయ‌మ‌ని అడిగారు. పెద్ద‌గా న‌ట‌న రాద‌న్నా మేం చేయించుకుంటామనే స‌రికి కాద‌న‌లేక పోయా. క‌థాప‌రంగా ఇంటిలో నా కొడుకుతో ఎలా వుంటానో ఈ సినిమాలో అలానే బిహేవ్ చేశాను. ప్రశాంత్‌ ఆర్ విహారి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చాడు. ఎడిట‌ర్ ట్రైల‌ర్ చ‌క్క‌గా క‌ట్ చేశాడు. హీరో హర్ష్‌ కనుమిల్లిలో చాలా ఈజ్ వుంది. `నువ్వు నాకు న‌చ్చావ్‌`లో వెంక‌టేష్ త‌ర‌హాలో న‌ట‌న స‌హ‌జంగా పండించాడు. సెంటిమెంట్‌, రొమాన్స్‌, కామెడీ అన్ని షేడ్స్ త‌ను బాగా వ్య‌క్త‌ప‌రిచాడు. ఆడియ‌న్స్ థియేట‌ర్‌కు వ‌చ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయండని అని తెలిపారు.

చిత్ర నిర్మాత అద్వయ జిష్ణు రెడ్డి మాట్లాడుతూ, చిన్న పిల్ల‌ల‌నుంచి పెద్ద‌వారి వ‌ర‌కూ చూడ‌త‌గ్గ సినిమా ఇది. కుటుంబంతో క‌లిసి చూస్తే పండుగ చేసుకునేట్లుగా వుంటుంద‌ని చెప్ప‌గ‌ల‌ను అని తెలిపారు.

చిత్ర ద‌ర్శ‌కుడు జ్ఞానసాగర్‌ ద్వారక మాట్లాడుతూ, కోవిడ్ వ‌ల్ల సినిమా ఆల‌స్య‌మైంది. సెట్‌కు వెళ్ళేముందు వ‌ర్క్ షాప్ నిర్వ‌హించాం. అప్పుడే హీరో  న‌ట‌న‌తో నేను అభిమానిగా మారిపోయాను. హీరో హీరోయిన్ల మ‌ధ్య కెమిస్ట్రీ బాగా పండింది. ప్రశాంత్‌ ఆర్ విహారి బాణీల వ‌ల్లే పాట‌లు ఇప్ప‌టికే హిట్ అయ్యాయి. ఎడిట‌ర్ ట్రైల‌ర్ బాగా క‌ట్ చేశాడు. అంద‌రి కృషితో అద్భుతంగా వ‌చ్చింది అని తెలిపారు.

హీరోయిన్ సిమ్రాన్‌ చౌదరి మాట్లాడుతూ, ముందుగా పోస్ట‌ర్ విడుద‌ల చేసిన నంద‌మూరి బాల‌కృష్ణ‌గారికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు.  ప్ర‌శాంత్ విహారి మ్యూజిక‌ల్ సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యేలా చేశాడు. విడుద‌లైన‌ మూడు పాట‌లు బాగా ఆద‌ర‌ణ పొందాయి. మిగ‌తా నాలుగు పాట‌లు కూడా న‌చ్చుతాయి. ఇక హీరోగురించి చెప్పాలంటే త‌ను వ‌ర్జిన్ స్టార్‌. న‌ట‌న‌తో్పాటు టెక్నిక‌ల్‌గా నాలెడ్జ్ వున్న వ్య‌క్తి. ఆయ‌న చేసే విన్యాసాలు ఈనెల 11 ధియేట‌ర్‌లో చూసి హాయిగా న‌వ్వుకోండి అని తెలిపారు.

హీరో హర్ష్‌ కనుమిల్లి తెలుపుతూ, మా సినిమా పోస్ట‌ర్ నాడు బాల‌య్య‌బాబుగారు వ‌చ్చి చిత్ర స్థాయిని పెంచారు. దానితో మాలో క‌సి పెరిగింది. అందుకే బాగా తీయ‌గ‌లిగాం. నేను రాసిన క‌థ‌ను ఊహించిన‌దానికంటే ద‌ర్శ‌కుడు సాగ‌ర్ అద్భుతంగా తీయ‌గ‌లిగాడు. త్వ‌ర‌లో పెద్ద ద‌ర్శ‌కుల జాబితాలో చేరిపోతాడ‌నే న‌మ్మ‌క‌ముంది. ఇక కోటిగారి న‌ట‌న‌లో కొత్త కోణం ఇందులో చూస్తారు. కామెడీ కూడా పండించారు. అద్వయ జిష్ణు రెడ్డి నా క్లాస్‌మేట్‌. ఇప్పుడు నాతో సినిమా  తీశాడు. అలాగే సిమ్ర‌న్ అభిన‌యంతో సెకండాఫ్‌లో క‌ట్టిప‌డేస్తుంది. ఇంకా ఆర్హ‌, అనీషా కూడా బాగా న‌టించారు. ఇది ఆద్యంతం ఎంట‌ర్‌టైన్ చేసే సినిమా అని గ‌ట్టిగా చెప్ప‌గ‌ల‌ను. థియ‌ట‌ర్‌కు వ‌చ్చిన రెండు నిముషాల‌కే సెహ‌రి మిమ్మ‌ల్ని లీనం చేస్తుంది. ఒక‌టి రెండు సార్లు  సినిమా చూసేలా చేస్తుంద‌ని న‌మ్మ‌క‌ముంద‌ని తెలిపారు.

నటీనటులు: హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి, అభినవ్‌ గోమఠం, ప్రణీత్‌ రెడ్డి, కోటి, బాలకృష్ణ

సాంకేతిక విభాగం-  దర్శకుడు: జ్ఞానసాగర్‌ ద్వారక, క‌థ‌: హ‌ర్ష్ క‌నుమిల్లి, నిర్మాత‌- అద్వయ జిష్ణు రెడ్డి,
కెమెరా: అరవింద్‌ విశ్వనాథ్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌: ప్రశాంత్‌ ఆర్ విహారి, ఎడిటర్‌: రవితేజ గిరిజాల, ఆర్ట్‌ డైరెక్టర్‌: సాహి సురేష్‌, పి.ఆర్‌.ఓ- వంశీ శేఖ‌ర్‌.