Reading Time: 2 mins
 
సైమా ఎనిమిద‌వ అవార్డుల వేడుక ఆగ‌స్ట్ లో
 
పాంట‌లూన్స్ సైమా ఎనిమిద‌వ అవార్డుల వేడుక ఆగ‌స్ట్ 15-16న ఖ‌తార్‌లో జ‌ర‌గ‌నుంది. పాంట‌లూన్స్ రెండో సారి ఈ అవార్డుల టైటిల్‌ను స్పాన్స‌ర్ చేస్తోంది. శ్రియా శ‌ర‌న్‌, విబ్రి మీడియా ఎండీ విష్ణు ఇందూరి, పాంట‌లూన్స్ మార్కెటింగ్‌, ఈకామ‌ర్స్ హెడ్ మిస్ట‌ర్ ర్యాన్ ఫెర్నాండెజ్ శ‌నివారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఈవెంట్‌లో పాల్గొన్నారు. శాన్వి శ్రీవాస్త‌వ‌, అస్మిత న‌ర్వాల్‌, నిధి అగ‌ర్వాల్‌, మాన్వితా కామ‌త్‌, రుహాని శ‌ర్మ‌, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ‌, సుధీర్‌బాబు త‌దిత‌రులు కూడా పాల్గొన్నారు.

విష్ణు వ‌ర్ధ‌న్ ఇందూరి మాట్లాడుతూ “ఆగ‌స్ట్ 15-16న ఖ‌తార్ దోహాలో ఈ వేడుక‌ను నిర్వ‌హిస్తాం. ఫ్యాష‌న్‌ను, సినిమా ప‌రిశ్ర‌మ‌ను విడ‌దీసి చూడ‌లేం. సినిమా తార‌లు ధ‌రించిన వాటిని మ‌న ప్రేక్ష‌కులు కూడా ధ‌రించడానికి మ‌క్కువ చూపుతారు. స్టైల్స్ లో ఎప్పుడూ త‌న‌దైన బ్రాండ్ ఉన్న పాంట‌లూన్స్ మా టైటిల్‌ను స్పాన్స‌ర్ చేయ‌డం ఆనందంగా ఉంది. `సైమా` ఇంత‌కు ముందు క‌న్నా ఈ ఏడాది ఇంకా క‌ల‌ర్‌ఫుల్‌గా ఉంటుంది“ అని అన్నారు.

ర్యాన్ ఫెర్నాండెస్ మాట్లాడుతూ “సైమాతో చేతులు క‌ల‌ప‌డం ఆనందంగా ఉంది. ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ‌లో ఉన్న టాలెంటెడ్ వ్య‌క్తులను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసే వేదిక. మా కాంబినేష‌న్‌లో బెస్ట్ ఫ్యాష‌న్స్, బెస్ట్ ఫిల్మ్ ఫెట‌ర్నిటీని ఒకే వేదిక‌పై చూడొచ్చు. ఈ వేడుక ద్వారా ద‌క్షిణాదిన మా కన్య్సూమ‌ర్స్ కు మ‌రింత చేరువ‌వుతామ‌ని భావిస్తున్నాం. పాంట‌లూన్స్ ప్ర‌స్తుతం స్టైల్ ఐకాన్ కాంటెస్ట్ ను ప‌లు విధాలుగా హోస్ట్ చేస్తున్నాం. ఇందులో పాల్గొనాల‌నుకునేవారు పాంట‌లూన్స్ డ్ర‌స్సులు,యాక్సెస‌రీస్‌లు వేసుకుని వాళ్ల ఫొటోల‌ను పోస్ట్ చేయాలి. వాటిని చూసి మా ఇంట‌ర్న‌ల్ టీమ్ ఎనిమిది మందిని సెల‌క్ట్ చేస్తారు. దాదాపు 50 వేల మంది వ‌ర‌కు ఇందులో పాల్గొంటార‌ని ఆశిస్తున్నాం. ఎనిమిది మంది విజేత‌ల‌ను సైమా ఫైన‌ల్స్ కు ఖ‌తార్‌కు తీసుకెళ్తాం“ అని అన్నారు.
తెలుగులో టాప్ నామినేష‌న్స్

1. రంగ‌స్థలం : 12 నామినేష‌న్స్
2. మ‌హాన‌టి: 9 నామినేష‌న్స్
3. గీత గోవిందం: 8 నామినేష‌న్స్
4. అర‌వింద స‌మేత‌: 6 నామినేష‌న్స్
త‌మిళంలో టాప్ నామినేష‌న్స్
1. 96 : 10 నామినేష‌న్స్
2. కోల‌మావు కోకిల : 7 నామినేష‌న్స్
3. వ‌డ చెన్నై : 6 నామినేష‌న్స్
మ‌ల‌యాళంలో టాప్ నామినేష‌న్స్
1. సుదాని ఫ్రం నైజీరియా : 9 నామినేష‌న్స్
2. వ‌ర‌ద‌న్ – 6 నామినేష‌న్స్
3. అర‌విందంటె అదితిక‌ల్ : 5 నామినేష‌న్స్
4. పూమ‌రం: 5
టాప్ నామినేష‌న్స్ ఇన్ క‌న్న‌డ‌
1. కేజీఎఫ్ చాప్ట‌ర్ 1 : 12 నామినేష‌న్స్
2. త‌గ‌రు : 11 నామినేష‌న్స్
3. స‌ర్కారి హి. ప్ర‌. షాలే, కాస‌ర‌గోడు, కొడుగె : రామ‌న్న రాయి 10 నామినేష‌న్స్
ఈ ఏడాఇ కూడా షార్ట్ ఫిల్మ్స్ అవార్డుల‌ను సైమా హోస్ట్ చేస్తోంది.

గ‌త మూడేళ్లుగా ప‌లువురు వర్ధ‌మాన ఫిల్మ్ మేక‌ర్స్ షార్ట్ ఫిల్మ్స్ చేసి సినిమాల్లోకి వ‌చ్చి స‌క్సెస్‌లు కొట్ట‌డాన్ని సైమా గుర్తిస్తూనే ఉంది. ఈ షార్ట్ ఫిల్మ్స్ అవార్డుల గురించి విష్ణు వ‌ర్ధ‌న్ ఇందూరి మాట్లాడుతూ “యంగ్ ఫిల్మ్ మేక‌ర్స్ లో ఉన్న టాలెంట్‌ను బ‌య‌ట‌కు తీసుకురావ‌డానికే ఈ షార్ట్ ఫిల్మ్ అవార్డుల‌ను పెట్టాం. వీటి వ‌ల్ల ఫ్రెష్ థాట్స్, టెక్నిక్స్ ని ప్రోత్స‌హించిన వాళ్లం అవుతాం. 2018లో వేరియ‌స్ ఫ్లాట్‌ఫార్మ్స్ లో పోస్ట్ అయిన షార్ట్ ఫిల్మ్స్, వాటికి వ‌చ్చిన వ్యూస్‌, వాటికి వ‌చ్చిన కామెంట్లు వంటి వాటిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని నామినీట‌ల‌ను ఫైన‌లైజ్ చేస్తాం. ప్ర‌తి కేట‌గిరీలోనూ ఎంపిక చేసిన నామినేష‌న్ల‌ను జ్యూరీ ముందు ఉంచుతాం. వాళ్ల ద్వారా విన్న‌ర్‌ల‌ను సెల‌క్ట్ చేస్తాం. విబ్రి మీడియా ప్ర‌స్తుతం హిందీలో `83` చిత్రాన్ని, `జ‌య‌` చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి విదిత‌మే“ అని తెలిపారు.
 
 
 
 
 
Attachments area