ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతి ని మెదటి స్థానం లో నిలబెట్టిన ‘బాహుబలి’ 1, 2 చిత్రాల తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం ‘సాహో. ఇండిపెండెన్స్ డే కానుకగా అగస్ట్ 15 న ప్రపంచవ్యాప్తంగా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ గా విడుదలవుతుంది. ఈ చిత్రం ప్రమెషన్ ని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇన్‌స్ట్రాగ్రామ్ ద్వారా మెదలుపెట్టిన విషయం తెలిసిందే. మరో కొత్త పోస్టర్ లో అగష్టు 15న వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నాం అని తెలియజేశారు. స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా విడుదలవుతుందని తెలుసుకున్న యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరూ సంబరాల్లో మునిగిపోయారు. ఇండియన్ సినిమాకి కెరాఫ్ అడ్రాస్ గా మారిన బాహుబలి తరువాత తన అభిమాన హీరో చిత్రం విడుదల అవుతుందన్న ఆనందం సోషల్ మీడియాలోను, సినిమా ప్రేక్షకుల్లోను ఇటు అభిమానుల్లో ను ఆనందానికి అవధులు లేవు.. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబందించి రెండు చాప్టర్ వీడియోస్ విడుదలయ్యి ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ ని క్రియెట్ చేయటం విశేషం.
ఈ సందర్భం గా యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్-విక్కీ లు మాట్లాడుతూ.. ఇండియన్ హిస్టరీలోనే అత్యంత భారి విజయాన్ని సొంతం చేసుకున్న బాహుబలి చిత్రం తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం కావటం వలన అభిమానుల అంచనాలు అందుకునే ప్రయత్నం లో ఈ సాహో సబ్జక్ట్ కి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారిబడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. మూడు భాషల్లో ఒకేసారి షూట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఒకే రోజున అగష్టు 15న విడుదల చేస్తున్నాం. ఇప్పటికే రెబల్‌స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1 కి ఇండియా మెత్తం క్రేజ్ వచ్చింది. ప్రపంచంలో వున్న రెబెల్‌స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. షేడ్స్ ఆఫ్ సాహో 2 తో ఈ చిత్రం హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ బర్త్ డే కానుకగా విడుదల చేసిన వీడియో కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ స్పెషల్ వీడియో లో శ్రద్దా కపూర్ క్యారెక్టర్ లుక్ ని రివీల్ చేసాము. ఈ వీడియో లో ప్రభాస్, శ్రద్దా కపూర్ స్టైలిష్ లుక్స్… ఇంటర్నేషనల్ స్టాండర్ఫ్స్ మేకింగ్ హైలైట్ గా నిలుస్తున్నాయి. ఈ మేకింగ్ వీడియోతో ఈ సినిమా ఏ రేంజ్ లో తీస్తున్నాము అనేది మరింత స్పష్టమైంది. డినో యురి 18 కెడబ్ల్యూ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమా విజువల్స్ ని క్యాప్చర్ చేయడం మరో విశేషం. ఇంతటి భారీ ప్రతిష్టాత్మక చిత్రానికి రన్ రాజా రన్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. సాహోని ఓ విజువల్ వండర్ గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు సుజిత్ తో పాటు హాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. హైటెక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో మైమరపించే యాక్షన్ సన్నివేశాలను అంతర్జాతీయ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో చిత్రీకరిస్తున్నారు. ప్రేక్షకుల, అభిమానుల అంచనాలను అందుకునేలా సాహోలో ప్రభాస్ స్టైలిష్ గా, ఓ కొత్త ఎనర్జీ తో కనిపించబోతున్నారు. ఇదెలా ఉంటే మెము ఇప్పడు విడుదల చేసిన డేట్ పోస్టర్ కి చాలా మంచి రెస్పాన్స్ రావటం విశేషం. తెలుగు సినిమా ప్రేక్షకులన్ని, అభిమానుల్ని ఆకట్టుకునేలా చిత్రాన్ని అగష్టు 15న విడదల చేస్తున్నాం. అని అన్నారు.
స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ “సాహో”
Reading Time: 2 mins