హలో ట్రయిలర్ రివ్యూ

Published On: December 2, 2017   |   Posted By:
హలో ట్రయిలర్ రివ్యూ
కెరీర్ లో హీరోగా అఖిల్ నటిస్తున్న రెండో సినిమా హలో. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నాగార్జున నిర్మాత. అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రయిలర్ తాజాగా విడుదలైంది. టీజర్ కు కొనసాగింపుగా కట్ అయిన హలో ట్రయిలర్ ఎలా ఉందో చూద్దాం.
హలో ట్రయిలర్ కూడా నాగార్జున వాయిస్ ఓవర్ తోనే ప్రారంభమైంది. ట్రయిలర్ లో అఖిల్ క్యారెక్టర్ పేరును, చిన్నప్పుడు ఎలా ఉండేవాడు అనే విషయాన్ని నాగ్ వివరించాడు. ఓ అమ్మాయి కోసం చిన్నప్పట్నుంచి అఖిల్ ఎలా పరితపించాడనే విషయాన్ని ట్రయిలర్ లో చూపించాడు. ఆమెను వెదుక్కుంటూ వెళ్లిన అఖిల్.. విలన్ల మధ్య ఎలా చిక్కుకున్నాడు.. దాన్నుంచి ఎలా బయటపడి హీరోయిన్ ను చేరుకున్నాడనే కథతో హలో తెరకెక్కిందనే విషయం ట్రయిలర్ చూస్తే తెలుస్తోంది.
ఇక ట్రయిలర్ లో మరో ముఖ్యమైన విషయం ఫోన్. ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచి మొబైల్స్ ను కీలకంగా చూపిస్తూనే ఉన్నారు. ఆ యాంగిల్ ను ట్రయిలర్ లో కొంచెం రివీల్ చేశారు. తన ఫోన్ పోగొట్టుకున్న హీరో విలన్లతో గొడవకు దిగినట్టు ట్రయిలర్ లో చూపించారు. సినిమా చూస్తే దీనిపై మరింత క్లారిటీ వస్తుంది. అటు టెక్నికల్ గా కూడా హలో ట్రయిలర్ చాలా బాగుంది. పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫీ, అనూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కెన్నీ బేట్స్ స్టంట్స్ ట్రయిలర్ లో హైలెట్స్ గా నిలిచాయి.