Reading Time: 3 mins

సేనాపతి మూవీ రివ్యూ

Senapathi trailer: Rajendra Prasad's OTT debut promises an intense thriller | Entertainment News,The Indian Express

రాజేంద్రప్రసాద్ ‘సేనాపతి’ రివ్యూ

Emotional Engagement Emoji (EEE)

 
?
ఓటీటిలో రిలీజ్ అయ్యే  చాలా చిన్న సినిమాలు కమర్షియల్  సక్సెస్ లుగా లేవు కానీ కధా సక్సెస్ లుగా వుంటున్నాయి. మంచి కాన్సెప్ట్ లు తెర మీద కన్నా ఓటీటిలోనే పరిమిత బడ్జెట్ లలో చెప్పగలుతున్నారు. స్టార్ హీరోలు లేకపోయినా స్టార్ లాంటి కథ ఉండటం కలిసివస్తోంది. లవ్ ఇష్క్ కాదల్ దర్శకుడు చాలా కాలం తర్వాత ఓ సినిమాని ఓటీటి కోసం చేయటం ఆసక్తికరమైన విషయమే. అలాగే ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు సినిమాపై పాజిటీవ్‌ బజ్‌ను క్రియేట్‌ చేశాయి. దీనికి తోడు మూవీ ప్రమోషన్స్‌ కూగా గ్రాండ్‌గా చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ‘సేనాపతి’ఏ మేరకు అందుకుంది? రివ్యూలో చూద్దాం.స్టోరీ లైన్కృష్ణ (నరేశ్‌ అగస్త్య) ఓ పోలీస్..ఐపీ ఎస్ కు ప్రిపేర్ అవుతున్న నిజాయితీ గల కుర్రాడు. ఉద్యోగ నిర్వహణలో ఓ క్రిమినల్ తో జరిగే ఛేజ్ లో తన సర్వీస్ రివాల్వర్ ని పోగొట్టుకుంటాడు. ఆ రివాల్వర్ అనుకోని విధంగా చాలా చోట్ల తిరిగి చివరకు కృష్ణమూర్తి (రాజేంద్ర ప్రసాద్‌) చేతికి వస్తుంది. ఈ కృష్ణమూర్తి ఎవరు..ఈ రివాల్వర్ ని ఏ క్రిమినల్ కార్యక్రమాలకు వాడాడు…అలాగే రివాల్వర్  మళ్లీ తన చేతికి రావడం కోసం కృష్ణ ఏం చేశాడు? అనే విషయం చుట్టూ తిరుగే థ్రిల్లర్ ఈ కథ.స్క్రీన్ ప్లే ఎనాలసిస్..

తమిళంలో వచ్చి యావరేజ్ అనిపించుకున్న ‘8 తొట్టక్కల్’ (8 తూటాలు) కు రీమేక్ ఇది. తమిళంలో యావరేజ్ అనిపించుకున్న చిత్రాలు రీమేక్ లో పూర్తి మార్పులతో ఇక్కడ సూపర్ హిట్ అయ్యినవి ఉన్నాయి. అయితే ఇది కాన్సెప్టు ఓరియెంటెడ్ కథ. పెద్దగా మార్పులు ఆహ్వానించదు. దీని ఒరిజనల్  Stray Dog ( 1949) లో ఉన్న టెన్షన్ ఎలిమెంటే ఇప్పటికి కంటిన్యూ అవుతుంది. కాలం మారింది. 1949 నాటి పరిస్దితులు ఉన్నా కొంతవరకే. అలాగే అప్పటికే ఇప్పటికీ కథ చెప్పే విధానమూ మారింది. మనకు ఇప్పుడు కథను ప్రధాన పాత్ర వైపు నుంచి చెప్తున్నాము. అలాగే టైటిల్ సేనాపతి అని పెట్టినప్పుడు రాజేంద్రప్రసాద్ వైపు నుంచి చెప్పాల్సిన అవసరం ఉంది. అలా చేయకుండా టైటిల్ పవర్ ఫుల్ గా ఉందని పెట్టేసుకుని కథనం…ఒరిజనల్ ని అనుసరిస్తూ రాసుకుంటూ వెళ్లిపోతే వచ్చే సమస్యలు ఇవి. తమిళంలో అందుకే ఫెరఫెక్ట్ గా  ‘8 తొట్టక్కల్’ (8 తూటాలు) అని పెట్టాడు.

అప్పుడు ఆ బుల్లెట్లు ఏమయ్యాయి అనే విషయమే ప్రధానం. అంతేకానీ విలన్ లాంటి సేనాపతి పాత్ర కాదు. ఇక ఈ చిత్రంకు కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం ప్రక్క దారులు తొక్కకపోవటమే ఈ దర్శకుడు చేసిన గొప్ప పని. లేకపోతే ఈ సినిమా అటు ఇటూ కాకుండా పోయేది. యూత్ కు నచ్చే థ్రిల్లర్ క్రింత కూడా రాణించదు. అలాగే ఈ సినిమా ఓ వర్గానికి అంటే క్రైమ్ థ్రిల్లర్స్ అంటే ఆసక్తి ఉన్నవాళ్లకు పరిమితం అయ్యిపోతుంది. దానికి తగ్గట్లు కథలో కొన్ని బూతు డైలాగులు కూడా కలిపారు. ఓటీటి కదా అని ,సహజంగా ఉంటుందనో, రాగా ఫీల్ అవ్వాలనో బూతు డైలాగులు యధేచ్చగా వాడేసారు. అదీ ఓటీటిలో ఫ్యామిలీతో చూడాలనుకునే వారికి ఇబ్బంది.  అలాగే ఫస్టాఫ్ టకటకా సీన్స్ పరుగెడతాయి. సెకండాఫ్ వచ్చేసరికి కథ స్లో అయ్యిపోతుంది. రాజేంద్రప్రసాద్ ఎంట్రి నుంచి ప్లో పడిపోతుంది. వాస్తవానికి అక్కడ నుంచి కథ కొత్త మలుపులు తీసుకోవాలి. కానీ అలా జరగలేదు.  స్క్రీన్ ప్లేలో సమస్యలే సినిమాని ఓ స్టేజీలో ఆపేసాయి.

