Reading Time: < 1 min

సేవాదాస్ చిత్రం సెన్సార్ పూర్తి

శ్రీశ్రీ హథీరామ్ బాలాజీ క్రియేషన్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి కె.పి.ఎన్.చౌహాన్ దర్శకత్వంలో.. ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్-ఎమ్.బాలు చౌహాన్ సంయుక్తంగా నిర్మించిన ప్రతిష్టాత్మక బహుభాషా చిత్రం “సేవాదాస్”.

సీనియర్ హీరోలు సుమన్, భానుచందర్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో కె.పి.ఎన్. చౌహాన్-ప్రీతి అస్రాని, వినోద్ రైనా-రేఖా నిరోష హీరో హీరోయిన్లు. కె.పి.ఎన్.చౌహాన్ దర్శకత్వంలో బంజారా-తెలుగు- ఇంగ్లీష్-హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసిన సెన్సార్ సభ్యులు చిత్ర నిర్మాతలపై ప్రశంసల వర్షం కురిపించారు.

బంజారా సంస్కృతిని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే “సేవాదాస్” చిత్రాన్ని బంజారా భాషలోనే కాకుండా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందరికీ చేరువ చేస్తుండడం అభినందనీయమన్నారు.

కార్యనిర్వాహక నిర్మాత ఎమ్.బాలు చౌహాన్ మాట్లాడుతూ…”64 దేశాల్లో గల 18 కోట్ల బంజారాలతోపాటు తెలుగు, హిందీ ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా రూపొందిన సేవాదాస్” చిత్ర నిర్మాణంలో పాలుపంచుకోవడం ఓ బంజారా బిడ్డగా గర్వాన్నిస్తోందని పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ “సేవాదాస్” రూపకల్పన కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. వీలయినంత త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.

ఎస్.ఆర్.ఎస్.ప్రసాద్, విజయ్ రంగరాజు, చలాకీ చంటి, సంపత్ నాయక్, గీతా సింగ్, ఫిష్ వెంకట్, నవీనా రెడ్డి, శైలజ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, అసోసియేట్ డైరెక్టర్స్: రాజేంద్రప్రసాద్ చిరుత-రవితేజ-సంజయ్ భూషణ్-సాయి కుమార్, కో-డైరెక్టర్స్; ఎన్టీఆర్ సుబ్బు-నవీన్, వి ఎఫ్ ఎక్స్: కిషోర్ కాలకూరి, ఆర్ట్ డైరెక్టర్: విజయ్.ఎ, ప్రొడక్షన్ కంట్రోలర్: లక్ష్మణరావు-శ్రీరాములు, కెమెరామెన్: విజయ్ టాగోర్, ఎడిటర్: ప్రదీప్, పోస్ట్ ప్రొడక్షన్: రామానాయుడు స్టూడియోస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎమ్.బాలు చౌహాన్, నిర్మాతలు: ఇస్లావత్ వినోద్ రైనా-సీతారామ్ నాయక్, కథ-స్క్రీన్ ప్లే-డైరెక్షన్; కె.పి.ఎన్. చౌహాన్.