స్క్రిప్టు  రాసుకున్నపుడు ఏదైనా ఒక పాయింట్ ని బలంగా చెప్పాలని భావిస్తాడు ఫిల్మ్ మేకర్. బలంగా కాకపోయిన ఒక పాయింట్ ని చూపించే నమ్మి దాని చుట్టూనే కథను తిప్పే ప్రయత్నం చేస్తారు. తను అనుకున్న పాయింట్ తెరపైకి వస్తే సినిమా ఖచ్చితంగా ఎంతోకొంత అలరిస్తుందనేది ప్రతీసారి జరగే విషయం. సేనాపతి లో ఆ  పాయింటే  మిస్ అయ్యింది. అసలు కథలో దర్శకుడు మనష్యుల మనస్తత్వాలు  చెప్పాలనుకున్నడా ?థ్రిల్ చేయాలనకున్నాడా? ఓ వ్యక్తి జీవితంలో వచ్చే సమస్యలు వివరించాలనుకున్నాడు? అసలు ఇందులో ఏ పాయింట్ కనెక్ట్ చేయాలనుకున్నడో అనేది  ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది. తెరపై చాలా పాత్రలు కనిపిస్తాయి. కానీ  ఎమోషనల్ గా కనెక్ట్ చేయదు.  చివరి వరకూ ఏదో ట్విస్ట్ వస్తుందని నమ్మకంతో ఎదురు చూసిన ప్రేక్షకుడికి నిరాశే మిగులుతుంది.

టెక్నికల్ గా…

సినిమాలో ప్రధాన పాత్రలు ఎంత బాగా నటించినా కూడా.. కథ, కథనం బాగుంటేనే అది సక్సెస్‌ అవుతుంది. రొటీన్‌ కథనైనా.. దాన్ని తెరపై వైవిధ్యంగా చూపిస్తే దాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనేది నిజం. కథ తగ్గట్టు సినిమాని డ్రైవ్‌ చేసే బాధ్యత దర్శకుడిది. ఈ విషయంలో  దర్శకుడు పవన్ సాదినేని చాలా వరకూ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. తొలి సినిమా ‘లవ్ ఇష్క్ కాదల్’తో మంచి మార్కులు కొట్టేసినా పవన్.. మధ్యలో చాలా సినిమాలు చేసినా చాలా గ్యాప్ తర్వాత ‘సేనాపతి’మూవీని తన జానర్ మారినా సరిగా హ్యాండిల్‌ చేసాడు. కథ, కథనం రెండూ యావరేజ్ గా ఉన్నాయి.తన టెక్నికల్ బ్రిలియన్స్ తో సినిమాని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లాడు. ఇతనికి మిగతా డిపార్టమెంట్స్ అందరూ అద్బుతంగా సహకరించారు. కేవలం ఎడిటరే..స్లో నేరషన్ తో కాస్తంత విసుగెత్తిస్తాడు. ఏదైమైనా ఎడిటర్‌ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.

నటీనటుల్లో..

రాజేంద్రప్రసాద్ నటనకి ఎప్పుడూ వంక పెట్టలేం. ఇందులో పాత్రకు కూడా తన వంతు న్యాయం చేశాడు. ఓ సీరియస్ విషయాన్ని అద్బుతంగా ముందుకు తీసుకెళ్తాడు. తన పాత్రని చాలా నేచురల్ గా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అతని గ్యాంగ్‌లో ఉన్నవాళ్లంతా ఓకే.  కానీ వాళ్ళ పాత్రలు పెద్దగా రిజిస్టర్ అవ్వవు. హీరో, హీరోయిన్స్ గా నరేష్ అగస్త్య, జ్ఞానేశ్వరి కండ్రేగుల‌ ఓకే.  సత్య ప్రకాష్, జోష్ రవి, హర్షవర్ధన్ , రాకేందు మౌళి పరిధి మేరకు చేశారు.

చూడచ్చా
ఓ కొత్త తరహా క్రైమ్ థ్రిల్లర్ చూడాలనకునేవాళ్లు ఓ లుక్కేయచ్చు.

తెర ముందు..వెనుక

నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, నరేష్ అగస్త్య, జ్ఞానేశ్వరి కండ్రేగుల‌, హర్షవర్ధన్, రాకేందు మౌళి, ‘జోష్’ రవి, సత్యప్రకాష్, పావని రెడ్డి, జీవన్ కుమార్ తదితరులు
ఎడిటర్: గౌతమ్ నెరుసు
ఒరిజినల్ స్టోరి: శ్రీ గణేష్
మాటలు: రాకేందు మౌళి
సినిమాటోగ్రఫీ: వివేక్ కాలెపు
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
నిర్మాతలు: విష్ణుప్రసాద్, సుష్మితా కొణిదెల
దర్శకత్వం: పవన్ సాధినేని
విడుదల తేదీ: 31-12-2021
రన్ టైమ్: 2 గంటల,23 నిముషాలు
ఓటీటీ: ఆహా